బెజవాడకు ముంపు తప్పదా? బుడమేరు ఇప్పటికీ దుఖదాయినేనా?

Publish Date:Aug 3, 2026

Advertisement

తెలుగువన్ స్పెషల్

విజయవాడ నగరాన్ని గతంలో తీవ్ర విషాదంలోకి నెట్టిన బుడమేరు ముంపు ఘటన జరిగి రెండేళ్లు పూర్తవుతోంది. ప్రభుత్వం అప్పట్లో ముంపు బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంది. అండగా నిలిచింది. అంతే కాకుండా.. బుడమేరు ముంపు సమస్యను శాశ్వత పరిష్కారానికి  అవసరమైన అన్ని చర్యలూ తీసుకున్నట్లు పేర్కొంది. అయితే ఇప్పటికీ నాటి బుడమేరు ముంపు ప్రాంతాల ప్రజలలో ఆందోళన ఇప్పటికీ ఇసుమంతైనా ఆందోళన తగ్గలేదు. వర్షాకాలం వచ్చిందంటే.. కృష్ణా నదికి వరద వస్తోందంటూ ఇక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు.  ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం కావడంతో ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరితే మళ్లీ ముంపు తప్పదా అన్న భయం మాత్రం స్థానికులను వెంటాడుతూనే ఉంది.  గత వరదల అనుభవాల దృష్ట్యా ప్రభుత్వం చేపట్టిన నివారణ చర్యలు కేవలం తాత్కాలికమేనని, ఇప్పటికీ ప్రమాదం పొంచి ఉందనే అభిప్రాయాలు స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నాయి.

గతంలో వచ్చిన తీవ్ర వరదల వల్ల విజయవాడ నగరంలోని దాదాపు 16 డివిజన్లు నీట మునిగిన సంగతి తెలిసిందే. రాయనపాడు, సింగ్ నగర్, వైఎస్సార్ కాలనీ, రాజరాజేశ్వరిపేట, భవానీపురం వంటి అనేక ప్రాంతాల్లో ప్రజలు దాదాపు పది రోజుల పాటు వరద నీటిలోనే చిక్కుకుపోయారు. ఆ సమయంలో  ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది.  బుడమేరు బెజవాడ పాలిట దుఃఖదాయినిగా మారింది.

ప్రస్తుతం ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక పరివాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో బుడమేరులోకి వరద ప్రవాహం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.దీంతో బుడమేరుర ముంపు భయం వెంటాడుతోంది. ఈ సందర్భంగా.. గతంలో పడిన గండ్లను ప్రభుత్వం  నామమాత్రంగానే పూడ్చిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొండపల్లి శాంతినగర్ వద్ద ప్రొటెక్షన్ వాల్ నిర్మాణం కూడా పూర్తిస్థాయిలో జరగలేదని  సిపిఐ నేత శంకర్ అంటున్నారు. 

బుడమేరు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించాలంటే   వెయ్యి కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం  50 కోట్ల రూపాయలే మంజూరు చేయడంతో పనులు అరకొర మాత్రమే జరిగాయంటున్నారు.   బుడమేరు దిగువ భాగంలో   282 ఎకరాలు, నగర పరిధిలో మరో 82 ఎకరాల వరకు ఆక్రమణలకు గురైనట్లు గతంలో నిర్వహించిన సర్వేలోనే తేలింది.

బుడమేరు ప్రవాహ మార్గంలో దశాబ్దాలుగా పేరుకుపోయిన పూడికను తొలగించకపోవడం, కాలువ లోతును పెంచకపోవడం వల్ల కొద్దిపాటి వరద వచ్చినా నీరు నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఏనికేపాడు అండర్ టన్నెల్ ఛానల్ వద్ద నీటి ప్రవాహ సామర్థ్యం కేవలం 4 వేల క్యూసెక్కులు మాత్రమే ఉండటం వల్ల, ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తే నీరు వెనక్కి తన్ని నగరంపైకి విరుచుకుపడే అవకాశం ఉంది.

నాటి వరదల్లో ఆటోలు, గృహోపకరణాలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయిన బాధితులు ఇప్పటికీ కోలుకోని పరిస్థితి. ప్రభుత్వం వెంటనే స్పందించి  ఆపరేషన్ బుడమేరు పేరుతో ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతున్నారు.కృష్ణా నది తరహాలోనే బుడమేరు పరివాహక ప్రాంతమంతా పటిష్టమైన రిటైనింగ్ వాల్ నిర్మించాలని, ఆక్రమణలను తొలగించి కాలువను వెడల్పు చేయాలని బెజవాడ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.  

