సబితకు చుక్కెదురు.. ఉద్వాసన తప్పదా ?

Publish Date:Jul 6, 2022

Advertisement

కాంగ్రెస్ టికెట్ మీద గెలిచి, తెరాసలో చేరి, ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో స్థానం సంపాదించుకున్నవిద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చిక్కుల్లో చిక్కుకున్నారా? ఓ వంక శాఖపరమైన సమస్యలు, మరోవంక రాజకీయ సవాళ్ళు ఒకేసారి దండయాత్ర చేయడంతో ఆమె ఉక్కిరి బిక్కిరి అవుతున్నారా, అంటే, అవును, ఆమె ఒక్కసారిగా ముప్పేట దాడిని ఎదుర్కుంటున్నారు.  ఇంటా బయటా విమర్శలు ఎదుర్కుంటున్నారని, అంటున్నారు.  

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధుల ఆందోళనను పరిష్కరించే క్రమమలో విద్యార్ధుల డిమాండ్లు సిల్లీగా ఉన్నాయని ఆమె చేసిన వ్యాఖ్యలు, ఆమెనే సిల్లీ మంత్రిని చేశాయి. రాష్ట్రంలోని అత్యంత ప్రతిష్టాత్మక విద్యా సంస్థలలో ఒకటిగా పేరొందిన, బాసర ట్రిపుల్ ఐటీలో కనీస మౌలిక వసతులు లేవని విద్యార్ధులు ఆందోళనకు దిగితే, మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, విధ్యార్దుల డిమాండ్లు సిల్లీగా ఉన్నాయని అన్నారు. ఆమె చేసిన ఆ వ్యాఖ్య పెద్ద దుమారమే రేపింది. ఒక విధంగా విధ్యర్ధులను రెచ్చ గొట్టి, ఉద్యమం ఉధృతం కావడానికి కూడా ఆమె వ్యాఖ్యలే కారణ మయ్యాయి. మరోవంక  విద్యార్ధుల నుంచే కాకుండా సామాన్య ప్రజల నుంచి కూడా ఆమె, విమర్శలు ఎదుర్కున్నారు.

అలాగే, గురుకుల పాఠశాలలలో, పిల్లలకు సన్న బియ్యంతో, పౌష్టిక ఆహారం అందిస్తున్నామని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నా, వాస్తవంలో బియ్యంలో పురుగులు వస్తున్న ఉదంతాలు, వెలుగు చూస్తున్నాయి. పిల్లలు పురుగుల అన్న తినలేక పస్తులుంటున్నారు. ఆకలితో  రోదిస్తున్నారు. అస్వస్థకు గురవుతున్నారు. ఇదంతా కూడా ఎక్కడో కాదు, మంత్రి సబితా ఇంద్ర రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజక వర్గం పరిధిలోని, పాఠశాలలలోనే ఈ పరిస్థితులు ఉన్నాయని, మీడియాలో సచిత్ర కథనాలు ప్రసారం అవుతున్నాయి. ఇక పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదల, ఉపాధ్యాయుల కొరత ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందనే విమర్శలు ఉండనే ఉన్నాయి. ఇంటర్ పరీక్షా ఫలితాల విడుద ఎన్నిసార్లు సార్లు వాయిదా పడిందో  విద్యాశాఖ  అధికారులకు అయినా తెలుసో లేదో అనుమానమే. నిజానికి లోపం, ఎక్కడుందో కానీ, ఇప్పటికే కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్య వాగ్దానం గాలికి వదిలేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వం, ఇప్పుడు, సబితా ఇంద్రా రెడ్డి   అవగాహన రాహిత్యం కారణంగా మరింత అభాసు పాలవుతోందని, అంటున్నారు. 

అదొకటి అలా ఉంటే, ముందూ వెనకా చూసుకోకుండా ప్రభుత్వ  పాఠశాలలలో  పని చేసే టీచర్లు అందరూ తమ వార్షిక ఆదాయాన్ని ప్రకటించాలంటూ పాఠశాల విద్యా శాఖ జారీ చేసిన జీవో పెద్ద దుమారమే రేపింది. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో పాటు.. ప్రతిపక్షాలు కూడా ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి.. తప్పుపట్టాయి.  ఉపాధ్యాయులను టార్గెట్‌ చేసి ఉద్దేశ్ పూర్వకంగా ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందనే విమర్శలు వచ్చాయి. దీంతో,వెంటనే ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటున్నట్టు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.

