Publish Date:Oct 29, 2024
ఎపిలో కూటమి ప్రభుత్వం ఒక్కో ఎన్నికల హామీని నెరవేరుస్తుంది. గత ఎన్నికలముందు కూటమి పార్టీలు ఇచ్చిన హామీల్లో ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చాయి. కూటమి పార్టీలు అధికారంలో రావడంతో మరో ఎన్నికల హమీ బుధవారం నుంచి అమలు కాబోతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ప్రారంభించనున్నారు. దీపావళి వేళ తొలి సిలిండర్ ఇవ్వనున్నారు. ప్రతీ ఇంటిలో దీపాలు వెలిగించాలని, వెలుగులు నింపాలని కూటమి ప్రభుత్వం యోచిస్తుంది. ఈ నెల 29 వ తేదీ ఉదయం 10 గంటల నుంచే సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. కోటి 55 లక్షల లబ్దిదారులకు ఉచితంగా సిలిండర్ లు ఇవ్వనున్నట్లు పౌరసరఫరాల శాఖామంత్రి నాదెళ్ల మనోహర్ తెలిపారు. ఉచిత గ్యాస్ కనెక్షన్ అర్హతలను ప్రభుత్వం ప్రకటించింది. ఆధార్ కార్డు, తెల్లరేషన్ కార్డు, ఎల్పీజీ కనెక్షన్ కంపల్సరీ. ఈ పథకాన్ని అమలు చేయడానికి మూడు ఆయిల్ కంపెనీలతో ప్రభుత్వం చర్చలు జరిపింది. బుక్ చేసిన 48 గంటల లోపు లబ్దిదారుల ఖాతాలో జమ అవుతుంది. ప్రతీ నాలుగునెలలకు ఒక ఉచిత సిలిండర్ ఇవ్వనున్నారు. తొలుత డబ్బులు చెల్లించి సిలిండర్ కొనుగోలు చేస్తే లబ్దిదారుల ఖాతాల్లో జమఅవుతాయి. సిలిండర్ కు 900 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక భారం పడనుంది. మొత్తం మూడుసిలిండర్లకు 2 వేల 684 కోట్ల భారం ప్రభుత్వం మోయనుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/free-gas-cylinder-from-ichchapuram--from-october-31-chandrababu-srikaram-39-187585.html
ఇప్తెకార్ డబ్బు సంపాదనే ధ్యేయంగా జీవనం సాగిస్తున్నాడు. చిట్టీల వ్యాపారం చేసి లక్షల రూపాయలు సంపాదించాడు. ఆడ పిల్లల పెళ్లి, అనారోగ్యం వంటి కారణాలతో తన వద్ద చీటీ పాడుకునేవారికి చిట్టీ డబ్బులు మొత్తం ఇచ్చేవాడు కాదు. కమిషన్ ఎక్కువగా తీసుకునేవాడు. అవసరం అని తెలియగానే ఇప్తెకార్ తన దైన స్టైల్ లో దోచేసుకునే వాడు
తిరుపతి జిల్లా, చంద్రగిరి మండలం, సానంబట్ల గ్రామంలో స్వర్ణముఖీ నది ఒడ్డున 400 ఏళ్ల నాటి శిధిల శివాలయాన్ని కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సిఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అన్నారు.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న ఆస్తి వివాదం హాట్ టాపిక్ గా ఉంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డిల మధ్య ఆస్తుల పంపకం విషయంలో తలెత్తిన నిస్సందేహంగా వైఎస్ కుటుంబ పరువును బజారున పడేంది. ప్రజాజీవితంలో ఉన్నవారికి వ్యక్తిగతం అనేది ఉండదని అంటారు. జగన్,షర్మిల విషయంలో అదే జరుగుతోంది.
