ఓడిన కార్పొరేటర్ల వసూళ్ల పర్వం! గ్రేటర్ లో కొత్త పంచాయితీ  

Publish Date:Dec 17, 2020

Advertisement

తెలంగాణ రాజకీయాలను హీటెక్కించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమరం ముగిసింది. ఫలితం కూడా వచ్చేసింది. కాని ఇంకా కొత్త బల్దియా కొత్త పాలక మండలి కొలువు దీర లేదు. ప్రస్తుత పాలక మండి గడువు వచ్చే ఫిబ్రవరి వరకూ ఉంది. దీంతో గ్రేటర్ లో అనుకున్న ఫలితాలు సాధించని అధికార పార్టీ.. కొత్త పాలక మండలి ఏర్పాటుపై ఆచితూచి స్పందిస్తోంది. ఫిబ్రవరి వరకూ పాత టీమ్ నే కొనసాగించే ప్రయత్నం చేస్తోంది. ఇదే ఇప్పుడు జీహెచ్ఎంసీలో పెద్ద సమస్యగా మారింది. తాజా ఎన్నికల్లో ఓడిపోయిన సిట్టింగ్ కార్పొరేటర్లు అక్రమ దందాలకు తెర తీశారని తెలుస్తోంది. ఎన్నికల్లో ఓడిపోయామనే కసితో ఉన్న పాత కార్పొరేటర్లు.. తమకు మరో రెండు నెలలు అధికారం ఉండటంతో రెచ్చిపోతున్నారట. అందినకాడికి దోచుకుంటున్నారట. ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా పని చేశారనే అనుమానం ఉన్న వ్యక్తులను కావాలనే టార్గెట్ చేస్తున్నారని తెలుస్తోంది. తమకు సహకరించే అధికారులతో కలిసి తమ ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టాలని పాత కార్పొరేటర్లు ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. 

 

డివిజన్లలో పాత కార్పొరేటర్లు, కొత్తగా గెలిచిన కార్పొరేటర్ల మధ్య పంచాయితిలు జరుగుతున్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచిన చోట ఈ సమస్య లేదు. పాతబస్తిలో తన స్థానాలను ఎంఐఎం నిలుపుకుంది కాబట్టి అక్కడ కూడా పెద్ద ఇబ్బంది లేదు. కాని బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచిన డివిజన్లలో మాత్రం ఇలాంటి గొడవలు ముదురుతున్నాయి. ఫిబ్రవరి వరకూ తమదే అధికారమని టీఆర్ఎస్ పాత కార్పొరేటర్లు చెబుతుండగా.. ఎన్నికల్లో గెలిచిన తమకే ఆ అధికారం ఉంటుందని విపక్ష నేతలు వాదిస్తున్నారు. పాత, కొత్త కార్పొరేటర్ల మధ్య గొడవలతో బల్దియా అధికారులు నలిగిపోతున్నారని తెలుస్తోంది. బీజేపీ కార్పొరేటర్లు ఎక్కువగా గెలిచిన ఎల్బీన‌గ‌ర్, గోషామ‌హ‌ల్, ముషీరాబాద్ , సనత్ నగర్, అంబర్ పేట, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. 

 

