ఢిల్లీలో దోస్తీ.. ఏపీలో కుస్తీ..!

Publish Date:Jul 1, 2022

Advertisement

ఎవ‌రైనా ఇంట గెలిచి ర‌చ్చ‌గెల‌వ‌మంటారు.  ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్  వ్య‌వ‌హారం ఇందుకు భిన్నంగా వుంది. ఢిల్లీ నాయ‌కుల‌తో దోస్తానా ఎటువంటి ఇబ్బందిలేదు. కానీ స్వ‌ప‌క్షం వారితోనే  త‌ల భారం పెరిగింది.  ముందున్నంత స‌ఖ్యంగా ఎక్క‌డా ఎవ్వ‌రూ  లేరు. చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో విభేదాలు త‌లెత్తుతున్నాయి. వీటిని స‌ద్దుమ‌ణిగేలా చేయ‌డానికి  ప్ర‌త్యేకంగా స‌మ‌యం తీసుకొన‌వ‌ల‌సి వ‌స్తోంది. అయినా వైసీపీ 175 సీట్లు వ‌స్తాయ‌ని జ‌గ‌న్ చెబుతున్నారు. 

ఈ నేపథ్యంలో ఆ పార్టీ ప్లీనరీపైనే ఆంధ్రా రాజకీయం ఆధారపడి ఉందంటున్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రా రాజకీయం ఏ మలుపు తీసుకుంటుందనేది రాజకీయ కురు వృద్ధులకు కూడా అంతుచిక్కడం లేదు. వైసీపీ- బీజేపీల అంతర్యం ఏమిటో, వారి భవిష్యత్ వ్యూహం ఏంటో కూడా రాజకీయ మేధావులకు సైతం అంత ఈజీగా అంతుబట్టడం లేదు. 

సీఎం జ‌గ‌న్ ఢిల్లీ ప్రయాణం క‌ట్టిన‌పుడ‌ల్లా ఇక్క‌డి పార్టీ వ‌ర్గాలు రాష్ట్ర అంశాల‌ను చ‌ర్చించ‌డానికి వెళుతు న్నార‌ని భారీ ప్ర‌చారం చేస్తారు.  ఆయ‌నక ఆయ‌న  తిరిగి రాగానే ఏదో   స్కూలు నుంచి ఇంటికి వెళ్లిన‌ట్టు  నివాసానికో, పార్టీ ఆఫీసుకో వెళ్ల‌డం  ఆన‌వాయితీగా మారింది. కానీ అక్క‌డ నాయ‌కుల్ని ప్ర‌స‌న్నం చేసుకోవ డంలో  ఆంత‌ర్యం వేర‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. కేంద్రంలో అధికార పార్టీ బీజేపీకి అవసరమైన చోటల్లా  ప్రత్య క్షంగానే మద్దతు తెలుపుతూనే ఉన్నారు. రాజ్యసభలో బిల్లులు ఆమోదా నికి  వచ్చినప్పుడల్లా చెయ్యెత్తి  జై కొడుతూనే  ఉన్నారు. రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతుల ఎన్నికల సమయంలో కేంద్రం నిర్ణ యించిన వ్యక్తికే తమ ఓటు అని అధికారికంగానే ప్రకటిస్తూనే వస్తున్నారు. 

ఇక్క‌డ ఏపీలో మాత్రం వైసీపీ, బీజెపీల మ‌ధ్య ఏది ప‌డినా బుగ్గ‌య్యేంత క‌య్యాలు నెల‌కొన్నాయి. ఎన్ని క‌లు వ‌చ్చిన‌పుడ‌ల్లా ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌ల యుద్ధానికి అంతే వుండ‌దు. నోటికీ అడ్డూ ఆపూ వుండదు. అంతెందుకు ఇరు పార్టీల అధినాయ‌కుల పోక‌డ‌లు జిమ్మిక్కుల లాజిక్కు బొత్తిగా  అర్ధంగాక ఇరు పార్టీల వ‌ర్గాలూ త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. వీటితో పాటు రాష్ట్రంలో జరుగుతున్న అనేక కీలక పరిణామాల పట్ల అస్సలు స్పందించని జగన్.. మళ్ళీ పార్టీని అధికారంలోకి  తేవడానికి, మొత్తం 175 సీట్లు సాధించడానికి ఏం మాయ చేస్తారో..? అని వైసీపీ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. 

జ‌గ‌న్ దేశంలోని ముఖ్య‌మంత్ర‌లుంద‌రి క‌న్నా చిన్న‌ వ‌య‌సు వారు. తండ్రి వారసత్వాన్ని అంది పుచ్చుకు ని  పార్లమెంటు సభ్యుడి హోదా నుండి ఏకంగా సీఎం స్థానాన్ని అందుకున్నారు. ఆయ‌న‌కు మంత్రిగా చేసిన అనుభ‌వం లేదు. కానీ,  కేంద్రంలో బిజేపీ అగ్ర‌నేత‌లు మోడీ, అమిత్ షాతో స‌ఖ్య‌త పాటించ‌డం, విజ‌యవంతంగా కొన‌సాగించ‌డంలో  నైపుణ్యం ప్ర‌ద‌ర్శిస్తు మోడీ ద‌త్త‌పుత్రుడు అనే పేరు మాత్రం సంపా దించారు. ఏకంగా కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ అలా జ‌గ‌న్‌ను ప్ర‌శంసించారంటే జ‌గ‌న్ కేంద్రంలో స్నేహ‌బంధాలు మ‌హా గ‌ట్టి ప‌డ్డాయ‌నే అనాలి. 
 
 ఢిల్లీ లో  అంత‌లా అంటకాగుతున్న వైసీపీ, బిజెపీ స్నేహం  ఆంధ్రప్రదేశ్ లో మాత్రం బెడిసి కొట్టింద‌నే అనాలి.  బిజెపీనీ ఆమ‌డ దూరం పెట్టడమే కాకుండా, తమ పార్టీ నేతలతో తిట్టిస్తున్నారు కూడా. లీడర్ ఆదేశాలతో వైసీపీ నేతలు త‌మ నోటి దురుసు బాగా ప్ర‌ద‌ర్శిస్తున్నార‌న్న‌ది  బీజేపీ వ‌ర్గాల  గోల‌.  ఆంధ్ర‌లో పెరిగిపోతున్న ఈ వైష‌మ్యాల‌కు పెద్ద ఉదాహ‌ర‌ణే ఇటీవ‌లి ఆత్మ‌కూరు ఉప ఎన్నిక‌లు.  నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో ఇటీవలే జరిగిన ఉప ఎన్నికలో వైసీపీనేతలు  బీజేపీకి డిపాజిట్ రాకుండా చేశారు. 

ఢిల్లీలో తమ అధినాయకుడు మాత్రం రాష్ట్రపతి ఎన్నికల్లో మోడీ నిర్దయించిన ద్రౌవది ముర్ముకు పూర్తి మద్దతు ప్రకటించారు. రాష్ట్రానికి కేంద్రం ప్రకటించిన పలు హామీలు సాధించ కుండానే ప్రధాని నిర్ణయించిన రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఎలా ఇస్తారని ప్రశ్నించే వారికి జగన్ సమాధా నమే చెప్పరు. అలా ఎందుకు చేస్తున్నారని అడిగే ధైర్యం వైసీపీలో ఎవరికీ లేదనేది వాస్తవం అంటున్నా రు రాజకీయ పరిశీలకులు.

By
en-us Political News

  
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.