కాంగ్రెస్ మహా ఓటమి దేనికి సంకేతం? రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటి?

Publish Date:Mar 10, 2022

Advertisement

అసెంబ్లీ ఎన్నికలలు జరిగిన ఐదు రాష్ట్రాలలో ఇంతవరకు నాలుగు రాష్ట్రాలు, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో వుంది. ఆ నాలుగు రాష్ట్రాలలో బీజేపీ మళ్ళీ మరోమారు విజయం దిశగా దూసుకుపోతోంది. ఉత్తర ప్రదేశ్’ లో ఇంచుమించుగా 37 సంవత్సరాల తర్వాత, ఒకే పార్టీ వరసగా రెండవ సారి అదికరంలోకి రావడం ఇదే మొదటి సారి. అదే విధంగా ఉత్తరాఖండ్’లో 1990లలో రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి, కాంగ్రెస్,బీజేపీలు వంతులవారీగా, ఒకరి తర్వాత ఒకరు అధికారంలోకి వస్తున్నారు. ఆ లెక్కన ఈ సారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలసి వుంది, కానీ, లెక్క తప్పింది. ఇక గోవా, మణిపూర్’లలోనూ బీజేపీ రెండవ సారి అధికారాన్ని హస్తగతం చేసుకోవడం ఇంచు మించుగా ఖాయంగా కనిపిస్తోంది. 

మరో వంక ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో  కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం పంజాబ్’లోనూ హస్తంపార్టీ, అధికారం కోల్పోయింది. అంతర్గత కుమ్ములాటలతో ఎన్నికలకు మూడు నాలుగు నెలల ముందు ముఖ్యమంత్రిని మార్చినా, కాంగ్రెస్ పార్టీ ఓటమి నుంచి తప్పించుకోలేక పోయింది. చివరకు రెండు స్థానాల నుంచి పోటీ చేసిన ముఖ్యమంత్రి చన్నీ, ఒకే స్థానంనుంచి పోటీచేసిన పీసీసీ చీఫ్, నవజ్యోతి సింగ్ సిద్దు కూడా ఓటమి దిశగా సాగుతున్నారు.పంజాబ్’ను చీపురు పార్టీ ( ఆప్) శుభ్రంగా తుడిచేసింది.మొత్తం 117 సీట్లకు గానూ, ఇంచుమించుగా 90 స్థానాల్లో ఆప్’ చీపురు తిరగేసింది. బీజేపీతో జట్టు కట్టిన మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్,12 సార్లు ఎమ్మెల్యేగా, ఐదు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన, శిరోమణి అకాలీ దళ్ అధ్యక్షుడు, ప్రకాష్ సింగ్ బాదల్, ఆయన కుమారుడు మాజీ మంత్రి సుఖీందర్ సింగ్ బాదల్  వీరూ వారని కాదు, మహా మహులు, హెమాహెమీలు అనుకున్న పంజాబ్ దిగ్గజ నేతలు అందరూ ఆప్ ప్రభంజనంలో కొట్టుకు పోయారు. ఇంతవరకు పంజాబ్ వేలుపా ఎవరికీ అంతగా తెలియని, భవత్ సింగ్ మాన్, పంజాబ్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపడుతున్నారు,

అయితే పంజాబ్’లో ఇతర పార్టీలు ఓటమికీ, కాంగ్రెస్ పార్టీ ఓటమికి మధ్య చాలా వ్యత్యాసం వుందని, పరిసీలాకులు అంటున్నారు.  ఒక విధంగా, కాంగ్రెస్ పార్టీ అధిష్టానవర్గం శ్రిన సమయంలో సరైన నిర్ణయం తీసుకోక పోవడం వలన పార్టీ భారీ మూల్యం చెల్లించవలసి వచ్చిందని  కాంగ్రెస్ నాయకులే, ప్రతి అధిష్టానంఫై, ముఖ్యంగా రాహుల్ గాంధీ, ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. నిజానికి, 2019 ఓటమి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎక్కడా చెప్పుకోదగ్గ విజయం సాధించలేదు. 2021 లో జరిగిన బెంగాల్, కేరళ, అస్సాం, తమిళ నాడు, పుదుచ్చేరి ఎన్నికల్లో ఒక్క తమిళనాడులో మిత్ర పక్షం డిఎంకే పుణ్యాన పది సీట్లు గెలుచుకుంది. కేరళ, అస్సాం లలో ఆనవాయితీకి భిన్నంగా వరసగా రెండవసారి ఒడి పోయింది. బెంగాల్’ లో సీపీఎం తో కలిసి పోటీ చేసినా ఖాతా తెరవలేదు. సో ... ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటి? అనేది ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న.

By
en-us Political News

  
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.