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్నట్లుగా మారిపోతున్నది. హైడ్రా కూల్చివేతలు, మూసీ సుందరీకరణ, రైతు భరోసా నిధులు వంటి విషయాలలో రేవంత్ సర్కార్ బీఆర్ఎస్ కు పుంజుకునేందుకు ఇచ్చిన అవకాశాలను బీఆర్ఎస్ సమర్థంగా ఉపయోగించుకోవడంలో విఫలమైంది. పార్టీ అధినేత మౌనం కావచ్చు. పార్టీలో నెలకొన్న అంతర్గత సంక్షోభం కావచ్చు మొత్తంగా బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమ స్ఫూర్తి అన్నది కొరవడటమే ఆ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను సమర్ధంగా తిప్పి కొట్టలేకపోవడానికి ప్రధాన కారణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అధికారం కోల్పోయిన వైసీపీ అధినేత జగన్ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేస్తున్నది అధర్మయుద్ధమని ఆయన పార్టీ నేతలే తెలిసో తెలియకో అంగీకరించేస్తున్నారు. వాస్తవానికి 2019 ఎన్నికలలో కూడా జగన్ అధర్మయుద్ధం చేసే తన పార్టీని గెలిపించారనీ చెప్పకనే చెప్పేస్తున్నారు.
సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి ఎదుట ఆత్మాహుతి చేసుకుంటానని మహిళా అఘోరీ ప్రకటన చేసిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.శుక్రవారం ఆత్మహుతి చేసుకుంటానని అఘోరీ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావం తరువాత వరుసగా రెండు సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా తిరుగులేని విజయాలను సాధించిన కేసీఆర్.. జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలన్న ఉద్దేశంతో టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి బోల్తా పడ్డారు. జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలన్న లక్ష్యం అన్నది పైపై మాటే వాస్తవంగా ఆయన దేశానికి ప్రధాని కావాలన్న ఆంక్ష, కాంక్ష తోనే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చేసి, తెలంగాణను వదిలేసి ఇతర రాష్ట్రాల రాజకీయాలలో తలదూర్చారన్నది పరిశీలకులు విశ్లేషణ.
అనంతపురం కలెక్టరేట్ లో గన్ మిస్ ఫైర్ సంచలనమైంది. శుక్రవారం తెల్లవారు జామున కలెక్టరేట్ లో గార్డు డ్యూటీలో ఉన్నాడు.1996 బ్యాచ్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్ సుబ్బరాజు తన వెపన్ క్లీన్ చేస్తుండగా మిస్ ఫైర్ అయ్యింది.
ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది. రాష్ట్ర విభజన తో అప్పులు వినా ఆస్తులు లేని రాష్ట్రంలో, కనీసం రాజధాని కూడా లేని రాష్ట్రంగా అన్నిటికీ మించి రెవెన్యూ లోటుతో విభజిత ఆంధ్రప్రదేశ్ ఒక అనాధలా మిగిలింది. అలాంటి రాష్ట్రాన్ని ప్రగతి బాట పట్టించి దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా రూపుదిద్దగలిగేది ఒక్క చంద్రబాబునాయుడు మాత్రమేనని విశ్వసించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి విజయాన్ని కట్టబెట్టారు.
ప్రధాని నరేంద్రమోడీ సైనికులతో కలిసి దీపావళి సంబరాలు జరుపుకున్నారు. దీపావళి పర్వదినం రోజున గుజరాత్ పర్యటనలో ఉన్న మోడీ అక్కడి కచ్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న జవాన్లతో కలిసి దీపావళిని వేడుకగా జరుపుకున్నారు.
ప్రముఖ నటుడు కమల్ హాసన్ సోదరుడు , నటుడు, దర్శకుడు చారుహసన్ తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె, అలనాటి నటి సుహాసిని ధృవీకరించారు. చారుహసన్ అనేక చిత్రాల్లో నటించారు. దర్శకత్వం వహించారు కూడా. చెన్నయ్ లోని ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి
తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించిన సంగతి తెలిసిందే. ఎన్నికల హామీలలో భాగంగా రేవంత్ సర్కార్ అమలు చేసిన తొలి హామీ కూడా ఇదే. అంతకు మందే కర్నాటక ప్రభుత్వం తమ రాష్ట్రంలో కేఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించిన సంగతి తెలిసిందే. అప్పట్లో కర్నాటక ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించడానికి ఆ హామీ ఎంతో దోహదపడింది.
దేశ వ్యాప్తంగా దీపావళి పండుగను జనం ఘనంగా జరుపుకున్నారు. దీపావళికి ఒక రోజు ముందు అంటే బుధవారం (అక్టోబర్ 30) నరకచతుర్దశి నుంచే బాణసంచా పేలుస్తూ సంబరాలు చేసుకున్నారు.