నిమజ్జనం బందోబస్తులో రచ్చ: మహిళా ఎస్‌ఐపై యువకుడు అసభ్య ప్రవర్తన.!
Publish Date:Sep 27, 2026
Advertisement
గణేష్ నిమజ్జనం సందర్భంగా పోలీసుల బందోబస్తు కొనసాగుతుండగా.. అల్మాస్‌గూడలో అర్ధరాత్రి కొందరు వ్యక్తులు హల్‌చల్ చేశారు. మద్యం మత్తులో నృత్యాలు చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించిన మహిళా ఎస్‌ఐకి ఓ వ్యక్తి నుంచి అనూహ్యమైన స్పందన ఎదురైంది. ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు విధులకు ఆటంకం కలిగించడంతో ఆ మహిళ ఎస్సై అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ 23న అర్ధరాత్రి దాటిన తర్వాత అల్మాస్‌గూడ కమాన్ వద్ద శ్లోకా స్కూల్ సమీపంలో ఆక్సిజన్ ఫిట్నెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన గణేష్ నిమజ్జనం వేడుక జరుగుతుండగా కొందరు వ్యక్తులు మద్యం మత్తులో నృత్యాలు చేస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుండగా మహిళా ఎస్‌ఐ గుర్తించారు. వెంటనే ఆమె రాత్రి సమయం కావడంతో అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి కొద్దిసేపు అంటూ ముందుకు వచ్చి మహిళా ఎస్‌ఐతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా.. ఆమె విధులు నిర్వహించకుండా అడ్డు కున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం అతడిని ఆక్సిజన్ ఫిట్‌నెస్ క్లబ్ యజమాని సాకేత్ కుమార్‌గా గుర్తించినట్లు ఆమె తెలిపారు. మహిళా ఎస్‌ఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మీర్‌పేట్ పోలీసులు సాకేత్ కుమార్‌పై బీఎన్‌ఎస్ సెక్షన్లు 74, 75(2), 132 కింద కేసు నమోదు చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. [ Ganesh immersion, Meerpet Police Station, Saket Kumar, Almasguda Kaman, CM Revanth reddy, CP Sajjanar, DGP C.V. Anand, Hyderbad police, Telugu One, Telugu News ]
http://www.teluguone.com/news/content/ganesh-immersion-24-232665.html





