Publish Date:Mar 25, 2026
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి. ఈ విషయంలో వైసీపీకి వినా మరెవరికీ ఎటువంటి అభ్యంతరాలు, అనుమానాలూ లేవు. అయితే అడుగడుగునా అమరావతికి అడ్డంకులు కల్పిస్తూ వైసీపీ చీకాకులు సృష్టిస్తోంది. జగన్ ఐదేళ్ల హయాంలో అప్పటికి వేగంగా జరుగుతున్న అమరావతి నిర్మాణాన్ని నిలిపివేసి.. నిర్వీర్యం చేసింది. అమరావతికి భూములిచ్చిన రైతులను నానా ఇబ్బందులూ పెట్టింది. అయితే 2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి విజయం సాధించి అధికారంలోకి రావడంతో అమరాతి అడ్డంకులు తొలిగిపోయి ఏకైక రాజధాని నిర్మాణం శరవేగంగా ముందుకు సాగుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని గుర్తిస్తే రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం ఆమోదించేందుకు సమాయత్తమౌతోంది. ఇందు కోసం ఈ నెల 28 రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ సమావేశం ఎజెండా అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ తీర్మానం ఆమెదించడమే. ఇది ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా కీలక ముందడుగుగా భావించవచ్చు.
ఇప్పటికే అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక శాశ్వత రాజధానిగా గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసింది. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే పార్లమెంటు ప్రస్తుత సమావేశాల్లోనే రాబోయే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. ఇప్పుడు రాష్ట్ర అసెంబ్లీ ఆమరావతిని రాష్ట్ర శాశ్వత రాజధానిగా తీర్మానం ఆమెదించి కేంద్రానికి పంపిస్తే.. ఆ దిశగా కేంద్రం పార్లమెంటులో సవరణ బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం పార్లమెంటులో ఎన్డీయేకు ఉన్న సంఖ్యాబలం దృష్ట్యా ఆ బిల్లు ఆమోదం లాంఛనమే. ఇక బిల్లు ఆమోదం పొందితే అమరావతికి తిరుగులేని చట్టబద్ధత లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన సమయంలో హైదరాబాద్‌ను పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా కేటాయించిన సంగతి తెలిసిందే. ఆ గడువు దాదాపు రెండేళ్ల కిందటే.. అంటే 2024 జూన్ 2తో ముగిసింది. అంటే అప్పటి నుంచీ ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంగా ఉందన్న మాట.
సీఎం చంద్రబాబు ఇటీవలి తన హస్తిన పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో రాజధానిగా అమరావతికి చట్టబద్ధతపై చర్చించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అమరావతిపై నెలకొన్న గందరగోళాన్ని పూర్తిగా తొలగించాలంటే పార్లమెంట్‌లో చట్టబద్ధత అవసరమని గట్టిగా చెప్పారు. దీనిపై అమిత్ షా సానుకూలంగా స్పందించి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు. ఈ విషయంపై ఇప్పటికే ముసాయిదా బిల్లు కూడా రెడీ అయ్యిందని తెలుస్తోంది.
ఈ ముసాయిదా బిల్లుకు న్యాయ, పట్టణాభివృద్ధి శాఖల నుంచి ఆమోదం కూడా అభించిందని అంటున్నారు. దీంతో అసెంబ్లీ అమరావతి ఏకైక శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపడం ఇక ఎలాంటి జాప్యం లేకుండా పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టే దిశగా కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి దోహదపడుతుందని పరిశీలకులు అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/amaravati---sole-capital-of-andhra-pradesh-39-216146.html
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.