ఇలా అడుసు తొక్కడం, కాలు కడగడం విద్యాశాఖకు, విద్యాశాఖ మంత్రికి అలవాటుగా మారి పోయిందని వస్తున్న విమర్శలు ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చి వేస్తున్నాయని తెరాస శ్రేణులే అంటున్నాయి.   
ఇవన్నీఒకెత్తు అయితే, సొంత పార్టీ నుంచే మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. మంత్రి భూకబ్జాలు ప్రోత్సహిస్తున్నారని, మాజీ ఎమ్మెల్యే, టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు తీగల కృష్ణా రెడ్డి గత కొద్ది రోజులుగా ఆమెపై సంచలన ఆరోపణలు చేస్తున్నారు. అంతే కాకుండా ఆమె భూకబ్జాల చిట్టా మొత్తం బయట పెడతానని బహిరంగంగా ప్రకటనలు గుప్పిస్తున్నారు. తగ్గేదేలే’ అంటూ సవాలు విసురుతున్నారు. మరో వంక సబితా సబితా ఇంద్రారెడ్డి, అలాంటిదేమీ లేదంటూనే, ఉన్నా,  ముఖ్యమంత్రి చూసుకుంటారని, సీఎం చాటున రక్షణ పొందే ప్రయత్నం చేస్తున్నారు.

ఇరువురు నేతల మధ్య బాహాటంగా జరుగుతున్న రగడ పార్టీలో చర్చకు కారణంగా మారింది. పబ్లిక్ లో పార్టీ ప్రతిష్టను దిగజార్చింది.  కాగా, మంత్రి పై తీవ్ర విమర్శలు చేసిన తీగల, కబ్జాకు కాదేదీ అనర్హం అన్నట్లుగా చెరువులు, పాఠశాలల స్థలాలను కూడా సబితా కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. అలాగే, ఆమె రాజకీయ చరిత్రను వదలకుడా తీగల రాజకీయ విమర్శలు చేశారు. రాజకీయ అస్త్రాలు సంధించారు.ను  ఆమె తెరాస టికెట్ మీద గెలలేదని, గుర్తు చేసిన ఆయన, మంత్రి సబితా ఇంద్రారెడ్డి వైఖరిపై సీఎం కేసీఆర్ తో కూడా తాను చర్చిస్తానని పేర్కొన్నారు.

అయితే, రేపో మాపో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమవుతున్న తీగల ఆరోపణలను ముఖ్యమంత్రి ఎంతవరకు సీరియస్ గా తీసుకుంటారనేది,చూడవలసి ఉందని అంటున్నారు. అయితే, విద్యా శాఖ పనితీరు పై వస్తున్న విమర్శలు, రాజకీయంగా వస్తున్న విమర్శల నేపధ్యంలో ముఖ్యమంత్రి, ఆమెకు ఉద్వాసన పలికే అవకాశం లేక పోలేదని పరిశీలకులు అంటున్నారు. అలాగే, ఇంతాకాలం ప్రత్యర్ధులు టార్గెట్ గా ఎన్నికల వ్యూహ రచన చేస్తున్న ముఖ్యమంత్రి, అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ దూకుడు పెంచిన నేపధ్యంలో ఇక పార్టీ, ప్రభుత్వ పక్షాళనపై దృష్టి పెట్టే అవకాశం లేక పోలేదని అంటున్నారు.అదే జరిగితే, కొందరు ఫిరాయింపు మంత్రులకు ఉద్వాసన తప్పక పోవచ్చని, ఆ జాబితాలో సబితా ఇంద్రా రెడ్డి పేరు ఖాయంగా ఉంటుందని అంటున్నారు.

