Publish Date:Oct 28, 2024
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టూరిజం శాఖ కొత్త పుంతలు తొక్కుతోంది. గోదావరిలో తేలుతూ ఇష్టమైన, రుచికరమైన ఆహారం తింటూ విహరించే అద్భుత అనుభవం రాజమహేంద్రవరం వాసులకు అందుబాటులోకి వచ్చింది. పోలవరం- భద్రాచలం టూర్ అందుబాటులో ఉన్నప్పటికీ.. ఆ టూర్ మొత్తం రోజంతా పడుతుంది. అదో ఎక్స్ పీరియెన్స్ అయితే.. పెద్దగా సమయం వృధా అవ్వకుండా.. ఇలా హోటల్ కు వెళ్లి అలా వచ్చేసే అవకాశం ఉన్న ఈ ఫ్లోటింగ్ రెస్టారెంట్ ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకర్షిస్తుందనడంలో సందేహం లేదు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద గోదావరిలో ఫ్లోటింగ్ రెస్టారెంట్ ప్రారంభమైంది. రాజమహేంద్రవరం వద్ద గోదావరిలో రెండు వంతెనల మధ్య ఫ్లోటింగ్ రెస్టారెంట్ ను ఏర్పాటు చేశారు.
రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి.. రైల్వే ఆర్చి బ్రిడ్జి మధ్యలో బ్రిడ్జి లంక వద్ద ఏర్పాటైన ఫ్లోటింగ్ రెస్టారెంట్ ను పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, బత్తుల బలరామకృష్ణ ఆదివారం (అక్టోబర్ 27) ప్రారంభించారు. పద్మావతి ఘాట్ సమీపంలోని టూరిజం కంట్రోల్ రూమ్ నుంచి బోటులో పయనించి.. గోదావరి మధ్యలోని ఇసుక తిప్పలను ఆనుకుని నీటిలో తేలియాడుతున్న ఈ రెస్టారెంట్ వద్దకు చేరుకోవాలి. రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 7 గంటల వరకూ ఇది ఏపెన్ అయ్యి ఉంటుంది. ఈ ఫ్లోటింగ్ రెస్టారెంట్ లో శాకాహారం, మాంసాహారం రెండూ ఉంటాయి. ఈ ఫ్లోటింగ్ రెస్టారెంట్ లో ఒకే సారి 170 మంది కూర్చునేందుకు అవసరమైన సిట్టింగ్ సామర్థ్యం ఉంది. సిల్వర్ స్పూన్, ఆహ్వానం కిచెన్ ప్రాంచైజీస్ ఆధ్వర్యంలో ఆపరేషన్ అండ్ మెయింట్‌నెన్స్ విధానంలో ఈ రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/floating-restaurent-on-gadavary-25-187527.html
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు