శేషాచలం అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదం

Publish Date:Apr 27, 2026

Advertisement

పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతికి అతి సమీపంలోని  శేషాచలం అటవీ ప్రాంతంలో సోమవారం (ఏప్రిల్ 27) భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జీవకోన అటవీ రేంజ్ పరిధిలోని మొండోడికోన ప్రాంతంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అటవీ సంపదకు భారీ నష్టం వాటిల్లింది. మంటలు వేగంగా వ్యాపించడంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి.  సమాచారం అందుకున్న వెంటనే  అటవీ శాఖ యంత్రాంగం అప్రమత్తమైంది. సుమారు 50 మందితో కూడిన ప్రత్యేక బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అటవీ శాఖ సిబ్బందితో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం  అటవీ విభాగం,  అగ్నిమాపక దళం సిబ్బంది  రంగంలోకి దిగి మంటలను అదుపులోనికి తీసుకువచ్చారు. దాదాపు రెండు కిలోమీటర్ల మేర విస్తరించిన మంటలను అదుపు చేశారు. 

ప్రాథమిక అంచనాల ప్రకారం, ఈ ప్రమాదంలో సుమారు 2 కిలోమీటర్ల మేర విస్తీర్ణంలో ఉన్న అటవీ ప్రాంతం   దగ్ధమైంది. విలువైన వృక్ష సంపదతో పాటు అరుదైన వనమూలికలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. మంటల తీవ్రతకు భయపడిన వన్యప్రాణులు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశాయి. అటవీ శాఖ అధికారులు   ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

ముఖ్యంగా ఈ ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలోనే ఎర్రచందనం నిల్వ చేసే గిడ్డంగులు ఉండటంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. మంటలు ఆ గిడ్డంగుల వైపు మళ్లకుండా ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టారు.  ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు   విచారణ జరుపుతున్నారు.   ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో, ఎండిపోయిన గడ్డి మరియు ఆకులు ఘర్షణ వల్ల మంటలు పుట్టాయని భావిస్తున్నారు.   ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో అటవీ ప్రాంతాల్లో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. 

