కామారెడ్డి ట్రయాంగిల్ లవ్ స్టోరీ కేసులో హంతకుడు నాలుగో వ్యక్తి ?
Publish Date:Jan 2, 2025
Advertisement
తెలంగాణతో బాటు ఎపిలో సంచలనమైన కామారెడ్డి ట్రయాంగిల్ సుసైడ్ ట్వి స్ట్ ల మీద ట్విస్ట్ లు చోటు చేసుసుకుంటున్నాయి. వీరు ఆత్మ హత్య చేసుకోవడానికి 15 రోజుల ముందు జిల్లా ఎస్ పి సింధు శర్మ కు కంప్లయింట్ వచ్చినట్లు కథనాలు వచ్చాయి. గత బుధవారం కామారెడ్డి జిల్లా అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువులో పోలీసుశాఖకు చెందిన ముగ్గురు చనిపోయారు. వీళ్లు సుసైడ్ చేసుకున్నారా? హత్యకు గురయ్యారా? అనేది ఇంత వరకు తేలలేదు. వారం రోజులు ముగుస్తున్నా కేసు మిస్టరీ వీడటం లేదు. పెద్ద చెరువు వద్ద ఎలాంటి సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో దర్యాప్తు నత్త నడకన కొనసాగుతోంది. బిక్కనూరు ఎస్ఐ సాయికుమార్ , బీబీపేట పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ శృతి , కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. నిఖిల్, శృతి వాట్సాప్ చాట్ లో విషయం బయటపడినప్పటికీ సాయికుమార్ ఐ ఫోన్ డెడ్ కావడంతో కాల్ డేటా ,చాటింగ్ వివరాలు బయటపడలేదు. వారం రోజుల నుంచి ఈ ఫోన్ ఎస్ పి కార్యాలయంలో ఉన్నప్పటికీ ప్రస్తుతం ఈ ఫోన్ హైద్రాబాద్ లోని ఫోరెన్సిక్ ల్యాబ్ కు చేరుకుంది. డెడ్ అయిన ఈ ఫోన్ కాల్ డేటా, చాటింగ్ వివరాలు తెలిస్తే దర్యాప్తు మరింత వేగంగా కొనసాగే అవకాశం ఉంది. చనిపోవడానికి ముందు వీరి ముగ్గురి మధ్య పెద్ద చెరువు వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. మూడు వెర్షెన్ లలో కథనాలు వినిపిస్తున్నాయి. మొదటి వెర్షన్ ప్రకారం నిఖిల్ , శృతి వివాహానికి ఇష్టపడని సాయికుమార్ వీరిద్దరిపై దాడి చేసినట్టు ఓ కథనం ప్రచారంలో ఉంది. ప్రతిగా వీరిద్దరు సాయికుమార్ పై దాడి చేశారు. సాయికుమార్ శృతిని నీళ్లలో తోసేసాడు. ఆమెను కాపాడటానికి నిఖిల్ నీళ్లలో దూకినట్లు సమాచారం. వీరిద్దరు చనిపోవడంతో సాయికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. రెండో వెర్షన్ ప్రకారం ముగ్గురు మధ్య జరిగిన ఘర్షణలో సాయికుమార్ శృతిని కొట్టాడు . వెంటనే చెరువు గట్టు మీద పరుగెత్తి చెరువులో పడిపోయింది శృతి. ఆమెను కాపాడటానికి నిఖిల్ చెరువులో దూకేసాడు. వీరిని కాపాడటానికి సాయికుమార్ నీళ్లలో దూకాడు. ముగ్గురికి ఈత రాకపోవడంతో చెరువులో మునిగిపోయారు.
మూడో వెర్షన్ ప్రకారం సాయికుమార్, శృతి, నిఖిల్ వివాదంలో నాలుగో వ్యక్తి తల దూర్చినట్టు వార్తలు వెలువడుతున్నాయి. నాలుగో వ్యక్తికి శృతికి అత్యంత సన్నిహితుడు. గొడవ ముదరడానికి అతనే కారణమని మరో కథనం . ఈ నాలుగో వ్యక్తి ఆవేశంతో అరుపులు ఎక్కువకావడంతో శృతి నీళ్లలో దూకింది. ఆమెను కాపాడటానికి నిఖిల్ నీళ్లలో దూకాడు. వీరిరువురిని కాపాడటానికి సాయికుమార్ నీళ్లలో దూకాడు. ఈత రాకపోవడంతో మొత్తం ముగ్గురూ చనిపోయారు.
ఎస్ పి సింధుశర్మ వద్దకు నిఖిల్ కంప్లయింట్ ఉన్నవార్తలను పోలీసు శాఖ గురువారం ఖండించింది. స్వయంగా సింధూశర్మ ఈ విషయాన్నివెల్లడించారు. నా వద్ద ఈ వివాదానికి సంబంధించిన సమాచారం లేదు. క్రింది స్థాయి అధికారులకు కంప్లయింట్ వచ్చి ఉండొచ్చు. అయితే ఎస్ పి కార్యాలయంలో సిసిటీవీ కెమెరాలు ఎందుకు పని చేయలేదో అనేది సింధుశర్మ చెప్పలేకపోయారు. కామారెడ్డి ట్రయాంగిల్ లవ్ స్టోరీ కేసు రోజుకో సవాల్ ను ఎదుర్కొంటుంది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ట్రయాంగిల్ సుసైడ్ కేసు పురోగతి సాధించకపోవడానికి సాక్ఖ్యాధారాలు లేకపోవడం పెద్ద లోటనే చెప్పాలి సాయికుమార్ తన కారులో టోల్ గేట్ దాటే విజువల్స్ కీలక ఆధారం. ముగ్గురు వేర్వేరుగా వచ్చి చెరువువద్ద ఎందుకు గొడవపడ్డారు. ఆత్మహత్య చేసుకోవడానికి ముగ్గురు వచ్చారా? వీరిలో ఎవరు హంతకులు అనేది తేలడానికి మరికొన్ని రోజులు పట్టొచ్చు. అప్పటివరకు సస్పెన్స్ వీడే అవకాశం లేదు.
http://www.teluguone.com/news/content/the-killer-in-kamareddy-triangle-love-story-case-is-the-fourth-person-25-190687.html