ఫ్యాన్ స్విచ్ మళ్ళీ పీకే చేతికే!?

Publish Date:Mar 25, 2026

Advertisement

2014 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు. శకునిని అడ్డుపెట్టుకొని, జూదంలో పాండవులపై కౌరవులు పైచేయి సాధించినట్టుగా.. శకుని లాంటి రాజకీయ వ్యూహకర్త జిత్తులతో ఫ్యాన్ పార్టీ అధికారంలోకి వచ్చింది. భారతంలో ద్రౌపదిని వివస్త్రను చేయడానికి కౌరవులు ప్రయత్నిస్తే.. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను మిగల్చడానికి ఆ పార్టీ ప్రయత్నించింది. అందుకే కురుక్షేత్రంలో కౌరవులు ఓడిపోయినట్టుగా.. 2024 ఎన్నికల్లో ఘోర ఓటమిని చూసింది. అయినా ఫ్యాన్ పార్టీ తీరు మారలేదు. వచ్చే ఎన్నికల కోసం మళ్ళీ ఆ శకుని లాంటి వ్యూహకర్తను రంగంలోకి దింపడానికి చూస్తున్నట్లు తెలుస్తోంది. 

అసలీ ఉపోద్ఘాతమంతా ఎందుకంటున్నారా? అక్కడికే వస్తున్నా... ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన చర్చ జోరుగా సాగుతోంది.  2024ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ,   2029 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే పావులు కదపడం ప్రారంభించిందన్న చర్చ జరుగుతోంది.   ముఖ్యంగా గతంలో అంటే 2019 ఎన్నికలలో తనకు అఖండ విజయాన్ని అందించిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే వైపు జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ మొగ్గు చూపుతున్నారని చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.  గత ఎన్నికల సమయంలో తలెత్తిన విభేదాలను పక్కన పెట్టి, మళ్ళీ పాత బంధాన్ని పునరుద్ధరించుకోవాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం.

2019 ఎన్నికల్లో వైకాపా సాధించిన 151 సీట్ల అద్భుత విజయానికి ప్రశాంత్ కిషోర్ వ్యూహాలే ప్రధాన కారణమన్న సంగతి తెలిసిందే.  అప్పట్లో జగన్ పాదయాత్ర నుంచి అభ్యర్థుల ఎంపిక వరకు పీకే  కీలక పాత్ర పోషించారు.  అయితే, 2024 ఎన్నికల సమయానికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రశాంత్ కిషోర్ ప్రత్యక్ష రాజకీయాల నుంచి విరామం తీసుకోవడం, జగన్ కు దూరంగా జరగడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. అంతేకాకుండా, గత ఎన్నికల్లో జగన్ ఓటమిని పీకే ముందే ఊహించి ప్రకటించడం ఇద్దరి మధ్య అగాధాన్ని పెంచింది.

అయితే 2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత ఇప్పటి వరకూ వైసీసీ ఇసుమంతైనా కోలుకోలేదు. పైపెచ్చు ఆ పార్టీ అధినేత జగన్  ఏపీకి విజిటర్ గా మాత్రమే వస్తూ ఎక్కువ కాలం బెంగళూరుకే పరిమితం కావడంతో వైసీపీ క్యాడర్ కూడా దాదాపు చెల్లాచెదరైన పరిస్థితి.  ఉన్న కేడర్ లో సైతం నైరాశ్యం అలుముకుంది.  ఇక అధికారంలో ఉన్నంత కాలం పార్టీ తరఫున గొంతును గట్టిగా వినిపించిన నేతలలో చాలా మంది ప్రస్తుతం సైలంట్ మోడ్ లో ఉన్నారు.

ఇటువంటి తరుణంలో పార్టీని గాడిన పెట్టడానికి పటిష్ట వ్యూహాలు రచించాలంటే పీకేయే శరణ్యమని జగన్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాల నుంచే గట్టిగా వినిపిస్తోంది.  2024 ఎన్నికల్లో ఐప్యాక్  క్షేత్రస్థాయి పరిస్థితులను సరిగ్గా అంచనా వేయడంలో విఫలమైందని జగన్ భావిస్తున్నారు. ఆ లోపాలన్నిటినీ సరిదిద్ధి క్యాడర్ లో ఉత్సాహం నింపాలంటే ప్రశాంత్ కిశోర్ వినా మరో గత్యంతరం లేదని జగన్ గట్టిగా భావిస్తున్నారని అంటున్నారు. 

