చంద్రబాబుతో మీటింగ్‌కు గంటా డుమ్మా!.. పార్టీ వీడినట్టేనా?

Publish Date:Feb 18, 2022

Advertisement

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ నేతలతో వరుస సమావేశాలు, సదస్సులతో బిజీబిజీగా ఉంటున్నారు. టీడీపీ నేతల్లో మరింత చైతన్యం నింపేందుకు కార్యాచరణతో ముందుకు పోతున్నారు. వైసీపీ అరాచక పాలనపై, చేతగానితనంపై ఎక్కడిక్కడ పార్టీ నేతలు, శ్రేణులు ఎలా స్పందించాలో దిశా నిర్దేశం చేస్తున్నారు. వారికి అవగాహన కల్పింస్తున్నారు.ఆ క్రమంలో మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచ్ లకు చంద్రబాబు నాయుడు గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. శుక్రవారం విశాఖపట్నం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గం ఇన్ చార్జిలతో భేటీ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి రావాలని ఇన్ చార్జిలు, ఎమ్మెల్యేలకు అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. అలా విశాఖ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచిన గంటా శ్రీనివాసరావు కూడా పార్టీ కార్యాలయం నుంచి పిలుపు అందింది.

అయితే.. ముందుగానే ఫిక్స్ చేసుకున్న కార్యక్రమాల్లో తాను పాల్గొనాల్సి ఉన్న కారణంగా పార్టీ అధినేత చంద్రబాబుతో సమావేశానికి హాజరు కాలేనని, త్వరలోనే వచ్చి బాస్ ను కలుస్తానంటూ పార్టీ కార్యాలయానికి గంటా సమాచారం పంపించారు. టీడీపీ అధినేత సమావేశానికి హాజరు కాకుండా గంటా శ్రీనివాసరావు డుమ్మా కొట్టడంపై రాజకీయ వర్గాల్లో ఇప్పుడు చర్చ నడుస్తోంది. నిజానికి.. 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత నుంచీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు క్రియాశీలంగా ఉండడం లేదు. టీడీపీకి కూడా దూరంగా ఉంటున్నారు. కాకపోతే కొద్ది కాలంగా ఆయన మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు టీడీపీ నేతలు చెబుతుండడం గమనార్హం.

అయితే.. గంటా శ్రీనివాసరావు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవి అనుభవించి, ఇప్పుడిలా క్రియాశీలంగా ఉండకపోవడానికి కారణం.. ఆయన వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారనే పుకార్లు ఉన్నాయి. ఇప్పటికే వైసీపీ అధ్యక్షుడు జగన్ రెడ్డితో మంతనాలు జరుపుకున్నారని, తమ పార్టీలో గంటాను చేర్చుకునేందుకు జగన్ ఓకే చెప్పారనే ప్రచారం కూడా గతంలోనే జరిగింది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించాలనే కేంద్రం నిర్ణయానికి నిరసనగా గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేసినప్పటికీ దాన్ని స్పీకర్ ఆమోదించడానికి ఓ మెలిక కూడా పట్టడం విశేషం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కు సంబంధించి కేంద్రం నిర్ణం అమలులోకి వచ్చిన వెంటనే తన రాజీనామాను ఆమోదించాలని స్పీకర్ ను గంటా కోరడం ఆశ్చర్యం కలిగించక మానదు. ఇప్పటికి ఇంకా గంటా శ్రీనివాసరావు రాజీనామా లేఖ స్పీకర్ వద్ద పెండింగ్ లోనే ఉంది.

మరో పక్కన గంటా శ్రీనివాసరావు తన సామాజివర్గం నేతల సమావేశాల్లో పాల్గొంటూనే ఉన్నారు. ఇంకో పక్కన టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ విధమైన వ్యవహార సరళితో గంటా శ్రీనివాసరావు ఎత్తుగడ ఏమిటి? టీడీపీలోనే ఉంటారా? లేక వైసీపీ తీర్థం తీసుకునేందుకే మొగ్గు చూపుతున్నారా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. లేదంటే ఎటూ తేల్చుకోలేని అయోమయంలో గంటా పడిపోయారా? అనే అనుమానాలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తం అవుతున్నాయి.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.