 

 Vijayawada Floods, Budameru Flood Threat, Vijayawada News, Andhra Pradesh Rains, Budameru Retaining Wall

By
en-us Political News

  
ఒడిశాలోని బ్రహ్మపూర్‌లో మద్యం మత్తులో తీవ్ర దారుణం జరిగింది. డబ్బుల వివాదంతో స్నేహితుడి గొంతు కోసి హత్య చేసిన వ్యక్తి అర్ధరాత్రి పోలీసుల తనిఖీల్లో రక్తపు మరకలతో చిక్కాడు. ఈ ఘోర క్రైమ్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి!
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో భర్త మరొక మహిళతో ఉండగా చూసిన భార్య కారును అడ్డుకోగా, ఆమెను 100 మీటర్లు బానెట్‌పై ఈడ్చుకెళ్లిన షాకింగ్ ఘటన వైరల్‌గా మారింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
కరేబియన్ సముద్రంలో డ్రగ్స్ అక్రమ రవాణా బోటుపై అమెరికా సైన్యం జరిపిన దాడిలో నలుగురు మరణించారు. సెప్టెంబర్ 2025 నుండి ఇప్పటివరకు జరిగిన 70 దాడుల్లో 235 మంది మృతి చెందిన పూర్వాపరాలు మరియు పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
హైదరాబాద్‌లోని మియాపూర్ హఫీజ్‌పేట్‌లో ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ చేతిలో 27 ఏళ్ల లేడీ డాక్టర్ సృజన హత్యకు గురైన దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు పోలీసుల దర్యాప్తు నివేదిక.
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎం పోస్టులు ఇప్పిస్తామంటూ ఉమ్మడి వరంగల్, హనుమకొండ జిల్లాల్లో రూ.లక్షల్లో వసూలు చేస్తున్న దళారీల దందా వెలుగులోకి వచ్చింది. యూనియన్ ముసుగులో జరుగుతున్న ఈ అక్రమాలపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజారెడ్డి విచారణ ప్రకటించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్‌లోని సరూర్ నగర్ సాగరిక ఇంటెగ్రేటెడ్ హైస్కూల్‌లో రాఖీలు, తిలకం తొలగింపు వివాదంపై బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి టీచర్‌ను హిజాబ్‌‌పై ప్రశ్నించడం సంచలనంగా మారింది. పోలీసులు కార్పొరేటర్‌పై సుమోటో కేసు నమోదు చేశారు.
హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో కన్న కూతురిపై లైంగిక దాడికి యత్నించిన భర్త శ్రీనివాస్‌ను భార్య రమాదేవి గొడ్డలితో నరికి చంపింది. అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లా సీఐఎస్ఎఫ్ క్యాంపులో హెడ్ కానిస్టేబుల్ ఏకే 47 రైఫిల్‌తో చేసిన విచక్షణారహిత కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి చెందారు. సేవా పవర్ ప్రాజెక్ట్ వద్ద జరిగిన ఈ దారుణ ఘటనపై సీఐఎస్ఎఫ్ డీజీ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.
ఒడిశా తాల్చేర్ ప్రాంతంలో సంచలనం సృష్టించిన దారుణ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్ మాధాపూర్‌లో స్పా సెంటర్ ముసుగులో నడుస్తున్న అక్రమ వ్యభిచార రాకెట్‌ను ఎస్‌ఓటీ పోలీసులు మట్టుబెట్టారు. నలుగురు యువతులను రక్షించి, రూ. 45 వేల నగదు, 8 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
యాదాద్రి భువనగిరి జిల్లా చల్లూరులో భూభారతి వెబ్‌సైట్ ద్వారా ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండానే 7.18 ఎకరాల భూమి వేరొకరి పేరు మీదకు మారిపోయింది. యజమానులకు తెలియకుండా జరిగిన ఈ భారీ భూ భాగోతం పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఏపీ సచివాలయ ఉద్యోగాలు, డీఎస్సీ నియామకాలు మరియు మెడికల్ సీట్లలో నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్ల అక్రమాలపై విచారణ ముమ్మరమైంది. హైకోర్టు ఆదేశాలు, విజిలెన్స్ తనిఖీలు మరియు సాప్ చేపట్టిన స్కిల్ టెస్ట్ వివరాలు ఇక్కడ చూడండి.
150 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న వందేమాతరం గేయానికి జాతీయ గీతంతో సమాన హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ తెచ్చింది. 3 నిమిషాల 10 సెకన్ల ఆలాపన, సుప్రీంకోర్టు విచారణ మరియు చట్టపరమైన నిబంధనల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.