Publish Date:Dec 30, 2024
ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణాలను అందుబాటులోకి తీసుకువచ్చచేందుకు ముహూర్తం ఖరారైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఉగాది పర్వదినం నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పించేందుకు నిర్ణయించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలకమైన హామీలలో రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం అన్నది ఒకటి. సోమవారం (డిసెంబర్ 30) అమరావతిలోని సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాదరెడ్డి, అధికారులతో సంబంధిత సుదీర్ఘ భేటీ నిర్వహించిన చంద్రబాబు ఉగాది నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ వెసులుబాటును కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
తెలుగు సంవత్సరాది సందర్భంగా మహిళలకు ఈ అవకాశం కల్పిస్తే.. వారు జీవితాంతం గుర్తు పెట్టుకుంటారని అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అదేసమయంలో ప్రస్తుతం మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సేవలు అందుతున్న తెలంగాణ, ఢిల్లీ, కర్ణాటకల్లో ఈ పథకం సమర్థవంతంగా అమలు చేయడానికి అవసరమైన విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు. ఈ అధ్యయనానికి సంబంధించిన నివేదికను నెల రోజులలోగా అందజేయాలని ఆదేశించారు.
ఏయే సర్వీసులను మహిళలకు కేటాయించాలి? తద్వారా జరిగే పరిణామాలు.. ఆటో, క్యాబ్ డ్రైవర్ల ఉపాధిపై పడే ప్రభావం వంటి వాటిని కూలంకషంగా అధ్యయనం చేయాలనీ, అదే సమయంలో తెలంగాణ, కర్నాటక, ఢిల్లీ రాష్ట్రాలలో అవలంబిస్తున్న విధానాలను, అలాగే ఆటో, క్యాబ్ డ్రైవర్లకు చూపిన ప్రత్యామ్నాయాలపై కూడా అధ్యయనం చేయాలని చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేయడానికి ఏ మేరకు అదనపు బస్సులు అవసరమౌతాయో తెలియజేయాలని అన్నారు.
ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పక్షాన ప్రకటించిన ‘సూపర్ సిక్స్’ హామీల్లో మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం హామీ కీలకంగా మారింది. ఈ పథకాన్ని ఎప్పుడెప్పుడు అమలు చేస్తారా? అని రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఉగాది నుంచి రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు కానుంది. దీనిపై మహాళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/free-traval-in-rtc-busses-25-190574.html
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనంలోకి వస్తానంటే ఆయన పార్టీ క్యాడర్, నేతలు వణికి పోతున్నారు. ఇప్పుడప్పుడే వద్దు మహప్రభో అంటూ వేడుకుంటున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. శుక్రవారం (జనవరి 3) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో ఆరు కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండిపోయాయి.
తీహార్ జైలు నుంచి కండిషన్ బెయిల్ మీద విడుదలైన బిఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత మరో మారు తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు
న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, హాంకాంగ్, తైవాన్ దేశాలకు చెందిన బౌద్ధ పరిశోధకులు గురువారం నాడు నాగార్జున కొండను సందర్శించారని పురావస్తు పరిశోధకుడు బుద్ధవనం కన్సల్టెంట్, ప్లీచ్ ఇండియా సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు.
భార్యా భర్తల మధ్య గొడవలు సహజం. కలహాలు లేని కాపురాలు ఉండనే ఉండవు. భర్త నేరం చేస్తే భార్య కేసులు నమోదు చేయడం సహజం. కానీ బాపట్ల జిల్లాలో ఓ భార్య భర్తపై కేసు పెట్టలేదు . కోర్టుల మీద నమ్మకం సన్నగిల్లిందేమో భర్తకు ఏకంగా మరణ శిక్ష విధించింది.
వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలన అవినీతికి హద్దే లేదన్నట్లుగా సాగింది. ఆ పార్టీ నేతలు అందినకాడికి ప్రభుత్వ భూములతోపాటు అటవీ భూములు, ప్రైవేట్ భూములను కబ్జాలు చేసేశారు. మరికొన్ని భూములను తక్కువ ధరకే జగన్ ప్రభుత్వం తన అనుకూల ట్రస్టులకు, కంపెనీలకు కట్టబెట్టేసింది. ఫలితంగా ప్రజలకు మేలు చేస్తారని అధికారాన్ని అప్పగిస్తే.. జగన్ మాత్రం తన హయాంలో ప్రభుత్వ, ప్రైవేట్ భూములను దోచుకోవటమే పనిగాపెట్టుకొని పాలనను గాలి కొదిలేశారు.
కొత్త సంవత్సరం సందర్భంగా పిఠాపురంలోని జనసేనాని నివాసం వద్ద ఫ్లెక్సీలు సందడి చేశాయి. జనసేన మద్దతుదారులు, కార్యకర్తలకు 2024 గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ఆ పార్టీ ఎన్నికలలో అద్భుత విజయాన్ని సాధించడమే కాకుండా, పార్టీ అధినేత జనసేనాని పిఠాపురం నుంచి మంచి మెజారిటీతో విజయం సాధించారు.
తెలంగాణతో బాటు ఎపిలో సంచలనమైన కామారెడ్డి ట్రయాంగిల్ సుసైడ్ ట్వి స్ట్ ల మీద ట్విస్ట్ లు చోటు చేసుసుకుంటున్నాయి
జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్ రుణచక్రబంధంలో ఇరుక్కుపోయింది. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇలా నిబంధనలకు విరుద్ధంగా పరిమితులకు మించి అప్పులు ఎలా పొందగలుగుతోందన్న అనుమానాలు అప్పట్లో సర్వత్రా వ్యక్తంమయ్యాయి. పొరుగునే ఉన్న సంపన్న రాష్ట్రం తెలంగాణకు అడుగడుగునా ఆంక్షలు, అడ్డంకులతో రూపాయి అప్పు పట్టని పరిస్థితి ఉంటే అందుకు భిన్నంగా ఏపీకి మాత్రం ఎలాంటి పరిమితులూ, ఆంక్షలూ, అడ్డంకులూ లేకుండా అప్పులు ఎలా దక్కాయన్న ప్రశ్నకు అప్పట్లో సమాధానం చెప్పే నాథుడే లేకుండా పోయాడు.
నారా లోకేష్. ఏపీ రాజకీయాలలో ఆయన ఇప్పుడు సెంటరాఫ్ అట్రాక్షన్. ప్రజలలో తిరుగులేని నాయకుడు. అయినా ఆయన పార్టీ విషయానికి వచ్చే సరికి ఒక కార్యకర్త మాత్రమే. ఒక కార్యకర్తలాగే పార్టీ కోసం శ్రమిస్తారు. అదే విధంగా తోటి కార్యకర్తల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడతారు. లోకేష్ లోని ఈ లక్షణాలను ఆయన రాజకీయాలలో అడుగుపెట్టక ముందే.. వైసీపీ పసిగట్టేసింది. అందుకే లోకేష్ కు రాజకీయాలంటేనే విరక్తి కలిగేలా చేయాలన్న ఉద్దేశంతో ఆయనపై విమర్శల దాడి చేసింది. బాడీ షేమింగ్ కు పాల్పడింది.
రేషన్ బియ్యం మాయం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్నినాని మెడకు ఉచ్చు బిగుస్తోంది. భారీ మొత్తంలో బియ్యం మాయం వెనుక పేర్ని నాని హస్తం ఉన్నట్లు పోలీసులు నిర్దారణకు వచ్చారు. తెరవెనుక ఉండి ఆయనే రేషన్ బియ్యాన్ని మధ్యవర్తుల ద్వారా కాకినాడ పోర్టుకు తరలించినట్లు ఆధారాలతోసహా పోలీసులు గుర్తించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ వేదికగా జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు హాజరు కానున్నారు. ఈ నెల 20 నుంచి 24 వరకూ ఐదు రోజుల పాటు దావోస్ వేదికగా ప్రపంచ ఆర్థిక సదస్సు జరగనున్న సంగతి తెలిసిందే.
దావోస్ లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హాజరు కానున్నారు. ఇందు కోసం ఆయన ఈ నెల 19న దావోస్ కు బయలుదేరి వెడతారు.