ప్రేమ వివాహమే ప్రాణాలు తీసింది...గోల్కొండ హత్య కేసును ఛేదించిన పోలీసులు

Publish Date:Jun 15, 2026

Advertisement

 

హైదరాబాద్ గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల సంచలనం సృష్టించిన యువకుడి హత్య కేసును పోలీసులు వేగంగా ఛేదించి నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ప్రేమ వివాహం కారణంగా పెరిగిన కుటుంబ విభేదాలే ఈ హత్యకు దారితీసినట్లు పోలీసులు వెల్లడించారు. అరెస్టయిన నిందితులను కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారికి జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

పోలీసుల వివరాల ప్రకారం గోల్కొండలోని కుమ్మరవాడికి చెందిన షేక్ మహబూబ్ అలియాస్ మసూద్ చండి (26) ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. అతడు 2025 జనవరిలో రుక్షార్ బేగమ్‌ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే ఈ వివాహాన్ని రుక్షార్ సోదరుడు షేక్ జాహెద్ అలియాస్ సోహైల్(28) తీవ్రంగా వ్యతిరేకించాడు. పెళ్లి జరిగినప్పటి నుంచి మసూద్‌పై ద్వేషం పెంచుకున్న సోహైల్ తరచూ గొడవలకు దిగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

గత ఏడాది డిసెంబర్‌లో దంపతులకు కుమారుడు జన్మించాడు. అయినప్పటికీ రెండు కుటుంబాల మధ్య విభేదాలు కొనసాగాయి. ఇటీవల సోహైల్ తన తల్లి షమీమ్ బేగమ్, సోదరి రూబీలతో కలిసి మసూద్ ఇంటికి వెళ్లి గొడవ పడి, తన సోదరిని మసూద్‌తో కలిసి జీవించనివ్వ బోనని, వారిద్దరికీ విడాకులు ఇప్పిస్తానని బెదిరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ క్రమంలో జూన్ 12న మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో షేక్ జాహెద్ అలియాస్ సోహైల్(28)తన బంధువులైన జీషన్ నవాబ్ అలియాస్ జాబర్(30), అమీర్ నవాబ్ అలియాస్ లడ్డు(26/, జాబర్ తల్లి నఫీజ్ సుల్తానా(48)తో కలిసి కుమ్మరవాడిలోని మసూద్ ఇంటికి వెళ్లారు. ఇనుప రాడ్లు, కత్తి, కర్రలతో ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి మసూద్‌పై దాడికి పాల్పడ్డారు.

మృతుడి కుటుంబ సభ్యులు అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ నిందితులు వారిని తోసిపుచ్చి దాడి కొనసాగించారు. సోహైల్ ఇనుప రాడ్‌తో మసూద్ తలపై బలంగా కొట్టగా, జాబర్ కత్తితో తలతో పాటు శరీరంలోని పలు భాగాల్లో విచక్షణారహితంగా పొడిచినట్లు పోలీసులు తెలిపారు. అదే సమయంలో లడ్డు, నఫీజ్ సుల్తానా కర్రలతో తీవ్రంగా కొట్టినట్లు వెల్లడించారు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన మసూద్ రక్తపు మడుగులో అక్కడికక్కడే మృతి చెందాడు. అడ్డువచ్చిన అతని తండ్రి షేక్ ఇస్మాయిల్‌పై కూడా దాడి చేయడంతో ఆయనకు చేతి, చెంపపై గాయాలయ్యాయి.

మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గోల్కొండ పోలీసులు  భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు కింద 103(1), 329(4), 118(1) రీడ్ విత్ 3(5)తో పాటు ఆర్మ్స్ యాక్ట్ 1959లోని సెక్షన్ 25(1A) కింద కేసు నమోదు చేశారు. టోలిచౌకి డివిజన్ ఏసీపీ సయ్యద్ ఫయాజ్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టి జూన్ 13న నలుగురు నిందితులను గుర్తించి అరెస్ట్ చేసింది. నిందితుల వద్ద నుంచి దాడికి ఉపయో గించిన జిమ్ ఇనుప రాడ్, కత్తిని స్వాధీనం చేసుకు న్నారు.ప్రేమ వివాహాన్ని వ్యతిరేకించడం, కుటుంబ విభేదాలు మరియు వ్యక్తి గత కక్షలే ఈ దారుణ హత్య కు ప్రధాన కారణమని పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

By
en-us Political News

  
యూకేలో 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగించకుండా నిషేధం విధిస్తామని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ప్రకటించారు.
తెలంగాణ వ్యాప్తంగా రవాణా శాఖకు సంబంధించిన వాహన్, సారథి సాఫ్ట్‌వేర్ సేవలు అకస్మాత్తుగా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
కేంద్రంలో ఏపీకి ప్రాధాన్యత పెంచేలా ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకోన్నట్లు ప్రచారం జరుగుతోంది.
తెలంగాణను కించపరిస్తే సహించం టీపీసీసీ చీఫ్ హెచ్చరిక..
తెలంగాణ రాజకీయాల్లో హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణ అంశం తీవ్ర దుమారం రేపుతోంది.
విచారణను ఆగస్టు 7కు వాయిదా వేసిన చెంగల్పట్టు కోర్టు..
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో డ్రోన్ టెక్నాలజీ సంచలనాలు సృష్టిస్తోంది. అమెరికా రెడీమేడ్ డ్రోన్లు ఎందుకు ఫెయిల్ అవుతాయో, ఉక్రెయిన్ 250 కిలోమీటర్ల రేంజ్ ఏఐ డ్రోన్లతో రష్యాను ఎలా దెబ్బతీస్తుందో ఇక్కడ తెలుసుకోండి.
అనారోగ్యం లేదా ప్రమాదం వల్ల ఉద్యోగానికి వెళ్లలేనప్పుడు మీ నెలవారీ ఆదాయాన్ని కాపాడే ఆదాయ రక్షణ బీమా (Income Protection Insurance) గురించిన టాప్ 5 అపోహలను మరియు వాటి వెనుక ఉన్న అసలు నిజాలను నిపుణుల సర్వే గణాంకాలతో సహా ఇక్కడ తెలుసుకోండి.
అంతర్జాతీయ శాంతి ఒప్పందంతో దేశీయ స్టాక్ మార్కెట్లలో భారీ లాభాల పంట పండింది. సెన్సెక్స్ 1,100 పాయింట్లు పెరగగా, నిఫ్టీ 24,000 మార్కు వైపు దూసుకెళ్తోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఫిఫా వరల్డ్ కప్ 2026 గ్రూప్-ఇ లో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ఈక్వెడార్‌పై ఐవరీ కోస్ట్ 1-0తో ఘన విజయం సాధించింది. 90వ నిమిషంలో అమాద్ డియాల్లో కొట్టిన సంచలన గోల్ ఈక్వెడార్ 19 మ్యాచ్‌ల అజేయ రికార్డును ముగించింది. మ్యాచ్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ రికార్డును బద్దలు కొట్టి, టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన భారతీయ బ్యాటర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆ రికార్డు పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
యాపిల్ సంస్థ తన మొట్టమొదటి ఫోల్డబుల్ ఐఫోన్ (iPhone Fold) విడుదలకు సిద్ధమవుతోంది. ఐఓఎస్ 27 కోడ్‌లో లీకైన క్రేజీ ఫీచర్లు, స్క్రీన్ సైజులు, కెమెరా మరియు లాంచ్ డేట్ వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
ముక్కోణపు సిరీస్‌లో శ్రీలంక ‘ఎ’ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో భారత్ ‘ఎ’ ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, ప్రభ్‌సిమ్రన్ సింగ్ పవర్ ప్లే లోనే అవుట్ అయ్యారు. తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్స్ ని చక్కదిద్దుతున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.