బాలయ్య పోటీ ..మాచర్లా,ఒంగోలా?
Publish Date:Jan 21, 2012
Advertisement
హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ నేత బాలకృష్ణ ప్రకటించిన విషయం తెల్సిందే. దీంతో ఆయన ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్న అంశంపై ఆ పార్టీతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర స్థాయిలో చర్చ సాగుతోంది. గుంటూరు జిల్లా మాచర్ల స్థానం నుంచి లేదా ప్రకాశం జిల్లాలోని ఒంగోలు కానీ, మార్టూరు నియోజకవర్గాల్లో ఒక స్థానం నుంచి పోటీ చేయాలని పలువురు నేతలు సూచన చేస్తున్నారు.ఎందుకంటే ఇక్కడ బాలకృష్ణకు వ్యక్తిగతంగా మంచి ఆదరణ ఉంది. అందువల్ల ఈ స్థానాల్లో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేస్తే గెలుపు నల్లేరుపై నడకలా ఉంటుదన్నది వారి అభిప్రాయంగా ఉంది. ఒకవేళ రాయలసీమ ప్రాంతం నుంచి పోటీ చేయాల్సి వస్తే కర్నూలు అసెంబ్లీ సెగ్మెంట్, అదే తెలంగాణ రీజియన్ నుంచి పోటీ చేయాలనుకుంటే.. కూకట్పల్లి లేదా సనత్నగర్ నుంచి పోటీ చేయడం మంచిదని సూచన చేస్తున్నారు.
మరికొందరు నేతలు మాత్రం... బాలకృష్ణ రాష్ట్ర రాజకీయాల కంటే జాతీయ రాజకీయాలపై దృష్టి సారించాలని కోరుతున్నారు. ఒక పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తే ఆ ప్రభావం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లపై ఉంటుందని వారి అభిప్రాయంగా ఉంది. ఇదే పరిస్థితి ఉత్పన్నమైతే.. నర్సారావుపేట లేదా నెల్లూరు స్థానాల్లో పోటీ చేయాలని కోరుతున్నారు.
http://www.teluguone.com/news/content/assembly-elections-24-11115.html





