ఈ నెల 25న గణేష్ నిమజ్జనం: ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు.!
Publish Date:Sep 23, 2026
Advertisement
గణేష్ నిమజ్జనానికి భారీ బందోబస్తు..20 వేల మంది పోలీసులతో పహారా..! ఖైరతాబాద్ బడా గణేష్‌ను ఇప్పటికే 25 లక్షల మంది, బాలాపూర్ గణేష్‌ను 15 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని పోలీసులు తెలిపారు. నిమజ్జనం చివరి రోజున ఈ రెండు ప్రాంతాల్లో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండటంతో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. బడా గణేష్ దర్శనానికి బుధవారం రాత్రి 12 గంటల వరకు మాత్రమే అవకాశం ఉంటుందని, ఆ తర్వాత దర్శనం ఉండదని అధికారులు తెలిపారు. నిమజ్జన ఏర్పాట్లను సైతం ముందుగానే ప్రారంభిం చారు.నగరంలో మూడో రోజు నుంచే గణేష్ విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగు తోంది. ఇప్పటివరకు వివిధ ప్రాంతాలకు చెందిన 32,878 విగ్రహాల నిమజ్జనం పూర్తికాగా, హైదరాబాద్ నగర పరిధిలో 6,108 విగ్రహాలు నిమజ్జనమయ్యాయి. గత 24 గంటల్లోనే నగర పరిధిలో 2,161 విగ్రహాలను నిమజ్జనం చేశారు. మండపాల ఏర్పాటుకు ఆన్‌లైన్ విధానంలో 15,426 దరఖాస్తులు రాగా, క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం 14,929 మండపాలకు అనుమ తులు మంజూరు చేశారు. అనుమతి పొందిన మండపాలన్నింటికీ జియో ట్యాగింగ్ చేశారు. శోభా యాత్రను బంజారాహిల్స్ లోని టీజీఐసీసీసీ నుంచి క్షణక్షణం పర్యవేక్షించనున్నారు. ప్రధాన మార్గాల్లో ఏర్పాటు చేసిన 10 వేల సీసీ కెమెరాలను కంట్రోల్‌రూమ్‌కు అనుసంధానించారు. 24 డ్రోన్లతో శోభాయాత్ర మార్గాలపై నిఘా కొనసా గుతుంది. బంజారాహిల్స్ లోని ప్రధాన జాయింట్ కంట్రోల్‌రూమ్‌తో పాటు ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్, మొఘల్‌పురా స్పోర్ట్స్ కాంప్లెక్స్ వద్ద ప్రత్యేక కంట్రోల్‌రూమ్‌లను ఏర్పాటు చేశారు. నిమజ్జన ప్రాంతాల్లో ప్రమాదాలు జరగకుండా జలాశయాల వద్ద గజ ఈతగాళ్లు, రెస్క్యూ బోట్లు సిద్ధంగా ఉంచారు. అంబులెన్సులు, ఫైర్ ఇంజిన్లు, మొబైల్, స్టాటిక్ జనరేటర్లు, వాచ్ టవర్లను అందుబాటులో ఉంచారు. వాహనాలు మొరాయించి నప్పుడు ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ప్రధాన కూడళ్ల వద్ద మెకానిక్‌లు, అదనపు డ్రైవర్లను కూడా అందు బాటులో ఉంచారు. బందోబస్తు కోసం ఇతర జిల్లాల నుంచి 8,142 మంది అధికారులు, సిబ్బందితో కూడిన 42 ప్లాటూన్లను రప్పించి ఏడు జోన్లకు కేటాయించారు. నాలుగు ఆర్‌ఏఎఫ్, రెండు సీఆర్‌పీఎఫ్ కంపెనీలను మోహరించారు. 53 బాంబ్ డిటెక్షన్ టీమ్‌లు విధుల్లో ఉంటాయి. నగర ప్రవేశ మార్గాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మాల్స్ వంటి జనసమ్మర్థ ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రధాన శోభాయాత్ర ప్రాంతాల్లో ఐజీ, డీఐజీ స్థాయి అధికారులను పర్యవేక్షణకు నియమించారు. మహిళలు, యువతుల భద్రత కోసం 26 షీ-టీమ్స్ మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహించనున్నాయి. ఉత్సవాలు ప్రారంభమైన సెప్టెంబరు 14 నుంచి ఇప్పటివరకు ఖైరతాబాద్, బాలాపూర్ వంటి రద్దీ ప్రాంతాల్లో అసభ్యంగా ప్రవర్తించిన 1,172 మందిపై చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నేర నియంత్రణ కోసం సీసీఎస్ పరిధిలో 25 ప్రత్యేక బృందాలను మఫ్టీలో నిఘాకు వినియోగించను న్నారు.నిమజ్జన ఊరేగింపుల్లో డీజేలు, సౌండ్ మిక్సర్లు, అధిక శబ్ద తీవ్రత కలిగించే పరికరాలు, బాణసంచాపై నిషేధం విధించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే పరికరాలను సీజ్ చేసి నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. నిమజ్జనం సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని, ప్రజలు ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటించి తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని సీపీ వీసీ సజ్జనర్ కోరారు. గణేష్ నిమజ్జనాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు అన్ని రకాల పకడ్బందీ చర్యలు తీసుకున్నామని సీపీ తెలిపారు. ప్రజలు సంయమనం పాటిస్తూ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని, పోలీసులకు సహకరించాలని కోరారు. సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు, పుకార్లు సృష్టించినా ఉపేక్షించబోమని హెచ్చరించారు. హైకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా కేటాయించిన జలాశయాల్లోనే నిమజ్జనాలు చేపట్టాలని సూచించారు. విగ్రహాల తరలింపు వాహనాలకు అనుభవజ్ఞులైన డ్రైవర్లను నియమించడంతో పాటు మండపం నుంచి నిమజ్జన ప్రాంతం వరకు ముందుగానే రూట్ సర్వే చేయాలని, ప్రసాదాల పంపిణీలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. [ Ganesh Nimajjanam, Hussain Sagar, Khairatabad Bada Ganesh,Hydra, HMDA, DGP CV Anand, CM Revanth Reddy, Hyderabad Police,CP Sajjanar, Telugu One, Telugu News ]
గణేష్ నిమజ్జన మహోత్సవానికి హైదరాబాద్ సిటీ పోలీస్ భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. ఈ నెల 25న శుక్రవారం జరిగే మహానిమజ్జన శోభాయాత్రను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు నగరవ్యాప్తంగా 20 వేల మంది పోలీసు సిబ్బందిని మోహరించనున్నారు. బాలాపూర్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు శోభాయాత్ర సాగే మార్గాల్లో 10 వేల సీసీ కెమెరాలు, 24 డ్రోన్లతో క్షణక్షణం నిఘా ఏర్పాటు చేశారు. ప్రధాన మార్గాల్లో సుమారు 100 హైరైజ్ కెమెరాలతో విగ్రహాల లెక్కింపునూ చేపట్టనున్నారు. హైదరాబాద్‌తో పాటు సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ, పొరుగు జిల్లాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలిరానున్న నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. జీహెచ్‌ఎంసీ, విద్యుత్, వాటర్‌బోర్డు, రవాణా, అగ్నిమాపక, వైద్యారోగ్య, హైడ్రా, హెచ్‌ఎండీఏ తదితర ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేశారు. హైదరాబాద్ నలుమూలలా భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా చర్యలు చేపట్టారు.
http://www.teluguone.com/news/content/ganesh-nimajjanam-24-232270.html




