శ్రీధర్ బాబుపై జగన్ నేత మండిపాటు
Publish Date:Jan 12, 2012
Advertisement
హైదారాబాద్: వైయస్ జగన్మోహన్ రెడ్డిని తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేరన్న మంత్రి శ్రీధర్ బాబుపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత గోనె ప్రకాశరావు మండిపడ్డారు. కాంగ్రెసు అధిష్టానం, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వద్ద మార్కులు కొట్టేసేందుకే జగన్పై శ్రీధర్ బాబు విమర్శలు చేస్తున్నారన్నారు. తెలంగాణ కోసం రాజీనామా చేస్తానని చెప్పి మాటమార్చినందుకు ముందు పదవిని త్యజించి ఇతరుల గురించి మాట్లాడాలని సూచించారు. తెలంగాణకు అనుకూలంగా లేని కిరణ్, సీమాంధ్ర నేతలను కరీంనగర్ జిల్లాకు తీసుకు వెళ్లావని విమర్శించారు. తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వెళ్లి తాము మాజీ మంత్రులుగా వచ్చామని చెప్పిన నీవు మళ్లీ మంత్రిగా ఎలా కొనసాగుతున్నావని ప్రశ్నించారు. తెలంగాణ సెంటిమెంట్ వాడుకోవడం కాంగ్రెసుకు మొదటి నుండి అలవాటన్నారు. తెలంగాణ ఇవ్వబోమని కేంద్రం చెబితే తాను ఏం చేస్తారో శ్రీధర్ బాబు ప్రజలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విషయంలో కాంగ్రెసే మొదటి ముద్దాయి అన్నారు.
http://www.teluguone.com/news/content/gone-prakasarao-24-10894.html





