చార్మినార్ పై భారీ వర్షం ఎఫెక్ట్.. ఊడిపడ్డ మీనార్ పెచ్చులు.!
Publish Date:Sep 23, 2026
Advertisement
హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాల ధాటికి చారిత్రక కట్టడమైన చార్మినార్ దెబ్బతింది. పాతబస్తీలో ఒక్కసారిగా కురిసిన కుండపోత వాన కారణంగా చార్మినార్‌లోని ఒక భాగంలో ప్లాస్టరింగ్ పెచ్చులు ఊడి కిందపడ్డాయి. ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. వివరాల్లోకి వెడితే.. మంగళవారం (సెప్టెంబర్ 22) రాత్రి పాతబస్తీ పరిసరాల్లో దాదాపు గంట పాటు భారీ వర్షం కురిసింది. ఆ వర్ష తీవ్రతకు లాడ్ బజార్ వైపు ఉన్న చార్ మీనార్ స్తంభం ప్లాస్టరింగ్ పెచ్చులు ఊడి కింద పడ్డాయి. సమాచారం అందుకున్న వెంటనే చార్మినార్ భద్రతా సిబ్బంది అప్రమత్తమై ఘటనా స్థలానికి చేరుకున్నారు. పర్యాటకులు, స్థానికుల భద్రత దృష్ట్యా చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించి తక్షణ భద్రతా చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై భారత పురావస్తు శాఖ అధికారులు స్పందిస్తూ, ఎడమవైపు మినార్ కింద ఉన్న బాహ్య గోడ కొంతకాలంగా బలహీనపడటమే ఈ ప్రమాదానికి కారణమని వెల్లడించారు. ఈ చారిత్రక కట్టడాన్ని మరింత పటిష్టపరిచేందుకు, దెబ్బతిన్న భాగాలకు శాశ్వత మరమ్మతులు చేపట్టే నిమిత్తం ఇప్పటికే టెండర్ ప్రక్రియ తుది దశకు చేరుకుందన్నారు. త్వరలోనే నిపుణుల పర్యవేక్షణలో ఈ పునరుద్ధరణ పనులు ప్రారంభం కానున్నాయన్నారు. [Hyderabad Heavy Rains,Charminar Damage, ASI, Charminar Plastering Falls]
http://www.teluguone.com/news/content/hyderabad-heavy-rains-24-232260.html




