ఇటు అవిశ్వాసం అటు ఆర్డినెన్సు.. వచ్చే వారం కేంద్రానికి గడ్డు కాలమే

Publish Date:Jul 29, 2023

Advertisement

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు  ప్రారంభం మొదలు, మణిపుర్ అంశం చుట్టూనే తిరుగుతున్నాయి. మణిపుర్ హింసపై ప్రధాని నరేంద్ర మోీ సభలో ప్రకటన చేయాలని పట్టుబడుతున్న ప్రతిపక్ష పార్టీలు వరసగా రెండవ వారం కూడా పార్లమెంట్ ఉభయ సభలను  స్తంబింప చేశాయి. ఈ రెండు వారాలలో ప్రభుత్వం, విపక్షాలు కొనాగిస్తున్న నిరసనల మధ్యే ఏవో కొన్ని బిల్లులు ఆమోదం పొందాయి. అంతకు మించి, మణిపుర్ సహా,ఏ అంశంపైనా చర్చ జరగలేదు.

మరోవంక ఇటీవల  ఐఎన్డీఐఎ (ఇండియ) గా నామకరణం చెసుకున ప్రతిపక్ష పార్టీల కూటమి ప్రదాని మోడీ ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానం నోటీసును ఇచ్చాయి. అవిశ్వాస తీర్మానం నిబంధనలను అనుసరించి స్పీకర్ ఆమోదించారు. కాగా, విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై  పై  ఆగస్టు 2 లేదా 3 తేదీల్లో చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.ఈ మేరకు చర్చ తేదీని,  సోమవారం (జులై 31) ఖరారు చేసే అవకాశం ఉంది.

నిజానికి లోక్ సభలో అధికార ఎన్డీఎ కూటమికి సంపూర్ణ మెజారిటీ ఉన్న నేపథ్యంలో అవిశ్వాస తీర్మానం ఖాయంగా వీగిపోతుంది.అందులో సందేహం లేదు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు విపక్షాలు సిద్దమవుతున్నాయి. అలాగే  అధికార కూటమి విపక్షాల విమర్శలను, ఎత్తుగడలను తిప్పికొట్టేందుకు సిద్దమవుతోంది. అలాగే ఢిల్లీ సర్వీసులకు సంబంధించిన ఆర్డినెన్స్‌ స్థానంలో ప్రవేశ పెట్టే బిల్లు కూడా  దిగువ సభలో సునాయాసంగా నెగ్గుతుంది. సో .. మూడవ వారంలోనూ దిగువ సభకు సంబంధించినంత వరకు సర్కార్ కు చిక్కులేమీ లేవు.  

అయితే  వచ్చేవారం అటు అధికార కూటమి ఇటు విపక్ష కూటమి అసలు సవాలును పెద్దల సభలో ఎదురు కానుంది. పెద్దల సభలో అధికార కూటమికి పూర్తి మెజారిటీ లేదు. విపక్ష కూటమి ఇండియా పరిస్థితీ అదే.  తటస్థులు ఎటు మొగ్గితే అటు అనుకూల ఫలితం వస్తుంది. ఈ నేపథ్యంలో వచ్చే వారం జరిగే సమావేశాలు ప్రభుత్వానికి అత్యంత కీలకమైనవి. ప్రతిపక్షాల  తీరుచూస్తుంటే వచ్చే వారం సభ అత్యంత ఆసక్తిగా సాగే అవకాశం కనిపిస్తోంది. సో.. ఆగస్టు 11 వరకు కొనసాగే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో వచ్చే వారం సర్కార్  కు గడ్డు కాలం కాగలదని పరిశీలకులు భావిస్తున్నారు. 
రాజ్యసభలో  పార్టీల బలాబలాలు ఇలా ఉన్నాయి.

రాజ్య సభలో మొత్తం సభ్యుల సంఖ్య 243 అయితే ప్రస్తుతం ఐదు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కాబట్టి, రాజ్య సభ  ప్రస్తుత సభ్యుల సంఖ్య 238.. బిల్లు నెగ్గాలంటే 118 మంది మద్దతు అవసరం. కాగా, ఎన్డీఏ కూటమికి 109 మంది ఎంపీలున్నారు. కాంగ్రెస్‌కు 31 మంది సభ్యులు ఉన్నారు.

ఇతర విపక్ష పార్టీలకు చెందిన 70 మంది సభ్యుల మద్దతును ఆప్‌ కూడగట్టింది. బిల్లును అడ్డుకోవాలంటే ఈ సంఖ్య సరిపోదు. విపక్ష పార్టీలు ఆప్‌ (10), టీఎంసీ (12), డీఎంకే (10), బీఆర్‌ఎస్‌ (7), ఆర్జేడీ (6), సీపీఐ(ఎం) (6), జేడీయూ (5), ఎన్సీపీ (4), శివసేన -యూబీటీ (3), ఎస్పీ (3), సీపీఐ (2), జేఎంఎం (2), ఐయూఎంఎల్‌, ఆర్‌ఎల్డీ నుంచి ఒక్కో సభ్యులు ఆప్‌కు మద్దతు ఇస్తున్నారు. విపక్ష సభ్యుల సంఖ్య 101 మాత్రమే ఉంటుంది. దీంతో తటస్థంగా ఉన్న బీజేడీ (9), వైసీపీ (9)ల మద్దతు ఎంతో కీలకంగా మారింది.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.