ఎంత లేటయితే.. అంత గ్రేటు....!

Publish Date:Sep 12, 2012

Advertisement

 

కప్పుడు ఏమోకాని ఇప్పుడు మాత్రం పేదవాడికి సెంటు భూమి అందిందంటే అందరికీ ఇట్టే తెల్సిపోతుంది! అదే ఏ పారిశ్రామికవేత్తో రాజకీయనాయకుడో వేల ఎకరాలు అందుకున్నాడనుకోండి (పేరుకు కంపెనీలు కోసమని చెప్పడం రివాజు) దానిగురించి ఎప్పటికోగాని తెలియదు. అప్పటికి సదరు వ్యక్తులు పెట్టిన పెట్టుబడి లాభం రానే వస్తుంది. ఇలా వుంటుంది నేటి పాలకన్యాయం. వివిధ రాష్ట్రాలకు సంబంధించి 24 లక్షల ఎకరాల భూదానభూములకు సంబంధించిన రికార్డులు గల్లంతవడంతో దీన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈనెల 20న ఢల్లీిలో జరగనున్న రాష్ట్రాల రెవెన్యూ మంత్రుల సమావేశంలో ఈ అంశం ప్రధానంగా చర్చకు రానున్నట్లు తెలుస్తోంది.

 

వినోభా భావే 1951లో చేపట్టిన భూదానోద్యమంలో 48 లక్షల ఎకరాల భూములను భూదానంకింద భూములు లేని పేదలకు దానం చేయగా, అందులో సగం భూములు మాత్రమే ఇప్పటివరకు పేదలకు పంపిణీ అయ్యాయని, అలాగే మిగిలిన భూముల సమస్యలు సంక్లిష్టమైనవని గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి జైరాం రమేష్‌ అన్నారు. ఇన్ని సంవత్సరాలు గడచినా కొన్ని భూముల్లో వున్న సంక్లిష్టమైన విషయాలను ఇంతవరకూ పరిష్కరించలేదంటే లోపం ఎక్కడుంది? పాలకుల్లోనా? ఆ భూముల్లోనా? ఇచ్చిన దాతల్లోనా? తీసుకున్న గ్రహీతల్లోనా..?! ఇదంతా చూస్తే నే ఎక్కే బండి జీవితకాలం లేటు..’ అన్న సామెత గుర్తుకువస్తోంది కదూ...!

By
en-us Political News

  
అమెరికాలోని మేరీల్యాండ్‌లో హైదరాబాద్‌కు చెందిన నిఖిత గోడిశాల అనుమానాస్పదంగా మృతి చెందింది.
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో అమ్మవారి దేవాలయంలో మైనర్ బాలికపై ఒక వృద్ధుడు లైంగిక దాడి
హైబ్రిడ్‌ సైబర్‌ ఫ్రాడ్‌పై హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ హెచ్చరిక..!
పెళ్లి మండపంలో సాధారణంగా వరుడు వధువు మెడలో మంగళసూత్రం కడతాడు.
అమెరికా కలలు కంటూ విదేశీ గడ్డపై అడుగుపెట్టిన ఆ యువకుడి భవిష్యత్తు ఒక్క క్షణంలో ముగిసిపోయింది.
పెళ్లి ప్రస్తావన తీసుకురాగా పవన్ నిరాకరించారనీ, ముఖం చాటేశారనీ, తనకు న్యాయం చేయాలని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు.  
ప్రమాద తీవ్రతకు బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు.   ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ కోసం టాస్క్‌ఫోర్స్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బుడ్డ సత్యనారాయణను హత్య చేసేందుకు కుట్ర జరిగిందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు చేపట్టిన నిరాహార దీక్షను మంగళవారం విరమించారు.
శంషాబాద్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్ వీడియో వైరల్‌..!
ముషీరాబాద్‌లో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.