మళ్ళీ పోరు..ప్రభుత్వానికి హెచ్చరిక

Publish Date:Feb 7, 2012

Advertisement

హైదరాబాద్: సకల జన సమ్మె విరమణ సందర్భంగా తెలంగాణ ఉద్యోగ సంఘాల ఐకాసకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోని ప్రభుత్వ వైఖరికి నిరసనగా మళ్లీ ఉద్యమిస్తామని తెలంగాణ ఉద్యోగ సంఘాల ఐకాస స్టీరింగ్ కమిటీ హెచ్చరించింది. మార్చి 19వరకు ప్రభుత్వానికి గడువు ఇచ్చి, అప్పటికీ ప్రభుత్వం హామీలు నెరవేర్చని పక్షంలో 20న ఛలో హైదరాబాద్ నిర్వహిస్తామని ఐకాస చైర్మన్ కె స్వామిగౌడ్ హెచ్చరించారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల ఐకాస మంగళవారం టిఎన్‌జివో భవన్‌లో స్వామిగౌడ్ అధ్యక్షతన సమావేశమై ఆందోళన కార్యచరణ ప్రకటించింది. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు వి శ్రీనివాస్‌గౌడ్, తెలంగాణ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు విఠల్, తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి దేవిప్రసాద్ తదితరులు హాజరై ఐకాస ప్రకటించిన ఆందోళన కార్యాచరణకు పూర్తి సంఘీభావం ప్రకటించారు. ఈ అంశంపై గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసు అందించనున్నట్టు టిఇజెఎసి చైర్మన్ స్వామిగౌడ్ మీడియాకు వెల్లడించారు. ఈనెల 21న భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శనలు, 25న జిల్లాలో ర్యాలీలు, మార్చి 3న కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు, మార్చి 5 నుంచి వర్క్ టు రూల్‌తో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. అప్పటికీ సర్కారు దిగిరాని పక్షంలో మార్చి 20న ఛలో హైదరాబాద్‌కు పిలుపునిచ్చి భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలు ఏవీ అమలు చేయకపోగా, సకల జన సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులను వేధిస్తోందని ఆయన ఆరోపించారు. సకల జన సమ్మె జరిగిన 42 రోజుల పని దినాలను రెగ్యులరైజ్ చేయకుండా తమను ప్రభుత్వం బెదిరించాలని చూస్తోందని ఆయన విమర్శించారు. ఉద్యోగుల హక్కులను హరిస్తే తమనుంచి ప్రతిఘటన కూడా తీవ్రస్థాయిలో ఉంటుందని హెచ్చరించారు.

ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, కేంద్ర మంత్రి గులాంనబీ ఆజాద్, రాష్ట్ర మంత్రివర్గ ఉప సంఘం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చేసిన విజ్ఞప్తి మేరకు తెలంగాణకు అనుకూలంగా ప్రకటన వెలువడనుందన్న హామీతో సకల జన సమ్మెను తాత్కాలికంగా విరమించుకున్నాక మోసం చేసారని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు వి శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు.

By
en-us Political News

  
వనదేవతలు పూజలందుకునే గుడిని గుర్తుతెలియని వ్యక్తులు కూల్చివేయడం పట్ల భక్తులు,  గిరిజనులు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దసరా పండుగను తన స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు.
అడవిలో స్వేచ్ఛగా తిరుగుతూ ప్రకృతి అందాలను పెంచే మూగజీవాలపై తుపాకీ గురిపెట్టారు.
తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం, శాంతిభద్రతల పటిష్టత దిశగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.
రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా ముంచుకొస్తున్న వాతావరణ మార్పులు, అసాధారణ వాతావరణ పరిస్థితులపై తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది.
1,000 మందికి పైగా టార్గెట్‌.. నిందితుడు అరెస్టు.!
తాజాగా వెలువడిన ఆర్థిక ఫలితాల ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మెట్రో సంస్థ భారీ మొత్తంలో లోటును చవిచూడాల్సి వచ్చింది. ప్రయాణాల ద్వారా వచ్చే ఆదాయం కంటే, రోజువారీ నిర్వహణ, ఫైనాన్స్ ఖర్చులే అధికంగా ఉండటంతో  లోటు 405 కోట్ల రూపాయలు దాటేసింది. 
తీరొక్క పూలతో కళకళలాడుతున్న మార్కెట్లు.!
భద్రాచలంలో పౌరసరఫరాల శాఖకు చెందిన ఓ అధికారి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది.
సద్ధుల బతుకమ్మ వేడుకలను పురస్కరించుకుని హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించనున్నారు.
డ్రగ్స్‌ మహమ్మారిని దేశం నుంచి తరిమికొట్టి, యువత భవిష్యత్తును కాపాడటమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా మోటార్‌ సైకిల్‌ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ డీజీపీ సి. వి. ఆనంద్‌ తెలిపారు.
 ఉపరితల ఆవర్తనానికి తోడు ఈశాన్య రుతుపవనాల విస్తరణ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 
నగర శివారు ప్రాంతాల్లో సోషల్ మీడియా రీల్స్ వైరల్ క్రేజ్ కోసం యువత చేస్తున్న ప్రమాదకర విన్యోసాలు రోజురోజుకూ శృతిమించుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.