ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో అగ్రి ప్రమాదం: అపార్ట్ మెంట్ లో చెలరేగిన మంటలు.!
Publish Date:Nov 20, 2026
Advertisement
హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిధిలోని పసిఫికా హిల్‌క్రెస్ట్ అపార్ట్మెంట్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అపార్ట్మెంట్లోని బి-బ్లాక్‌లో మంటలు చెలరేగి పై అంతస్తుల వైపు వ్యాపించడంతో నివాసితులు తీవ్ర భయాందోళనకు గురైనా వెంటనే అప్రమత్తమై భవనం నుంచి బయటకు పరుగులు తీయడంతో ప్రాణనష్టం తప్పింది. నార్సింగి పోలీసుల సమాచారం మేరకు.. 12వ అంతస్తులో తొలుత పొగలు రావడాన్ని స్థానికులు గమనించారు. కొద్దిసేపటికే మంటలు ఉద్ధృతంగా వ్యాపించి పై అంతస్తులకు విస్తరించాయి. సమాచారం అందుకున్న లంగర్‌హౌస్ అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైరింజిన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో భవనం వెలుపల ఉన్న ఫాల్ సీలింగ్ కాలిపోగా, గోడలు మసితో నల్లగా మారినట్లు సమాచారం. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న నివాస, వాణిజ్య ప్రాంతాల్లో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలపై ఈ ఘటన పలు సందేహాలకు తావిచ్చింది. తాజా ఘటన నేపథ్యంలో అపార్ట్మెంట్లలో విద్యుత్ వ్యవస్థలు, భద్రతా ఏర్పాట్లపై మరింత అప్రమత్తత అవసరమని నిపుణులు అంటున్నారు. ఇది కూడా చదవండి: మారేడుమిల్లి వుడ్స్ రిసార్ట్ లో అగ్ని ప్రమాదం: కాలి బూడిదైన వీఐపీ కాటేజ్.! పోలీసుల దర్యాప్తులో అగ్నిప్రమాదానికి గల కచ్చితమైన కారణాలపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. విద్యుత్ లోపాలా లేక మరేదైనా కారణమా అనే అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. రాబోయే రోజుల్లో నివాస భవనాలలో అగ్నిమాపక తనిఖీలు, భద్రతా నిబంధనల అమలుపై అధికారులు మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఈ ఘటనతో పసిఫికా హిల్‌క్రెస్ట్ పరిసరాల్లో కొంతకాలం ఆందోళన వాతావరణం నెలకొన్నప్పటికీ, మంటలు అదుపులోకి రావడంతో పరిస్థితులు చక్కబడ్డాయి. దర్యాప్తు నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉండే అవకాశం ఉంది. మీకు నచ్చవచ్చు: హస్తినలో అగ్ని ప్రమాదం: నలుగురు మృతి.! [Fire Accident, Financial District, Pacifica Hillcrest Apartments, short circuit, TeluguOne]
http://www.teluguone.com/news/content/fire-accident-24-237559.html





