విద్యార్దుల జీవితాలు బుగ్గిపాలు చేస్తున్న కిరణ్ సర్కార్
Publish Date:Sep 4, 2012
Advertisement
రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏ విషయంలోనైనా పరిజ్ఞానం తక్కువే అని రాష్ట్ర ప్రజలందరూ గుర్తించారు. అయితే ఆకస్మిక నిర్ణయాలతో విద్యార్దుల జీవితాలతో ఆడుకుంటారని మాత్రం ఎవరూ ఊహించలేదు. ఇంజనీరింగ్ విద్యార్ధులతో ఆయన ఆడిన ఆటలవల్ల వారి విద్యాజీవితం నిర్వీర్యం అయ్యింది. ఒకే సారి ఫీజలు పెరుగుతాయని తెలియని తల్లి దండ్రులూ, విద్యార్ధులూ హతాశులౌతున్నారు. పది రోజుల క్రితం వరకు 44 వేలుగా ఫీజు నిర్ణయించాలని గొడవ చేసిన కాలేజీ ఒక్కసారిగా లక్షా ఐదువేల ఫీజును నిర్ణయించుకోవడానికి కారణం ఏమిటన్నది ఎవరికీ తెలియటం లేదు. ఎందుకంత మొత్తాన్ని విద్యార్దులు చెల్లించాలి ఏ ప్రాతిపదికన ఫీజులు 68 కాలేజీలు పెంచాయో ప్రభుత్వం విద్యార్దులకు తెలియచేయాలి. కేవలం అఫడవిట్లు పొందుపరచినందువల్ల మాత్రమే అంత ఫీజుకు ఎలా ఒప్పుకున్నారు మార్కులు తెచ్చుకున్న మద్యతరగతి విద్యార్దుల పరిస్థితి ఏమిటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఫీజులను నిర్ణయించడానికి ప్రయివేటు ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలకు ఉన్న ఆర్హతను ప్రభుత్వం ఎందుకు పరీక్షించడంలేదని మేధావులు ప్రశ్నిస్తున్నారు. ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించడానికి ప్రభుత్వానికి ఎంత భారం అవుతుందో తల్లిదండ్రులకు కూడా అంతే భారం అని ముఖ్యమంత్రిగారికి తెలియదా ? రాష్ట్రంలో పేరెన్నికగన్న కాలేజీల్లో చదువు మద్యతరగతి ప్రజలకు ఏ మాత్రం అందుబాటులో ఉండదా? అని వారు ప్రశ్నిస్తున్నారు. మెరిట్విద్యార్ధులకు ఇక ఈ రాష్ట్రంలో చదువు కొససాగటం ప్రహసనమేనా. ముందు ముందు విషయాలు తెలియని విద్యార్దులు మంచి ర్యాంకులు తెచ్చుకుని ఎంతో ఆతృతతో మంచి కళాశాలల్లో చేరాలన్నా గత మూడు నెలలనుండి రాష్ట్ర ప్రభుత్వ సా....గ దీత కార్యక్రమాల ద్వారా సమస్యను జఠిలం చేసింది. ఫీజు రీఎంబర్స్ మెంట్ ద్వారా చదువుకునే విద్యార్ధులకు ఇప్పుడు తెచ్చిన ప్రతిపాదనలతో ఏం చెయ్యాలో పాలు పోవడం లేదు. ప్రభుత్వం ముందుగా ఫీజులు పెరిగే విషయం పైన కాని పెరిగిన ఫీజులను విద్యార్ధులే కట్టుకోవల్సి వస్తుందని గాని ముందుగా తెలియచేయలేదు. ఫీజుల భారం పెరిగేటట్లయితే ముందుగానే విద్యార్ది తల్లితండ్రులకు ఆ విషయాన్ని తెలియచేస్తే ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకుంటానికి లేదా వేరే ఏదైనా డిగ్రీలో చేరేందుకైనా వీలుండేది.ముందు చూపులేని మంత్రి వర్గంతో విద్యార్ధులు సమిధలవుతున్నారు. ప్రయివేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఏకీకృత ఫీజు నిర్ణయించడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది.
http://www.teluguone.com/news/content/full-reimbursement-for-first-10000-rankers-24-17127.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





