గ్యాస్ ధర తగ్గింది.. కానీ
Publish Date:Feb 1, 2022
Advertisement
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం 2022-23 వార్షిక బడ్జెట్లో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం కొంత చేసింది. అయితే , బడ్జెట్ కంటే ముందే, చమురు కంపెనీలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.91 తగ్గించాయి.కమర్షియల్ సిలిండర్ ధర తరచూ పెరగడం వల్ల చిన్న వ్యాపారస్థులు, హెటల్స్, రెస్టారెంట్ నిర్వాహకులపై భారం పెరుగుతూ వస్తోంది. ధర తగ్గింపుతో వారికి కాస్త ఉపశమనం లభించనుంది.అయితే, రాయితీపై లభించే గృహ వినియోగ ఎల్పీజీ 14.2 కేజీల సిలిండర్ ధర యథావిథిగానే ఉంటుందని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. నిజానికి, ఓటర్లఫై కమర్షియల్ సిలెండర్ కంటే గృహ వినియోగ ఎల్పీజీ ధర ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, గ్రుహోపయోగ సిలెండర్ ధరను యథాతథంగా ఉంచి, కమర్షియల్ సిలెండర్ ధరను తగ్గించడం వలన ఓటర్లపై ఎంత మేరకు ప్రబహ్వం చూపుతుంది అనేది ప్రశ్నార్ధకమే అంటున్నారు. మరో
పెట్రోలు, డీజిల్ ధరలు నవంబరు నుంచి నిలకడగా ఉన్న సంగతి తెలిసిందే.
మరోవైపు విమాన ఇంధన ధరను రికార్డు స్థాయిలో 8.5శాతం పెంచాయి చమురు మార్కెటింగ్ సంస్థలు. దీంతో డిల్లీలో కిలో లీటర్ ఏటీఎఫ్ ధర రూ. 6,743 పెరిగి రూ.86,038కి చేరింది. ఏటీఎఫ్ చరిత్రలో ఇదే అత్యధిక ధర కావడం గమనార్హం. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చమురు మార్కెటింగ్ సంస్థలు తెలిపాయి.గతంలో 2008లో క్రూడ్ ఆయిల్ ధర బ్యారల్ 147కి చేరినప్పుడు ఏటీఎఫ్ ధర 71,028గా ఉంది. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధర 91 డాలర్లుగానే ఉన్నా.. విమాన ఇంధన ధర రూ.86వేలకుపైగా చేరింది.తాజా పెంపుతో విమాన ఇంధన ధర నెల రోజుల వ్యవధిలో మూడోసారి పెరిగినట్లయింది. ఇప్పటికే జనవరి 1న 2.5శాతం, జనవరి 16న 4.25 శాతం ధరలు పెరిగాయి. ఇప్పుడు ఏకంగా 8.5శాతం పెరిగింది.
http://www.teluguone.com/news/content/gas-cylinder-rates-dip-39-131046.html





