మాజీ సీఎంలు.. మళ్ళీ మంత్రులు!

Publish Date:Jul 1, 2022

Advertisement

సుమారు పక్షం రోజుల పాటు సాగిన  మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం చివరకు అలా ముగిసింది. అనుహ్యంగా శివసేన రెబెల్ లీడర్ ఏక్‌నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటుగా, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్,ఉప  ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్, తమ స్థాయిని తగ్గించుకుని అది కూడా గతంలో తమ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన ఏక్‌నాథ్ షిండే’ మంత్రి వర్గంలో  ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం, కొంచెం విడ్డూరంగా ఉండనే మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అలాగే, సహజంగానే అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది. రాజకీయాల్లో సీనియర్, జూనియర్ విభజన రేఖలు ఉన్నా, వాటికీ అంతగా ప్రాధాన్యత  అయితే ఉండదు. రజకీయ అవసరాలు ఇతరత్రా సమీకరణలు పదవులకు  అర్హతలవుతాయి. నరేంద్ర మోడీ, ఉద్దవ్ ఠాక్రే వంటి కొందరు మత్రులుగానే కాదు చివరకు ఎమ్మెల్యేలుగా అనుభవం లేకుండా, నేరుగా ముఖ్యమంత్రులయ్యారు. అప్పటికే అనేక మార్లు మంత్రులుగా, పనిచేసిన అనుభవం ఉన్న వారు, ఏ అనుభవము లేని ముఖ్యమంత్రుల   మంత్రివర్గాలో మత్రులుగా పనిచేశారు. 

అయితే, మంత్రులుగా ఉన్న వారు మంత్రులుగా కొనసాగడం ఒకటైతే, ముఖ్యమంత్రులుగా పనిచేసి మాజీలు మెట్టు దిగి మళ్ళీ మంత్రులుగా పనిచేయడం కొంచెం ఇబ్బదికరంగానే ఉంటుంది. అందుకే కావచ్చును, షిండేను ముఖ్యమంత్రిగా ప్రకటించిన సమయంలో, ఫడ్నవీస్, చాలా స్పష్టంగా, తాను  ప్రభుత్వంలో చేరడం లేదని లేదని ప్రకటించారు. అయితే, పార్టీ అధిష్టానం బలవంతం చేయడంతో,అయిష్టంగానే అయినా ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 

అయితే, మాజీ ముఖ్యమంత్రులు మెట్టుదిగి మంత్రులుగా అయిన సందర్భాలు చరిత్రలో లేవా అంటే లేక పోలేదు. ఎక్కడిదకానో ఎందుకు, మహారాష్ట్రలోనే, నలుగురు మాజీ ముఖ్యమంత్రులు,అనంతర కాలంలో ఇతర ముఖ్యమంత్రుల వద్ద మంత్రులుగా పనిచేసిన సందర్భాలున్నాయని, శరద పవార్ వంటి  పెద్దలు గుర్తు చేస్తున్నారు. 

శంకర రావు చౌహాన్ 1975 లో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే, ఆ తర్వాత 1977 లో అయన స్థానంలో వసంత దాదా పాటిల్ సీఎం అయ్యారు. శంకర రావు చౌహాన్ మాజీ  అయ్యారు. అయితే, ఆతర్వాత కొద్ది కాలానికే, పాటిల్ మంతి వర్గంలో మంత్రిగా ఉన్న శరద్  పవార్, ఆయన్ని గద్దె దించి ముఖ్యమంత్రి అయ్యారు.

ఆయన మంత్రి వర్గంలో మాజీ ముఖ్యమంత్రి శంకర రావు చౌహాన్, ఆర్థిక మంత్రిగా పనిచేశారు. అలాగే, శివాజీ రావు పాటిల్ నిలగేన్కర్ 1985 జూన్ నుంచి 1986 మార్చి వరకు కొద్దికాలం మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ  తర్వాత చాలా కాలానికి సుశీల్ కుమార్ షిండే మంత్రి వర్గంలో రెవిన్యూ మంత్రిగా పనిచేశారు. అలాగే, నారాయణ రాణే శివసేనలో ఉండగా, 1999లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే సంవత్సరం తిరక్కుండానే మాజీ అయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన రాణే, విలసరావు దేశ్ ముఖ మంత్రివర్గంలో రెవిన్యూ మత్రిగా  పనిచేశారు. అలాగే, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అశోక చవాన్  2008 నుంచి 2010 వరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత సుమారు తొమ్మిది సంవత్సరాల విరామం తర్వాత,  ఉద్దవ్ ఠాక్రే (ఎంవీఎస్) మత్రివర్గంలో పీడబ్ల్యు మంత్రిగా పనిచేశారు. 

ఇలా మాజీ ముఖ్యమంత్రులు మళ్ళీ మంత్రులుగా పనిచేసిన  సందర్భాలు అక్కడక్కడా ఉన్నా, ఫడ్నవీస్ కేసు కొంచెం భిన్నంగా ఉందని పరిశీలకులు అంటున్నారు. మంత్రివర్గంలో చేరడం లేదని చెప్పిన కొద్ది గంటలకే అనివార్యంగా,  ‘యూ టర్న్’ తీసుకోవలసి రావడం కొంత ఇబ్బందికరమనే ఆయన సన్నిహితులు అంటున్నారు

By
en-us Political News

  
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.