గోశాలపై పెద్దపులి పంజా: ఆవులపై వరుస దాడులు.!

Publish Date:Sep 27, 2026

Advertisement

వికారాబాద్ జిల్లా పరిగి మండలం బసిరెడ్డిపల్లి సమీపంలో పెద్దపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. కృష్ణగిరి క్షేత్ర ఆలయ పరిధిలోని గోశాలలో వరుసగా గోవులపై దాడులు జరుగుతుండటంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.మూడు రోజుల క్రితం గోశాలలోని ఓ లేగదూడను పులి ఎత్తుకెళ్లినట్లు గో సంరక్షకులు చెబుతున్నారు. తాజాగా మరో ఆవుపై పులి దాడి చేసింది. గోశాల నిర్వాహకులు అప్రమత్తమై కేకలు వేయడంతో పులి అక్కడి నుంచి పరుగులు తీసినట్లు తెలిపారు. పులి దాడిలో ఆవు మెడ, ఉదర భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. వీపుపై పంజా ఆనవాళ్లు కూడా కనిపించాయి. 

తీవ్ర గాయాలతో ఆవు మృతి చెందింది. దీంతో గోశాల నిర్వాహకులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజల్లో ఆందోళన మరింత పెరిగింది. గోశాలకు సమీపంలోని ఓ ఫామ్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో పులి కదలికలు రికార్డైనట్లు గోశాల నిర్వాహకులు తెలిపారు. దీంతో అది నిజంగానే పెద్దపులి సంచారమేనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.గోశాలలో దాదాపు 200 వరకు ఆవులు ఉన్నాయని నిర్వాహకుడు కృష్ణస్వామి తెలిపారు. వరుస దాడులతో గోవులను ఎలా కాపాడుకోవాలోనన్న ఆందోళన నెలకొంది. వెంటనే పులిని బంధించి, దానిని వేరే అడవిలో వదిలి గోశాలను రక్షించాలని కృష్ణస్వామి కోరుతున్నారు. పెద్దపులి సంచారం నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

 

 

[ Big Tigers Paw on the Cowshed, Vikarabad District, Parigi Mandal, Basireddypalli,  Cowshed Attack, Tiger Movement, Tiger Panic, Telangana Forest Department, Cattle Attack, Bengal Tiger, Krishna Giri Temple, Tiger CCTV Footage, Telangana Wildlife, Tiger Alert ]


 

By
en-us Political News

  
పదేళ్లుగా పక్కింటివారిలా పరిచయం.. మెల్లిగా చీటీలతో నమ్మకం సంపాదించారు.. ఆ నమ్మకంతోనే ఒక్కొక్కరి నుంచి భారీగా డబ్బులు తీసుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన ఉల్లాస్ పరీక్షకు హాజరవుతున్న లక్షలాది మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు మంత్రి సీతక్క అభినందనలు తెలిపారు.
పోయింది అధికారం మాత్రమే.. కేసీఆర్‌పై అభిమానం తగ్గలేదు.!
గడ్డిపోచలు కూడా గడ్డపారలుగా మారుతాయి..!
గణేష్‌ నిమజ్జనం సందర్భంగా పోలీసుల బందోబస్తు కొనసాగుతుండగా.. అల్మాస్‌గూడలో అర్ధరాత్రి కొందరు వ్యక్తులు హల్‌చల్‌ చేశారు.
 శ్రీనాథ్  అవయవ దానంతో చావు అంచున ఉన్న ఆరుగురికి  పునర్జన్మ లభించింది. శ్రీనాథ్ కుటుంబ సభ్యులకు జీవన్‌దాన్ అధికారులు   కృతజ్ఞతలు తెలియజేశారు. తన అవయవదానంతో  సిద్దని ప్రేమ వెంకట సత్య సాయి శ్రీనాథ్ మరణించిన తరువాత కూడా చిరంజీవిగా వర్ధిల్లుతున్నాడు.
తాడ్వాయి గురుకుల పాఠశాల విద్యార్థినులు పక్షుల కూతను బట్టి జాతిని గుర్తించే సరికొత్త ఎకో సెన్స్ బర్డ్ సౌండ్ డిటెక్షన్ ప్రాజెక్టును ఆవిష్కరించారు.
తెలంగాణను ఇచ్చిన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా గణేష్ నిమజ్జనాల సందర్భంగా  ఎస్సై సహా 13 మంది ప్రాణాలు కోల్పోగా.. 26 మంది గాయపడ్డారు.  రాష్ట్రవ్యాప్తంగా   1.24 లక్షల మండపాల్లో వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించినట్లు తెలంగాణ డీజీపీ  సీవీ ఆనంద్   తెలిపారు.
. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో  తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ.. సీజన్ చివరి రోజుల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా భారీ వర్షాలు కురిసి కొంత మేరకు ఉపశమనం కలిగించాయి గత నాలుగు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కురిసిన  వర్షాల కారణంగా వర్షపాతం లోటు ఒకింత తగ్గింది.
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ఘన నివాళులర్పించారు.
మాదకద్రవ్యాల నియంత్రణలో తెలంగాణ పోలీసులు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్నారని డీజీపీ సి.వి. ఆనంద్ పేర్కొన్నారు.
నిమజ్జన ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లుఅధికారుల పర్యవేక్షణలో   పక్కా ప్రణాళికతో  జరిగాయి. ఉత్సవ కమిటీ సభ్యులు ఉదయాన్నే ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించి, సంప్రదాయబద్ధంగా సామూహిక ప్రార్థనలు చేపట్టారు. ఆ తర్వాత భారీ క్రేన్ల సహాయంతో   ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపైకి విగ్రహాన్ని చేర్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.