తిరుమలలో హనుమంతుడి విగ్రహం చోరీ.!

Publish Date:Jul 22, 2026

Advertisement

తిరుమల గిరులలో  హనుమంతుడి విగ్రహం చోరీ అయ్యింది. నిత్యం లక్షల మంది భక్తుల దర్శించుకునే తిరుమల క్షేత్రంలో జరిగిన ఈ ఘోర అపచారంపై సర్వత్రా దిగ్భ్రాంతి, ఆగ్రహం వ్యక్తం అవుతోంది. కోట్లాది మంది భక్తులు ఆరాధ్యదైవంగా పూజించే తిరుమల కొండకు వెళ్లే మార్గంలో  ఆంజనేయ స్వామి విగ్రహం మాయమవ్వడం  రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. నిత్యం వేలాది మంది భక్తుల నమస్కారాలు, నిత్య ధూపదీప నైవేద్యాలు అందుకునే ఆలయంలోనే ఈ దొంగతనం జరగడం భక్తుల తిరుమలలో భద్రతా చర్యలలోని డొల్ల తనాన్ని బట్టబయలు చేసింది.  తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని 7వ మైలు రాయి వద్ద ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో విగ్రహం చోరీ అవ్వడంపై భక్తులలో ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. 

మంగళవారం(జులై 21) అర్ధరాత్రి దాటిన తరువాత ఈ చోరీ జరిగింది.  వేకువజామున స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులకు ఆలయంలో మూలవిరాట్ విగ్రహం కనిపించకపోవడంతో  దిగ్భ్రాంతికి గురయ్యారు. కొండపైకి వెళ్లే భక్తులు నిత్యం 7వ మైలు రాయి వద్ద ఆగి స్వామివారిని దర్శించుకుని, ప్రయాణం సురక్షితంగా సాగాలని వేడుకోవడం ఆనవాయితీ. అటువంటి ఆలయంలోని  ఆంజనేయ స్వామి విగ్రహం చోరీ అవ్వడం పట్ల భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

ఈ ఘటనపై సమాచారం అందుకున్న తిరుమల పోలీసులు, టీటీడీ భద్రతాధికారులు  ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఆలయ పరిసరాల్లో అమర్చిన సిసిటివి  కెమెరా ఫుటేజీలను పరిశీలించగా,  అర్థరాత్రి సమయంలో కాషాయ దుస్తులు ధరించిన   వ్యక్తి ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించినట్లు రికార్డయింది. అతడు  ఆంజనేయ స్వామి చిన్న విగ్రహాన్ని కాషాయ గుడ్డలో చుట్టి, ఎవరికీ అనుమానం రాకుండా దాచిపెట్టుకుని అక్కడి నుండి పరుగులు తీస్తూ పారిపోతున్న దృశ్యాలు  సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.  

  నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు  10 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.  ఘాట్ రోడ్డులోని చెక్ పోస్టులు, తిరుపతి బస్టాండ్, రైల్వే స్టేషన్లతో పాటు పరిసర ప్రాంతాలలోని అన్ని సిసిటివి కెమెరాలను   జల్లెడ పడుతున్నారు. కాషాయ దుస్తుల్లో వచ్చిఈ  అపచారానికి ఒడిగట్టిన దొంగను త్వరలోనే పట్టుకుంటామని అధికారులు చెబుతున్నారు. 

Hanuman idol theft, Anjaneya Swamy idol stolen, Tirumala ghat road incident, Tirumala 7th mile temple, Tirupati latest news, Tirumala police investigation

