థియేటర్‌లో ప్యారడైజ్‌ మూవీ చూసిన కేటీఆర్: రివ్యూ ఇదే.!

Publish Date:Sep 27, 2026

Advertisement

గడ్డిపోచలు కూడా గడ్డపారలుగా మారుతాయి..! 

నేచురల్ స్టార్ నాని హీరోగా, యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన మోస్ట్ అంటెసిపేటెడ్ మాస్ యాక్షన్ డ్రామా 'ది ప్యారడైజ్'. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనాలు సృష్టిస్తోంది. ఈ సినిమాను చూసేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్‌కు స్వయంగా వెళ్లడం తెలుగు చిత్రసీమలో హాట్ టాపిక్‌గా మారింది. చాలా కాలం తర్వాత కేటీఆర్ థియేటర్‌లో సినిమా చూసేందుకు రావడం నాని అభిమానులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ ప్రత్యేక స్క్రీనింగ్‌కు పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యారు.

సినిమా వీక్షించిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ 'ది ప్యారడైజ్' చిత్రంపై తన మనసులోని మాటను, రివ్యూను పంచుకున్నారు. తెలంగాణ నేల, యాస, భాష, అలాగే ఇక్కడి సాంస్కృతిక అస్తిత్వాన్ని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరపై అత్యంత శక్తివంతంగా ఆవిష్కరించారని కొనియాడారు. అణగారిన వర్గాల ప్రజల కష్టాలను, వారి జీవన పోరాటాలను సినిమా ముందుకు తీసుకువచ్చిన విధానం అద్భుతంగా ఉందని ప్రశంసించారు. తమ ఉనికికి, హక్కులకు ప్రమాదం వాటిల్లినప్పుడు ప్రజలు ఏవిధంగా తిరుగుబాటు చేస్తారో, వారి వెనుక నిలబడి న్యాయం కోసం పోరాడే నాయకుడి పాత్రను చిత్రంలో ఎంతో సహజంగా చూపించారని కేటీఆర్ పేర్కొన్నారు.గడ్డిపోచలు కూడా గడ్డపారలుగా మారుతాయి” అంటూ ఆయన చేసిన వ్యాఖ్య సోషల్‌ మీడియాలోనూ చర్చకు దారితీస్తోంది.

ఈ కథ వెనుక ఉన్న వాస్తవ సంఘటనల స్ఫూర్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని, ప్రేక్షకులు సులభంగా అర్థం చేసుకోగలరని తెలిపారు. తెలంగాణ నేటివిటీ, ఇక్కడి నిజమైన యాస సినిమా స్థాయిని మరింత పెంచాయని, నిరంతర అణచివేతకు గురవుతున్న సమాజంలో సామూహిక ప్రతిఘటన ఎలా రూపుదిద్దుకుంటుందనే విషయాన్ని ఈ చిత్రం అద్దం పట్టిందని ఆయన అభిప్రాయపడ్డారు. హీరో నాని, నటుడు ప్రియదర్శి, దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో పాటు మొత్తం చిత్ర యూనిట్ ఈ విభిన్నమైన సబ్జెక్ట్‌ను అద్భుతమైన సినిమా అనుభూతిగా మలచడంలో పూర్తిగా విజయవంతమయ్యారని అభినందించారు.

 

 

 

[ KTR The Paradise review, Nani The Paradise movie, KTR watches Paradise, Srikanth Odela movie, Tollywood news, Sudarshan theatre Hyderabad, Telugu One, Telugu News ]

By
en-us Political News

  
పదేళ్లుగా పక్కింటివారిలా పరిచయం.. మెల్లిగా చీటీలతో నమ్మకం సంపాదించారు.. ఆ నమ్మకంతోనే ఒక్కొక్కరి నుంచి భారీగా డబ్బులు తీసుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన ఉల్లాస్ పరీక్షకు హాజరవుతున్న లక్షలాది మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు మంత్రి సీతక్క అభినందనలు తెలిపారు.
పోయింది అధికారం మాత్రమే.. కేసీఆర్‌పై అభిమానం తగ్గలేదు.!
గణేష్‌ నిమజ్జనం సందర్భంగా పోలీసుల బందోబస్తు కొనసాగుతుండగా.. అల్మాస్‌గూడలో అర్ధరాత్రి కొందరు వ్యక్తులు హల్‌చల్‌ చేశారు.
వికారాబాద్ జిల్లా పరిగి మండలం బసిరెడ్డిపల్లి సమీపంలో పెద్దపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది.
 శ్రీనాథ్  అవయవ దానంతో చావు అంచున ఉన్న ఆరుగురికి  పునర్జన్మ లభించింది. శ్రీనాథ్ కుటుంబ సభ్యులకు జీవన్‌దాన్ అధికారులు   కృతజ్ఞతలు తెలియజేశారు. తన అవయవదానంతో  సిద్దని ప్రేమ వెంకట సత్య సాయి శ్రీనాథ్ మరణించిన తరువాత కూడా చిరంజీవిగా వర్ధిల్లుతున్నాడు.
తాడ్వాయి గురుకుల పాఠశాల విద్యార్థినులు పక్షుల కూతను బట్టి జాతిని గుర్తించే సరికొత్త ఎకో సెన్స్ బర్డ్ సౌండ్ డిటెక్షన్ ప్రాజెక్టును ఆవిష్కరించారు.
తెలంగాణను ఇచ్చిన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా గణేష్ నిమజ్జనాల సందర్భంగా  ఎస్సై సహా 13 మంది ప్రాణాలు కోల్పోగా.. 26 మంది గాయపడ్డారు.  రాష్ట్రవ్యాప్తంగా   1.24 లక్షల మండపాల్లో వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించినట్లు తెలంగాణ డీజీపీ  సీవీ ఆనంద్   తెలిపారు.
. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో  తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ.. సీజన్ చివరి రోజుల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా భారీ వర్షాలు కురిసి కొంత మేరకు ఉపశమనం కలిగించాయి గత నాలుగు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కురిసిన  వర్షాల కారణంగా వర్షపాతం లోటు ఒకింత తగ్గింది.
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ఘన నివాళులర్పించారు.
మాదకద్రవ్యాల నియంత్రణలో తెలంగాణ పోలీసులు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్నారని డీజీపీ సి.వి. ఆనంద్ పేర్కొన్నారు.
నిమజ్జన ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లుఅధికారుల పర్యవేక్షణలో   పక్కా ప్రణాళికతో  జరిగాయి. ఉత్సవ కమిటీ సభ్యులు ఉదయాన్నే ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించి, సంప్రదాయబద్ధంగా సామూహిక ప్రార్థనలు చేపట్టారు. ఆ తర్వాత భారీ క్రేన్ల సహాయంతో   ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపైకి విగ్రహాన్ని చేర్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.