Publish Date:May 14, 2026
ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దాఖలు చేసిన అభియోగపత్రాన్ని కోర్టు పరిగణలోకి తీసుకుని ఈ కేసులో ఏ1గా ఉన్న కేటీఆర్ కు సమన్లు జారీ చేసింది. ఆయనతో పాటు ఏ2 అరవింద్ కుమార్, ఏ3 బి ఎల్ ఎన్ రెడ్డి లకు కూడా ఏసీబీ కోర్టు జూలై 31న కోర్టులో వ్యక్తిగతంగా హాజరు కావాలని సమన్లు జారీ చేసింది.
ఇప్పటికే ఈ వ్యవహారం పై హైకోర్టు కూడా విచారణను స్వీకరించింది. 2023లో హైదరాబాద్‌లో జరిగిన ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహణలో ఆర్థిక లావాదేవీలపై వచ్చిన ఆరోపణలతో కేసు ప్రాధాన్యం సంతరించుకుంది. దర్యాప్తులో భాగంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఖాతా నుంచి సుమారు రూ.55 కోట్లను ఈ ఫార్ములా ఆపరేషన్స్ సంస్థకు బదిలీ చేసినట్లు ఏసీబీ చార్జ్‌షీట్‌లో పేర్కొంది. ఈ నిధుల బదిలీపై అనుమానాలు వ్యక్తం కావడంతో కేసు నమోదు అయ్యింది.
ఈ కేసులో ఏ4గా స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వర్ రావు , ఏ5గా ఎఫ్‌ఈఓ సంస్థను కూడా అభియోగుల జాబితాలో చేర్చారు. ఇప్పటికే కేటీఆర్, అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డి సహా ఎఫ్‌ఈఓ ప్రతినిధులను ఏసీబీ అధికారులు విచారించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/formula-ecar-race-36-219823.html
తెలంగాణ పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ (PCS), హైదరాబాద్‌లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా విధులు
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.
టీచర్లకూ మధ్యాహ్న భోజనం.. తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో సరికొత్త పర్యాటక విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది.
తెలంగాణ పోలీస్ శాఖ భద్రతా ఏర్పాట్లలో కీలక మార్పులు చేపట్టింది.
పోస్టాఫీసు నుంచి స్పీడ్ పోస్ట్‌లో వచ్చే పార్శిల్‌లో మందులు ఉంటాయని భావిస్తారు.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం వీబీ జీ రామ్ జీ ఏపీ నుంచి ప్రారంభమై దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది.
కర్ణాటక రాజధాని బెంగళూరు నగర శివార్లలో గురువారం తెల్లవారుజామున ఒక ఊహించని ఘోర విషాదం చోటుచేసుకుంది.
కంచన్ భాగ్ పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉపనేత హరీశ్ రావుతో పాటు ఇతర నేతలను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో మాజీ ఐపీఎస్ అధికారి ఏ.కే. ఖాన్ కుమారుడు మొహ్సిన్ ఖాన్‌తో పాటు తబ్రేజ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
పుణేకు చెందిన ప్రముఖ రియల్టర్ కేతన్ అగర్వాల్ దారుణ హత్య కేసు ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది.