Publish Date:Jan 28, 2026
రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేలకు పార్టీ నాయకులకు తెలుగు దేశం కూటమి ప్రభుత్వం పదవులను కేటాయిస్తున్నది. ఇలా దక్కిన పదవులను కొందరు అవకాశంగా భావిస్తుంటే.. కొందరు సీనియర్ నేతలు మాత్రం ఆ పదవులను నిరాకరిస్తున్నారు. అలా ప్రభుత్వం ఇచ్చిన పదవి వద్దంటున్న వారిలో తెలుగుదేశం సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఒకరు. తాజాగా ఎకనామికల్ రీజనల్ డెవలప్ మెంట్ అథారిటీ చైర్మన్ గా క్యాబినెట్ హోదా ఉన్న పదవిని గంటా శ్రీనివాసరావుకు ఇవ్వాలని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ పదవి పట్ల గంటా ఏ మాత్రం సంతోషంగా లేరని తెలుస్తోంది. వాస్తవానికి ఆయన చంద్రబాబు కేబినెట్ లో స్థానం కోసం పోటీ పడ్డారు. అయితే కూటమి సర్దుబాట్ల కారణంగా గంటాకు అవకాశం దక్కలేదు. ముఖ్యంగా ఉమ్మడి విశాఖ జిల్లా సామాజిక సమీకరణాలు, మహిళలకు ప్రాధాన్యత వంటి అంశాలతో వంగలపూడి అనితకు మంత్రి పదవి ఇచ్చారు.
అలాగే పార్టీ ఆవిర్భావం నుంచి సేవలు అందిస్తున్న చింతకాయల అయ్యన్నపాత్రుడు కి స్పీకర్ పదవి దక్కింది. పల్లా శ్రీనివాసరావుకు అధ్యక్ష పదవి దక్కింది. సామాజిక సమీకరణాలు, మహిళలకు ప్రాధా న్యత లక్ష్యంగా ఈ కేటాయింపులు జరిగాయి. అయితే గంటాకు మంత్రిపదవి దక్కకపోవడం పట్ల ఆయనతో పాటు ఆయన వర్గం కూడా ఒకింత అసంతృప్తితో ఉందని రాజకీయవర్గాలలో ఓ చ ర్చ అయితే జరుగుతోంది. ఇక గంటా తన ఆశలన్నీ మంత్రివర్గ విస్తరణపై పెట్టుకున్నారని అంటున్నారు. విస్తరణ జరిగితే తనకు కచ్చితంగా కేబినెట్ లో స్థానం దక్కుతుందని ఆయన భావిస్తూ వచ్చారు. అయితే ఇప్పట్లో క్యాబినెట్ విస్తరణ జరిగే అవకాశాలు లేకపోవడంతో ఆశావహులకు కొన్ని కార్పొరేషన్ చైర్మన్లు ఇతర పదవులు కేటాయించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ దశలో గంటా శ్రీనివాసరావుకు ఒక క్యాబినెట్ హోదాతో పదవి ఇవ్వాలని భావించినట్లు తెలుస్తోంది. అయితే ఆ పదవి తీసుకోవడానికి గంటా శ్రీనివాసరావు సుముఖంగా లేరని అంటున్నారు.
రాజకీయాల్లో దాదాపు 27 సంవత్సరాలుగా నిరాఘాటంగా చట్టసభల్లో కొనసాగుతున్న గంటా శ్రీనివాసరావు.. 1999లో అనకాపల్లి ఎంపీగా అరంగ్రేటం చేశారు. ఆ తరువాత ఆయన చోడవరం భీమిలి.. అనకాపల్లి, విశాఖ నార్త్... ప్రస్తుతం భీమిలి ఎమ్మెల్యే గా కొనసాగుతున్నారు. అలాగే గతంలో కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనూ, ఆపై చంద్రబాబు నాయుడు హయాంలోనూ కూడా గంటా మంత్రిగా పని చేశారు.ఈ నేపథ్యంలోనే ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవి తన కు తగదని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు.
ఇలా ఉండగా, గంటా శ్రీనివాసరావు తో పాటు ఇతరుల కు ఇచ్చే పదవులపై ప్రభుత్వం వ్యూహాత్మకంగా లీకులు వదిలినట్టు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ లీకుల ద్వారా ఆయా నేతల మనోభావాలను గుర్తించి తదనుగుణంగా నిర్ణయం తీసుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్లు చెబుతున్నారు. అందులో భాగంగానే గంటా శ్రీనివాసరావు విషయంలో చేసినట్లు చెబుతున్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీ అయిన తన స్థాయికి కార్పొరేషన్ చైర్మన్ పదవి సరికాదని గంటా భావిస్తున్నట్లు చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ganta-srinivasarao-express-displeasure-39-213101.html
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.