By
en-us Political News

  
భద్రత దృష్ట్యా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ నగరంలోని 16 మెట్రో స్టేషన్లను తదుపరి ఆదేశాలు వెలువడే వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ స్టేషన్లలో రైళ్లు ఆగవని పేర్కొంది. ఆయా మెట్రో స్టేషన్ల నుంచి ప్రయాణికుల ప్రవేశం, నిష్క్రమణను కూడా నిలిపివేసినట్లు తెలిపింది.
అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకు సుమారు 27.65 కోట్ల విలువైన ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకోగా, మార్కెట్ విలువ ప్రకారం ఈ ఆస్తుల విలువ 400 కోట్ల రూపాయలు ఉండోచ్ని అంచనా.
లీకేజీకి బాధ్యత వహిస్తూ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని యువత డిమాండ్ చేస్తున్నారు. ఈ నిరసనలకు రోజు రోజుకూ మద్దతు పెరుగుతుండటంతో.. ఇంత కాలంగా మౌనంగా ఉన్న ప్రధాని మోడీ అనివార్యంగా స్పందించాల్సి వచ్చింది.
విజిలెన్స్ విచారణ ఆధారంగా రెవెన్యూ అధికారులు విలువైన ప్రభుత్వ, ఇనాం భూములను తిరిగి తమ అధీనంలోకి తీసుకున్నారు. భూమన కరుణాకరరెడ్డి ఆక్రమించిన ఈ భూములు మార్కెట్ విలువ వంద కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా.
పాకిస్ధాన్ ప్రధానిగా మూడు సార్లు పని చేసిన నవాజ్ షరీఫ్.. వివాదాస్పద ఆక్రమిత ప్రాంతానికి ప్రధాని పదవి చేపట్టాలని భావించడం వెనుక వ్యూహం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సామాజిక మాధ్యమాల్లో ఆన్‌లైన్ క్యాంపెయిన్‌లు నిర్వహించడంలో రా ఎన్టీఆర్ తనదైన ప్రత్యేక ముద్ర వేసింది. ఇన్నాళ్లుగా చురుగ్గా పనిచేస్తున్న రా ఎన్టీఆర్ హఠాత్తుగా సేవలను నిలిపివేయడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.
సౌదీ అరేబియా నైరుతి తీరానికి సమీపంలో ప్రయాణిస్తున్న ఒక చమురు ట్యాంకర్‌పై  జరిగిన క్షిపణి దాడి ప్రపంచ దేశాలను నివ్వెరపరిచింది.  పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్న తరుణంలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన ప్రపంచ ఇంధన రవాణాను సందిగ్ధంలో పడేసింది. 
నీట్ లీకేజీకి వ్యతిరేకంగానూ, అలాగే విద్యా వ్యవస్థలో సంస్కరణలను, కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు, యువత చేపట్టిన ఆందోళనలకు సంఘీభావం ప్రకటిస్తూ ఆయేషా ఖాన్ బుధవారం ముంబైలో జరిగిన ర్యాలీ, ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
మూలారామ్, సీమ వేర్వేరు సమయాల్లో, వేర్వేరు ప్రదేశాల్లో జరిగిన హత్య కేసుల్లో నేరస్తులుగా రుజువై యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నారు. అయితే.. శిక్షా కాలంలో వీరి సత్ప్రవర్తన చూసిన జైలు అధికారులు ఈ ఇద్దరినీ సాధారణ జైలు నుండి మండోర్ ఓపెన్ జైలుకు తరలించింది. ఇక్కడే మూలారామ్, సీమలకు పరిచయం ఏర్పడి, అది స్నేహంగా పెరిగి ప్రేమగా మారింది.
ధవళేశ్వరంలో ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న కందుల జెస్సీ.. అంతర్జాతీయ అంతరిక్ష మిషన్‌కు చేరిన ప్రయాణం ప్రతీ చిన్నారికీ గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుందనడంలో సందేహం లేదని పేర్కొన్నారు.
తమ న్యాయమైన హక్కుల కోసం, భవిష్యత్తు రక్షణ కోసం ఢిల్లీ వీధుల్లో ప్రశాంతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగం, నిర్బంధం వంటి అణచివేత చర్యలకు పాల్పడటం వివాదానికి దారితీసింది. రాజకీయ నాయకులు, సామాజిక వేత్తలు పోలీసు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు.
లోహియా కార్ప్ ఐపీఓ ప్రారంభమైంది. రూ. 404 425 ధరల శ్రేణి, 8.47% జిఎంపి లాభాలు, ఆఫర్ ఫర్ సేల్ వివరాలు, కేటాయింపు డేట్లు మరియు బ్రోకరేజ్ సంస్థల విశ్లేషణను ఇక్కడ పూర్తిగా తెలుసుకోండి.
హ్యుందాయ్ కార్ల ఫ్యాక్టరీలో బోస్టన్ డైనమిక్స్ అట్లాస్ హ్యూమనాయిడ్ రోబోల ప్రవేశానికి వ్యతిరేకంగా 39,000 మంది కార్మికులు చేపట్టిన చారిత్రాత్మక సమ్మె, రూ. 1,000 కోట్లకు పైగా ఉత్పత్తి నష్టం మరియు AI రోబోటిక్స్ యుగంలో ఉద్యోగ భద్రత గురించిన పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.