సవాంగ్ స్టోరీ స‌శేషం!.. 'డీమ్డ్ టూ బీ రిటైర్డ్'కి కేంద్రం కొర్రీ వేస్తే..!?

Publish Date:Feb 19, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌ ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతిపాదనలను గవర్నర్‌ భిశ్వభూషణ్ హరిచందన్‌కు ప్రభుత్వం పంపగా ఆమోదం తెలిపారు. గవర్నర్‌ ఆమోదం పొందడంతో ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే, ఇక్కడితో, సవాంగ్ స్టొరీ సుఖాంతం అయినట్లేనా, అంటే , లేదు, ఇంకా వుంది అంటున్నారు కొందరు అధికారులు. ఇప్పుదు బంతి కేంద్రం కోర్టులో ఉందని, ఐపీఎస్ సర్వీస్ బెనిఫిట్స్ కోల్పోకుండా, సర్వీసులో ఉండగానే ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ పదవీ స్వేకరించేందుకు, సవాంగ్, ‘డీమ్డ్ టూబీ  రిటైర్డ్’ క్లాజును ఉపయోగించుకున్నారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే సరే,లేదంటే సవాంగ్’కు చిక్కులు తప్పవని అధికార వర్గాలు భావిస్తున్నాయి. 

నిజానికి గౌతం సవాంగ్ హఠాత్తుగా బదిలీ చేసింది మొదలు అనేక  నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి’కి సన్నిహితునిగా పేరున్న గౌతమ్ సవాంగ్’ ను అదే జగన్ రెడ్డి కారణం ఏదీ చూపకుండా అత్యంత అవమాన కరంగా బదిలీ చేశారనే విమర్శలు అధికార, రాజకీయ వర్గాల్లో వెల్లువెత్తాయి. ఈ నేపధ్యంలోనే డ్యామేజి కంట్రోల్ చర్యల్లో భాగంగా, సవాంగ్’ను సగౌరవంగా సాగనంపామనే, భ్రమలు కలిపించేందుకు ఆయన్ని, సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్’గా నియమిచారు. అయితే, సర్కార్ చెపుతున్న కొత్త లాజిక్’  నిజం కాదని, సర్కార్’ కే కాదు, సవాంగ్’ కూ తెలుసు. అదే నిజమైతే, ఆయనను బదిలీ చేసి జీఏడీలో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించరు. అలా ఆదేశించడమంటే... బదిలీ వేటు వేసినట్లేనని వేరే చెప్పనక్కర లేదు. నిజంగానే సవాంగ్‌కు ఏపీపీఎస్సీ చైర్మన్‌ పదవి ఇవ్వాలని ముందే నిర్ణయించుకుని ఉంటే ఆ పద్ధతి వేరేగా ఉండేదని, ఇది కేవలం డ్యామేజి కంట్రోల్ చర్య తప్ప మరొకటి కాదని అంటున్నారు.  

అదలా ఉంటే, సవంగ్ స్టొరీ ఇంతటితో ముసినట్లేనా అంటే కాదు, ఇంకా ఒక మెలిక అలాగే ఉంది. సర్వీసులో ఉన్న అధికారిని, రాజ్యాంగ (సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్) పదవిలో నియమించేందుకు నిబంధనలు అంగీకరించవు. అందుకే  సవాంగ్‌ నియామకం‘డీమ్డ్‌ టు బి రిటైర్డ్‌’ క్లాజుతో ప్రభుత్వం గవర్నర్‌ ఆమోదం పొందింది.అయితే, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సర్వీస్ నిబంధలకు సంబదించి విషయాలపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయమే తుది నిర్ణయం అవుతుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం డీమ్డ్ టూ బీ రిటైర్డ్ ’ క్లాజును అంగీకరించక పొతే, సవాంగ్ పరిస్థితి ఏమిటి? రెంటికి చెడిన రేవడిగా మారి పోతారా? ఏమిటి జరుగుతుంది, అనే విషయంలో అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

మరోవంక ఏపీపీఎస్సీ చైర్మన్‌ పోస్టులో చేరాలంటే సవాంగ్ ఐపీఎ్‌సగా తనకున్న సర్వీసు కోల్పోతారు. అందుకే ఆయన ఏపీపీఎస్సీ చైర్మన్ పదవి స్వీకరించేందుకు ముందు అంతగా సుముఖత చూపలేదు. అయితే, ప్రభుత్వం రాయబారాలు నడిపి, ఒప్పించినట్లు తెలిసింది. చివరకు ఆయన వీఆర్‌ఎ్‌సతో సంబంధం లేకుండా, ‘డీమ్డ్‌ టు బి రిటైర్డ్‌’ అనే నిబంధనను వాడుకున్నారు. అంటే, సవాంగ్‌ నియామకం జరిగిన వెంటనే, ఆయన  రిటైర్‌ అయినట్టుగా భావిస్తారు. దీనివల్ల ఐపీఎ్‌సగా ఆయనకు సర్వీసు ప్రయోజనాలన్నీ పూర్తిగా లభిస్తాయి.కానీ, చివరకు ఏమి జరిగినా, సవాంగ్’  జగన్ రెడ్డి సర్కార్’కు చేసిన సేవలకు తగిన ఫలితమే దక్కింది. ఆ మచ్చ మచ్చగానే మిగిలిపోతుందని అధికారులు అంటున్నారు.
 

By
en-us Political News

  
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
తీపి పదార్థమనుకుని నోట్లో పెట్టుకున్నాడు.. చివరకు విగతజీవిగా మారాడు!
డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న గిగ్ వర్కర్ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.
బంగారం ప్రియులకు ఇది నిజంగానే ఊరటనిచ్చే శుభవార్త అని చెప్పవచ్చు
తెలంగాణను ప్రపంచ పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా నిలబెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
హానీట్రాప్ ఉచ్చులో పడిన వాయుసేన అధికారి.. షాకింగ్ నిజాలు వెల్లడించిన ఛార్జ్‌షీట్.!
మినీ బస్‌ను ఢీకొన్న ట్రక్కు.. 23 మంది మృతి.!
రాష్ట్రంలో 25 పారిశ్రామిక ఎకోసిస్టమ్ లను అభివృద్ధి చేస్తాం: లోకేష్
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
1999లో ఎయిర్‌పోర్టుల గురించి ఎవరూ పెద్దగా ఆలోచించని సమయంలోనే.. సీఎం చంద్రబాబు నాయుడు శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంపై దృష్టి పెట్టారు.
ఇంట్లో ఆడపిల్ల జన్మిస్తే ఆ ఇంటికి మహాలక్ష్మి వచ్చినట్టేనని పెద్దలు అంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.