ఈ నేపథ్యంలోనే  జగన్  పీకేతో సంప్రదింపులు జరిపాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. పార్టీ నాయకత్వంలో ఉన్న లోపాలను సరిదిద్దడం, నియోజకవర్గాల వారీగా బలాబలాలను అంచనా వేయడంలో పీకే అనుభవం తనకు ఉపకరిస్తుందని జగన్ భావిస్తున్నట్లు కనబడుతోంది.  గతంలో పీకేపై జగన్ కొన్ని విమర్శలు చేశారు. అలాగే పీకే సైతం జగన్ పై కొన్ని వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. గతం గత: అనుకుని మళ్లీ పీకేతో కలిసి ముందుకు సాగాలని జగన్ గట్టిగా నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం అది అంత సులభంగా జరిగే పని కాదని అంటున్నారు. గతంలో  జగన్ తనపై చేసిన వ్యాఖ్యలను పీకే విస్మరిస్తారా? అలాగే..   పీకే  జగన్ రాజకీయ శైలిపై చేసిన వ్యాఖ్యలను జగన్ మరచిపోయి మళ్లీ చేతులు కలుపుతారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  అదే సమయంలో  ఒక వేళ పీకే, జగన్ లు చేతులు కలిపినా.. 2019 నాటి మ్యాజిక్  రిపీట్ అయ్యే అవకాశాలు అంతంత మాత్రమేనని కూడా అంటున్నారు. సొంత రాష్ట్రం బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో అన్ని స్థానాలకూ తన పార్టీ జనసురాజ్ పార్టీ అభ్యర్థులను నిలిపిన ప్రశాంత్ కిశోర్ కనీసం ఒక్కరిని కూడా గెలిపించుకోలేక బొక్కబోర్లా పడ్డ సంగతిని గుర్తు చేస్తూ.. ఏపీలో పీకే వ్యూహాలు పారే అవకాశాలు లేవంటున్నారు. 

By
en-us Political News

  
మంగళగిరిలో వంద పడకల ఆసుపత్రి, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వంటి ఎన్నో పనులను కేంద్ర ప్రభుత్వ నిధుల భాగస్వామ్యంతో పూర్తి చేస్తున్నట్లు వివరించారు.
వైసీపీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన ఒక్క పెద్ద పరిశ్రమ కూడా రాకపోగా, ఉన్న ఉపాధి వనరులను పొరుగు రాష్ట్రాలకు తరిమేశారని సువేరా మండిపడ్డారు. అమరరాజా, లూలూ గ్రూప్, జాకీ వంటి దిగ్గజ సంస్థలను కక్షపూరిత రాజకీయాలు, ఆర్థిక వేధింపులతో రాష్ట్రం సరిహద్దులు దాటించారని విమర్శించారు.
రమణమూర్తి గతంలో తిరుమలలో అన్నమయ్య నివాసాన్ని తొలగించినప్పుడు జరిగిన ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నారనీ, చినజీయర్ స్వామి వంటి ప్రముఖులతో కలిసి హిందూ ధర్మ ప్రచారంలో నడిచిన చరిత్ర రమణమూర్తిది అని భరద్వాజ చెప్పారు. అయితే, హిందూ మతం వేరు, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే హిందుత్వ వేరు అంటూ రమణమార్తి ఇటీవల పలు సందర్భాలలో తన అభిప్రాయాలు వ్యక్తం చేశారన్న భరద్వాజ.. ఈ నేపథ్యంలోనే ఆయన గొంతు నొక్కడానికి పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందని చెప్పారు.
ముంబై కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రిలో సర్జరీ తరువాత కోలుకున్న జగన్ తొలి పర్యటనకు తన సొంత నియోజకవర్గం పిఠాపురాన్ని ఎంచుకోవడం రాజకీయంా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలా ఉండగా పవన్ రాక సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు జనసేన నాయకులు, శ్రేణులు భారీ ఏర్పాటు చేశారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఉప ప్రధాని పదవిని ఎవరికీ కేటాయించలేదు. అయితే త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారంటూ విజయసాయి చెప్పిన జోస్యం ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.
బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న యువ సంగ్రామ సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది. గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు. రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.