తల్లీ బిడ్డల ఆరోగ్యానికి కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక కృషి
Publish Date:Aug 3, 2012
Advertisement
సమతుల్య ఆహారం అందక హాస్పటల్ పాలవుతున్న పిల్లల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. దాంతోప్రభుత్వం వారికి ప్రత్యేక సదుపాయాలతో ఆసుపత్రులలో చేర్చుకొని మెరుగైన వైద్యసేవలు అందించాలనుకుంటోంది. వారితోపాటు తల్లులు కూడా తప్పనిసరిగా ఉండాల్సిరావడంతో వారి రోజువారి కుటుంబపోషణకు భారం అవుతుంది. దీనిని నివారించడం కోసం పిల్లలతోపాటు ఆసుపత్రిలో ఉండే తల్లులకు కూడా ప్రభుత్వం సాయం చేయాలనుకుంటుంది. ఇలా ఆసుపత్రులలో ఉండే తల్లులకు రోజుకు 150 రూపాయల చొప్పున నెలరోజుల పాటు జీవన భృత్యం చెల్లించాలని కుటుంబ సంక్షేమ అధికారులు తెలిపారు. గర్బిణీలకు ప్రత్యేక వైద్య సదుపాయాలు కలిగించాలనుకుంటున్నారు.గిరిజన ప్రాంతాలలో రోగులను సమీప ఆసుపత్రులకు తరలించడానికి గాను బరువులేని డోలీలు, పల్లకీలు తయారు చేయిస్తున్నట్లు కుటుంబ సంక్షేమ అధికారులు తెలిపారు. దీనిలో భాగంగా అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో ఖాళీగా ఉన్న పోస్టులను ఆగస్టు 20 కల్లా భర్తీ చేయనున్నామని తెలియ చేశారు. అలాగే తల్లీ బిడ్డల ఆరోగ్యంకోసం తల్లిపాల ప్రాధాన్యత గురించి వివరిస్తారు. తల్లిపాలు ఇవ్వడం వల్ల మహిళలలో రొమ్ము, అండాశయ కేన్సర్లు వచ్చే అవకాశాలు తక్కువని వైద్యులు తెలిపారు.
http://www.teluguone.com/news/content/family-planning-ministry-special-care-24-16200.html





