యోగి=మోదీ.. కాషాయం కట్టుకున్న ఖతర్నాక్ లీడర్.. యూపీ బిగ్‌బాస్
Publish Date:Mar 10, 2022
Advertisement
యూపీలో బీజేపీ బంపర్ విజయం. సింగిల్ హ్యండ్‌తో గ్రాండ్ విక్టరీ. అది యోగి గొప్పతనమా? మోదీ ఘనతా? అంటే వెంటనే సమాధానం చెప్పలేం. ఇద్దరిదీ కావొచ్చు.. కానీ, ఇద్దరు సమానుల్లో యోగినే కాస్త ఎక్కువ సమానం అనేది మాత్రం నిజం. ఆయన యోగినే అయినా.. అందరిలా ఆశ్రమాల్లో ఆవులు మేపుకునే సాధారణ సాధువు మాత్రం కాదు. రాజకీయ వ్యవసాయం చేసే సంచలన యోగి. సమాజంలోని కలుపు మొక్కలు పీకేసే ఖతర్నాక్ యోగి. క్రిమినల్స్‌కి యోగి రూపంలో ఉన్న యముడు.. సామాన్యులకు మనసున్న సాధువు. ప్రజలను మెప్పించిన ముఖ్యమంత్రి. ఇంతకీ ఐదేళ్ల యోగి పాలన ఎలా సాగింది? యూపీలో ఆయన మార్క్ ఎలా ఉంది? దేశంలోకే అతిపెద్ద రాష్ట్రం యూపీలో బీజేపీ ఘన విజయం సాధించింది. ఇదే జోష్‌తో 2024 ఎన్నికలకు రెడీ అవుతుంది. కమలనాథులకు యూపీ ఇచ్చిన కిక్ మామూలుది కాదు. థౌజెండ్ వాట్స్ పవర్ అది. కాషాయం కట్టుకున్న ఓ బక్కపలుచ మనిషి.. ఇంతటి ఖతర్నాక్ సీఎంగా మారుతారని ఆయన సీఎం కుర్చీపై కూర్చొనే వరకూ ఎవరూ ఊహించనేలేదు. ఇప్పుడు ప్రధాని అభ్యర్థిగా మోదీ తర్వాత అంతటి క్రేజ్.. ఇమేజ్ ఉన్న లీడర్ ఎవరంటే అంతా యోగినే చూపిస్తున్నారు. మోదీలానే ఎలాంటి అవినీతి మరకలు లేని.. మిస్టర్ క్లీన్ యోగి ఆదిత్యనాథ్. సీఎంగా.. హోం, రెవెన్యూ, హౌసింగ్, మైన్స్ లాంటి కీలకమైన 36 మంత్రిత్వ శాఖలను తన ఆధీనంలోనే ఉంచుకున్నారు. స్వచ్చమైన పాలన అందించారు. అందుకే, యూపీ సీఎం యోగిని.. బీజేపీలో మోదీ 2.O అంటారు. ఇటీవలి ఇండియా టుడే సర్వేలో.. బీజేపీ తరపున మోదీ తర్వాత ప్రధాని అభ్యర్థిగా అత్యంత పాపులారిటీ ఉన్న నేతగా యోగి నిలిచారు. యోగి వయస్సు 49 ఏళ్లే. ఆయన ఏనాటికైనా బీజేపీ పీఎం అభ్యర్థి అవుతారని అంటున్నారు. యూపీలో నేరగాళ్ల పాలిటి సింహస్వప్నం ఈ సాధువు. గడిచిన ఐదేళ్లలో 182 మంది క్రిమినల్స్‌ను ఎన్‌కౌంటర్‌లో కాల్చిపారేశారు. 4,206 మందికి కాళ్లపై బుల్లెట్లు దించారు. 21,625 మందిని అరెస్టు చేసి జైల్లో పెట్టారు. యోగి పాలనతో యూపీలో నేరాల సంఖ్య బాగా తగ్గాయి. నేరస్తులు తాము బయట ఉండటం కంటే.. జైల్లో ఉంటేనే కనీసం ప్రాణాలతోనైనా మిగులామని భయపడ్డారంటే.. యోగి హయాంలో లా అండ్ ఆర్డర్ ఎంత అటెన్షన్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక, కేంద్ర నిథులు, పథకాలు యూపీలో వరదలా పారాయి. 2.4 కోట్ల మందికి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, 1.5 కోట్ల మందికి పీఎం ఉజ్వల, 7.8 కోట్ల జన్‌ధన ఖాతాలు, 80 లక్షల కుటుంబాలుకు ఉపాధి హామీ , 10.2 కోట్ల మందికి పీఎం ఆవాస్, 1.3 కోట్ల మందికి ఆయుష్మాన్ భారత్, రూ.36 వేల కోట్లతో పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకాలను అమలు చేశారు. విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, యూనిఫామ్ అలవెన్సులు.. మతాలకు అతీతంగా బీజేపీకి ఓట్లను తెచ్చిపెట్టాయి. మంచి మార్కులు సాధించిన విద్యార్థినులకు స్కూటర్లు, 60 ఏళ్లు పైబడిన మహిళలకు ప్రజారవాణాలో ఉచిత ప్రయాణం వంటి ఎన్నికల హామీలు బాగానే వర్కవుట్ అయ్యాయి. మతమార్పిడి నిరోధక చట్టానికి సవరణలు చేసి లవ్‌జిహాద్‌కు పాల్పడే వారికి పదేళ్ల జైలు శిక్ష వంటి హామీలు కలిసొచ్చాయి. మూడు వ్యవసాయ చట్టాలతో బీజేపీ నష్టపోకుండా.. యూపీ ఎన్నికల్లో ఆ ప్రభావం పడకుండా.. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, గోధుమ, వరికి కనీస మద్దతు ధర వంటివి ప్రకటించింది. హిందుత్వ ఎజెండా ఈ సారి కూడా బీజేపీకి బాగా కలిసొచ్చింది. ఎన్నికలకు ముందు కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రారంభం.. యోగి హయాంలో అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ వంటి అంశాలు హిందూ ఓటర్లును మరింత ఆకర్షించాయి. ఎన్నికల ప్రచార సమయంలో హిజాబ్ వివాదం చెలరేగడం.. హిందుత్వ ఓట్లు ఏకం కావడానికి మరో కారణం అంటున్నారు. ఇలా, యూపీలో బీజేపీ గెలుపునకు సవాలక్ష కారణాలు. మోదీ-యోగి-బీజేపీ మేజిక్ బాగా పని చేసింది. ప్రతిపక్షాలు బాగా బలహీనంగా ఉండటం.. బీజేపీకి మరింత మెజార్టీ తెచ్చిపెట్టింది. యోగిని తిరుగులేని శక్తిగా నిలిపింది. అందుకే.. ఇప్పుడు యోగి.. జస్ట్ యోగి మాత్రమే కాదు.. మోదీ 2.O అంటున్నారు.
http://www.teluguone.com/news/content/factors-behind-yogi-winning-in-up-39-132848.html