ఎల్బీన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం11 డివిజ‌న్లు ఉండ‌గా .. అన్ని డివిజ‌న్లను బీజేపీ గెలుచుకుంది . 2016 ఎన్నిక‌ల్లో ఇక్కడ టీఆర్ఎస్ క్లీన్ స్విప్ చేసింది. ఇక్కడ టీఆర్ఎస్‌కు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఉండటంతో ఆయన పాత కార్పొరేటర్లకు మద్దతుగా ఉంటున్నారు. దీంతో బీజేపీ నుంచి గెలిచిన కార్పొరేట‌ర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఓడించిన కార్పొరేటర్లు ఇంకా డివిజన్ లో పెత్తనం చేయడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. ముషిరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఇదే ప‌రిస్థితి ఉంది. 2016 లో నియోజ‌క‌వ‌ర్గంలోని 6 డివిజ‌న్లకు 5 డివిజ‌న్లను టీఆర్ఎస్, ఒక డివిజ‌న్ ను ఎంఐఎం కైవ‌సం చేసుకున్నాయి. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో 5 డివిజ‌న్లను బీజేపీ గెలుచుకోగా ఒక డివిజ‌న్ ను ఎంఐఎం నిల‌బెట్టుకుంది. ఇక్కడ కూడా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఉన్నారు. దీంతో డివిజన్లలో పెత్తనం కోసం పాత కార్పొరేట‌ర్లకు, కొత్త కార్పొరేట‌ర్లకు అధికారం కోసం ఆదిప‌త్య పోరు జరుగుతోంది. ఎమ్మెల్యే అండతో అధికార పార్టీ పాత కార్పొరేటర్లే అభివృద్ది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 

 

గోషామ‌హ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో ఈ గొడవ తారా స్థాయికి చేరింది. గోషా మహల్ నియోజకవర్గంలో ఆరు డివిజ‌న్లు ఉండ‌గా తాజా ఎన్నిక‌ల్లో బీజేపీ ఐదు డివిజ‌న్లను కైవ‌సం చేసుకుంది. ఇక్కడ ఎమ్మెల్యే బీజేపీ పార్టీకి చెందిన రాజాసింగ్ ఉన్నారు. 2016 లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఇక్కడి నుంచి ముగ్గురు టీఆర్ఎస్ కార్పొరేట‌ర్లు ఉన్నారు. దీంతో రెండు పార్టీల మ‌ధ్య యుద్ధం జ‌రుగుతోంది. పాత కార్పొరేట‌ర్లు బ‌స్తీల్లో పెండింగ్ లో ఉన్న ప‌నులు చేయించ‌డం, ఓడిపోయినా ప్రజల్లో తిరుగుతుండటాన్ని కొత్త కార్పొరేట‌ర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎమ్మెల్యే రాజా సింగ్... సర్కిల్ పరిధిలోని జీహెచ్ఎంసీ అధికారులతో సమావేశమై కొత్తగా గెలిచిన కార్పొరేటర్లకే సహకరించాలని ఆదేశించారనే ప్రచారం జరుగుతోంది. అంబర్ పేట, సనత్ నగర్, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లోనూ మెజార్టీ డివిజన్లు బీజేపీ గెలుచుకుంది. ఇక్కడ కూడా ఇదే సమస్య ఉందంటున్నారు.  

 

ఈసారి అధికార పార్టీ దాదాపు 25 మంది సిట్టింగులను మార్చి కొత్త వారికి అవకాశం ఇచ్చింది. వారిలో కొందరు విజయం సాధించారు. ఇక్కడ కూడా కొత్త, పాత కార్పొరేటర్ల మధ్య రగడ జరుగుతుందట. టికెట్ రాని కొందరు వేరే పార్టీలోకి పోగా.. ఇంకొందరు అధికార పార్టీలో ఉన్నారు. అయితే పాత కార్పొరేటర్ అధికార పార్టీలోనే ఉన్నా.. కొత్తగా గెలిచిన తన పార్టీ నేతలకు వారు సహకరించడం లేదటా. ఈ గొడవతో ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తోంది. తమ సమస్యలు చెప్పుకోవడానికి పాత కార్పొరేటర్ దగ్గరికి వెళ్లాకా లేక కొత్తగా గెలిచిన నేత దగ్గరకు వెళ్లాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారట. కొత్త పాలక మండలి ఏర్పడే వరకు ఈ సమస్యలు తప్పవని భావిస్తున్నారు. ప్రభుత్వమే దీనిపై క్లారిటీ ఇస్తే బెటరని ప్రజలు కోరుకుంటున్నారు.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.