By
en-us Political News

  
తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసింది. ఏపీ అసెంబ్లీ, లోక్ సభ, అలాగే తెలంగాణ లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ వచ్చే నెల 13న జరగనున్న సంగతి తెలిసిందే.
గత ఎన్నికల ముందు జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఈ ఎన్నికలలో వైసీపీ పుట్టి ముంచేదిగా మారిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత ఎన్నికలలో బాబాయ్ ని హత్య చేశారంటూ విపక్షంపై ఆరోపణలు గుప్పించడం ద్వారా సానుభూతి వర్షించి జగన్ పార్టీ విజయానికి దోహదపడిన వివేహా హత్య కేసు.. ఐదేళ్లు గిర్రున తిరిగేసరికి జగన్ కు చుట్టుకుంది.
సినీ గేయ రచయత జొన్నవిత్తుల ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. ఆయన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా తన నామినేషన్ దాఖలు చేశారు. సినీ రంగం నుంచి జొన్నవిత్తుల కంటే ముందు ఎందరో రాజకీయాలలోకి ప్రవేశించారు.
ఎన్నికలు వస్తె, పదే పదే ఈవిఎం ల మీద దుమ్మెత్తి పోసే వారికి కొదవలేదు. గత 40 ఏళ్లుగా అనేక అవరోధాలను అధిగమించి, భారత దేశ సాంకేతికతకు తిరుగులేదని ఓటింగు యంత్రాలు అనేక సార్లు నిరూపించుకున్నాయి. ఇప్పుడు భారత ఉన్నత న్యాయస్థానం మరోమారు ఓటింగు యంత్రాలు పట్ల పూర్తి విశ్వాసం వెలువరించింది. వూహాజనిత ఆరోపణలపై ఓటింగు యంత్రాలపని తీరును తప్పు పట్టలేమని స్పష్టం చేసింది.
ఎన్నికల అంశంగా, సానుభూతి వర్షం కురిపించేలా మారుతుందని ఏపీ సీఎం జగన్, వైసీపీ నేతలూ భావించిన రాయి దాడి సంఘటన చివరకు అధికార పార్టీ పరువును దిగజార్చడానికి మాత్రమే దోహదపడింది. రాయి దాడి సంఘటన నాటి నుంచీ ఓ వారం రోజుల పాటు రాష్ట్ర రాజకీయాలలో దాని గురించి తప్ప మరో చర్చ లేకుండా పోయింది.
మల్కాజ్ గిరి పై పట్టుకోసం మూడు పార్టీల మ‌ధ్య ఆసక్తికరమైన పోరు నెల‌కొంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో దేశంలోని అన్ని రాష్ట్రాల, ప్రాంతాల ప్ర‌జ‌లు ఉంటారు. అందుకే మ‌ల్కాజ్ గిరి అంటే మినీ ఇండియాగా పేరుంది. పైగా దేశంలోని అతిపెద్ద లోక్ స‌భ సెగ్మెంట్ల‌లో కూడా మ‌ల్కాజ్ గిరి ఒక‌టి. సీఎం రేవంత్ రెడ్డి మొన్న‌టి వ‌ర‌కు ఇక్క‌డి నుండే ప్రాతినిధ్యం వ‌హించారు. ఇప్పుడు బీఆర్ ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్ నేత‌లంతా ఫోక‌స్ చేస్తున్నారు.
జగమెరిగిన కమేడియన్ అలీ.. ఎలాగైనా సరే చట్టసభకు వెళ్లాలని తహతహలాడారు. అన్ని పార్టీలూ తిరిగి, అన్ని చర్చలూ జరిపి.. తనకు పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించుకునేది ఒక్క వైసీపీ మాత్రమేనని నమ్మి గత ఎన్నికల ముందు ఆయన జగన్ ను నమ్ముకుని ఫ్యాన్ పార్టీ గూటికి చేరారు.
వైసీపీ గెలుపు ఆశలు రోజు రోజుకూ ఆవిరైపోతున్నాయి. బటన్ నొక్కి పన్నుల రూపంలో ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్మును పంచడం మాత్రమే పాలన అనుకుని ఐదేళ్లుగా అదే చేస్తూ వచ్చిన జగన్ సర్కార్ కు యువత షాక్ ఇవ్వడానికి రెడీ అయిపోయింది.
ఖ‌మ్మం పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం కాంగ్రెస్ అభ్య‌ర్థిపై స్ప‌ష్ట‌త వ‌చ్చింది. రామ స‌హాయం ర‌ఘురామిరెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అధికారికంగా ప్ర‌క‌టించింది. గత ఏడాది డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో కాంగ్రెస్ హ‌వా కొన‌సాగింది. లోక్ స‌భ ఎన్నిక‌ల్లోనూ ఖ‌మ్మంలో విజ‌యం సాధించేలా పార్టీ అధిష్టానం అభ్య‌ర్థి ఎంపిక‌లో పెద్ద క‌స‌ర‌త్తే చేసింది.
గురువారం నాడు పులివెందులలో జగన్మోహన్‌రెడ్డి నామినేషన్ వేయబోతున్నారు.
ఇది యావత్ భర్తలు సానుభూతిని వ్యక్తం చేయాల్సిన ఘటన. ఇలాంటి పరిస్థితి తమకూ రాకూడదని ప్రార్థించాల్సిన ఘటన.
లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పార్టీ ప్రచారంలోకి దిగారు.
కేసీఆర్ తన పార్టీ పేరును ఏ దుర్ముహూర్తంలో ‘టీఆర్ఎస్’ నుంచి ‘బీఆర్ఎస్’ అని మార్చాడో అప్పటి నుంచి ఆయన కుటుంబాన్ని,
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.