మరోసారి రాయపాటి సంచలన వ్యాఖ్యలు

Publish Date:Jan 21, 2012

Advertisement

గుంటూరు: గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి చేసిన విమర్శలకు ఆయన మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్‌ పార్టీ తమ సామాజిక వర్గాన్ని టిష్యూ పేపర్‌ లా వాడుకుంటోందని అన్నారు. తమ సామాజిక వర్గానికి పార్టీలో గుర్తింపు లభించడంలేదని... కాంగ్రెస్‌లో నుంచి బయటికి రావాలంటూ తమ సామాజిక వర్గ ప్రజలు తమపై వత్తిడి తేస్తున్నారని చెప్పారు. తాను 30 సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేస్తున్నా గుర్తింపు లభించడంలేదన్నారు. చిరంజీవి వర్గానికి పదవులు ఇస్తే తప్పు లేదు గానీ సీనియర్లను కూడా పట్టించుకోవాలని ఆయన అన్నారు. కమ్మ సామాజిక వర్గానికి పదవులు ఇవ్వడం లేదని, దీంతో తమ వర్గం వారు తమను తిడుతున్నారని ఆయన  అన్నారు. తెలంగాణవారికి కూడా మంత్రి పదవులు ఇస్తే సమతుల్యత ఏర్పడుతుందని ఆయన అన్నారు. పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యం తగ్గిందనే గాదె వెంకటరెడ్డి మాటల్లో నిజం ఉందని ఆయన అన్నారు. పదవుల కోసం ఎగబడుతున్నవారు పార్టీని గెలిపించే బాధ్యత తీసుకోవాలని ఆయన అన్నారు. తమకు పదవులు అవసరం లేదని, ఇచ్చినా తీసుకోబోమని ఆయన అన్నారు. మంత్రి వర్గ విస్తరణలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మరింత స్వేచ్ఛ ఇవ్వాల్సిందని ఆయన అన్నారు.

By
en-us Political News

  
సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో, అంతే స్థాయిలో నేరగాళ్ల అక్రమ మార్గాలు కూడా పెరిగిపోతున్నాయి.
విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉంటూ.. ఎండ, వాన, పగలు, రాత్రి తేడా లేకుండా ప్రజల రక్షణ కోసం శ్రమించే పోలీసుల ఆరోగ్యంపై తెలంగాణ పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది.
రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపిన ఒక అనూహ్య ఘటనలో, నకిరేకల్ శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ వేముల వీరేశంకు పెను ప్రమాదం తృటిలో తప్పింది.
హైదరాబాద్ పాతబస్తీలో మైనర్ బాలుడిపై లైంగిక వేధింపుల ఘటన తీవ్ర కలకలం రేపింది.
బాధితుల కోర్టు ధిక్కరణ పిటిషన్ విచారించిన  హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.వి. భాస్కర్ రెడ్డి  చట్టాన్ని రక్షించాల్సిన బాధ్యతలో ఉన్న ఒక పోలీసు అధికారి  కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడం గర్హనీయమని పేర్కొంటూ,  కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ధిక్కరించిన సీఐకు శిక్ష  విధించింది.  
తెలంగాణ రాష్ట్రంలో యాదవ సోదరుల ఆత్మగౌరవ వేడుకగా భావించే చారిత్రక సదర్ సమ్మేళనం అత్యంత వైభవంగా జరిగింది.
కదులుతున్న బస్సులోంచి తోసేయడంతో విషాదం.. ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారం.!
టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన తాజా సంచలన చిత్రం ఇరుముడి చట్టపరమైన చిక్కుల్లో పడింది.
60 తులాల బంగారం, రూ.10 లక్షల నగదు అపహరణ.!
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
అవసరానికి ఆదుకుంటుందనే నమ్మకంతో ఓ వ్యక్తి ర్యాపిడో పార్సిల్ సేవలను ఆశ్రయించాడు.
బిగ్ బ్రదర్ ఆఫీసులో రియల్టర్‌కు ప్రత్యేక ఛాంబర్.. ఒక్క బిల్డర్ కోసం వేలాది కుటుంబాలను రోడ్డున పడేస్తారా?
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అమాయక యువతులను లక్ష్యంగా చేసుకుని గుట్టు చప్పుడు కాకుండా నడుపుతున్న మరో అక్రమ ఫెర్టిలిటీ రాకెట్‌ను పోలీసులు రట్టు చేశారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.