By
en-us Political News

  
ధర్మేంద్ర నుంచి అషు రెడ్డి సుమారు 5 కిలోల బంగారం, ఖరీదైన కార్లు, స్థిరాస్తులను పొందారు. ఈ మొత్తం విలువ రూ. 9.35 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. అయితే, పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి అషు రెడ్డి మొహం చాటేయడమే కాకుండా.. తనపైనే తప్పుడు కేసులు పెడతానని బెదిరించినట్లు బాధితుడి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగానే సీసీఎస్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
పల్నాడులో ఇంధన విక్రయాలలో అక్రమాలకు పాల్పడుతున్న మూడు పెట్రోల్ బంకులను కలెక్టర్ సీజ్ చేశారు. నరసరావుపేట, చిలకలూరిపేట, పిడుగురాళ్ల లో నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు జరుపుతున్న మూడు ఫిల్లింగ్ స్టేషన్లను సీజ్ చేశారు.
శివారు అమ్మాపురం గ్రామానికి చెందిన కిన్నెర గుంశావలి కుటుంబ కలహాలతో తీవ్ర మనస్తాపానికి గురై తన ఇద్దరు కుమారులను స్థానిక వ్యవసాయ మార్కెట్ ఎదురుగా ఉన్న కాలీఫ్లవర్ పొలంలోని వేప చెట్టుకు ఉరేసి చంపేసి అనంతరం తానుకూడా ఆ చెట్టుకే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ కేసుకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా ఈ ముగ్గురిలో బెయిల్ కోసం రోహిత్ రెడ్డి ఒక్కరే హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ కేసులో అరెస్టైన ముగ్గురిలో మొదటిగా రోహిత్ రెడ్డి బెయిలుపై బయటకు వచ్చారు.
రవాణా, విద్యుత్ , పర్యాటక రంగాలకు సంబంధించిన కీలక ప్రాజెక్టులు ఉన్నాయి. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన రహదారుల విస్తరణ, వంతెనల నిర్మాణం ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల వల్ల సిక్కిం ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటమే కాకుండా, సరిహద్దు ప్రాంతాల్లో అనుసంధానత మరింత బలోపేతం కానుంది.
హపూర్‌కు చెందిన ఒక యువకుడికి, అదే ప్రాంతానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే, పెళ్లి రోజున వరుడు తన స్నేహితులతో కలిసి పూటుగా మద్యం సేవించి వివాహ వేదిక వద్దకు చేరుకున్నాడు. కనీసం స్టడీగా నడవలేని స్థితిలో పెళ్లివేదికపైకి వచ్చి తూలిపడిన వరుడి తీరు చూసి షాక్ తిన్న వధువు.. క్షణం ఆలస్యం చేయకుండా తనకు ఈ పెళ్లి వద్దని తేల్చి చెప్పేసింది.
రాష్ట్ర స్థాయి కమిటీ మినహా.. ప్రస్తుతం ఉన్న జిల్లా, మండల, గ్రామ స్థాయి కమిటీలన్నింటినీ రద్దు చేశారు. అంతే కాకుండా పార్టీ పునర్నిర్మాణ బాధ్యతలను సంపూర్ణంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావుకు అప్పగించారు.
పటియాలాలోని శంభు-అంబాలా మార్గంలో రాత్రి 10 గంటల సమయంలో ఒక్కసారిగా పేలుడు శబ్దం వినిపించింది. గూడ్స్ రైళ్లు ఎక్కువగా ప్రయాణించే ఈ మార్గంలో పేలుడు ధాటికి రైల్వే పట్టాలు దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న రైల్వే పోలీస్ , రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.
నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు కాగా, ఆదిలాబాద్, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక హైదరాబాద్‌లో 42.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఎండలు మండిపోతుండటంతో జనం బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది.
షరతులకు అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ ససేమిరా అన్నట్లు తెలిసింది. ముఖ్యంగా అణు చర్చలను వాయిదా వేయాలన్న ప్రతిపాదనను ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలను తయారు చేయకూడదన్నదే తన ప్రధాన లక్ష్యమని, దీనిపై రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన గతంలోనే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అణు చర్చలను పక్కన పెట్టి చేసే ఏ ఒప్పందమైనా నిష్ప్రయోజనమని ట్రంప్ అంటున్నారు.
రాష్ట్రంలోని ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను వివరిస్తూ.. క్వింటాల్ మొక్కజొన్న ధర కేవలం రూ.1,600 నుంచి రూ.1,700 మధ్య మాత్రమే పలుకుతోందని చంద్రబాబు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర రూ.2,400 తో పోలిస్తే ఇది చాలా తక్కువ అని పేర్కొన్న ఆయన ఈ వ్యత్యాసం వల్ల సాగుదారులు పెట్టుబడి కూడా వెనక్కి రాక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
నిందితులు బాధితురాలి విద్యా ధృవపత్రాలను మరియు ఇతర ముఖ్యమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారని, వాటిని మలేగావ్‌లోని ఒక బృందానికి అందించేందుకు ప్లాన్ చేశారనీ, నిదా ఖాన్ బాధితురాలికి ఇస్లామిక్ సాంప్రదాయాలపై శిక్షణ ఇవ్వడంతో పాటు, ఆమె ఫోన్‌లో మతపరమైన యాప్‌లను ఇన్‌స్టాల్ చేసిందని ప్రాసిక్యూషన్ పేర్కొంది.
తీవ్రమైన గాలుల ధాటికి ట్రాకులపై ఉన్న క్రేన్లు అదుపుతప్పాయి. ఒక క్రేన్ వేగంగా కదులుతూ పక్కనే ఉన్న మరో భారీ క్రేన్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ తాకిడికి ఆ రెండు యంత్రాలు ఒక్కసారిగా కార్మికులు ఆశ్రయం పొందుతున్న షెడ్డుపై కుప్పకూలాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.