కాషాయం పార్టీలో ఈటలకు ఉక్కపోత.. ఇమడ లేక బయటకు వచ్చే యోచన.. కొత్త పార్టీ పెడతారంటూ ప్రచారం!

Publish Date:May 16, 2022

Advertisement

ఈటల రాజేందర్ బీజేపీలో ఇమడ లేకపోతున్నారా? అసలు ఆయన టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి కమలం గూటికి చేరినప్పుడే ఆయన గురించి తెలిసిన వారంతా ఆశ్చర్యపోయారు. వామపక్ష భావజాలం ఉన్న ఈటల బీజేపీలో ఎలా ఇడమగలుగుతారన్న అనుమానాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈటల బీజేపీకి రాజీనామా చేసి బయటకు వచ్చేస్తారన్న వార్తలు ఎవరినీ ఆశ్చర్యానికి గురి చేయడం లేదు. ఇప్పుడో ఎప్పుడో ఆయన బయటకు రావడం ఖాయమన్న భావన ఆయన బీజేపీలో చేరినప్పటి నుంచీ పరిశీలకులు వ్యక్తం చేస్తూనే వచ్చారు. అయితే ఇప్పుడు ఆయన బయటకు వచ్చి కొత్త పార్టీ పెడతారన్న ప్రచారం విస్తృతంగా సాగుతోంది.

దీనిపై తెలుగు వన్ ఈటల సన్నిహితులను సంప్రదిస్తే వారు  ఇదంతా తప్పుడు ప్రచారం అంటూ కొట్టి పారేశారు. బీజేపీలో ఈటలకు సముచిత గౌరవం లభిస్తున్నదనీ, బీజేపీ హై కమాండ్ కూడా ఈటలకు గౌరవం ఇచ్చి రాష్ట్రంలో చేపట్టే అన్ని కార్యక్రమాలలో ఆయనను భాగస్వామిని చేయడమే కాకుండా సలహాలూ, సూచనలూ స్వీకరిస్తోందనీ చెబుతున్నారు. ఇటీవల తుక్కుగూడలో జరిగిన అమిత్ షా బహిరంగ సభలో ఈటల వేదికపై ఉన్నారనీ వారు చెప్పారు. ఈటలకు బీజేపీ నుంచి బయటకు వెళ్లాల్సిన అవసరం లేదని వారు స్పష్ఠం చేశారు. అయతే ఈటల గురించి తెలిసిన వారు, ఆయన సైద్ధాంతిక నేపథ్యం గురించి తెలిసిన వారు మాత్రం ఆయన కమలం పార్టీని వీడి కొత్త పార్టీ పెట్టేందుకు యోచిస్తున్నారన్న వార్తలనే విశ్వసిస్తున్నారు.

  టీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ అధినేత కేసీఆర్ తో నే విభేదించి, బహిష్కృతుడై బయటకు వచ్చిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరి హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజయం సాధించారు. ఆ విజయంలో బీజేపీ పాత్ర దాదాపుగా శూన్యం అనే పరిశీలకులు చెబుతుంటారు. ఆ విజయం పూర్తిగా ఈటల ఖాతాలోనే పడింది. ఈటల చేరిక వల్లే బీజేపీకి తెలంగాణ అసెంబ్లీలో మరోక స్థానం వచ్చి చేరిందన్నది పరిశీలకుల అభిప్రాయం. అయితే హుజూరాబాద్ గెలుపు బీజేపీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అలాంటి ఉత్సాహాన్నినింపిన ఈటల  బీజేపీలో కీలక నేతగా ఎదుగుతారన్న భయంతో పార్టీలో ఆయన ఎదుగుదలను రాష్ట్ర బీజేపీ నాయకత్వం అడ్డుకుందన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈటల కమలం పార్టీలో ఇమడ లేకపోతున్నారని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది.   వ్యూహాత్మకంగా కమలం పార్టీలో ఈటలను ఏకాకిని చేశారన్న ప్రచారం కూడా ఉంది. గుర్తింపు లేని చోట ఈటల మౌనంగా సర్దుపోవడం ఆయన స్వభావానికే విరుద్ధమని ఆయనను సన్నిహితంగా తెలిసిన వారు చెబుతుంటారు.

అందుకే ఈటల కాషాయ పార్టీకి గుడ్ బై చెప్పి కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నారన్న ప్రచారాన్ను రాష్ట్రంలో అత్యధికులు నమ్ముతున్నారు.    అయితే తెలంగాణలో ఇప్పటికే మూడు పార్టీలు బలంగా వచ్చే ఎన్నికలలో విజయం కోసం కృషి చేస్తుండగా రాష్ట్రంలో మరో కొత్త పార్టీకి స్థానం ఉందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బీజేపీలోనే కొనసాగుతూ.. తనకు సముచిత గుర్తింపు కోసం పోరాడే అవకాశాలూ లేకపోలేదని కూడా అంటున్నారు.

ఇందు కోసం త్వరలోనే ఆయన మరోసారి హస్తిన వెళ్లి బీజేపీ హైకమాండ్ తో చర్చలు జరిపే ఉద్దేశంలో ఉన్నారని కూడా అంటున్నారు.   ఏది ఏమైనా కమలం పార్టీలో ఈటలకు అంత సౌకర్యంగా లేదన్నది మాత్రం వాస్తవమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు ముందు ఆయన హస్తిన వెళ్లి అమిత్ షాతో భేటీ కావడాన్ని వారు ఇందుకు తార్కానంగా చూపుతున్నారు. ఎటువంటి అసంతృప్తీ లేకపోతే..   అమిత్ షా రాష్ట్ర పర్యటనకు ముందు  ఈటల ప్రత్యేకంగా హస్తిన వెళ్లి ఆయనతో భేటీ కావలసిన అవసరం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. 

By
en-us Political News

  
జగన్‌లో మార్పు వుంటుందా, వుండదా అన్న అయోమయంలో వైసీపీ నేతలు.. ఆయనలో మార్పు వుండదన్న నిశ్చయానికి వచ్చేస్తున్నారు.
రాజకీయాల్లో విజయం అనేది కేవలం నాయకుల ఉపన్యాసాల వల్ల మాత్రమే సాధ్యం కాదు. అధికారం, రాజకీయ వేధింపులు, ఆంక్షలు ఎన్ని ఎదురైనా వెరవక
అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పరిధిలో దాదాపు రూ. 7.5 కోట్ల విరాళాల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలపై పార్లమెంట్‌ ద్వారం వద్ద స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ కాషాయ వస్త్రాలు ధరించి, పూజారి వేషంలో ఒక పెద్ద హుండీతో కూర్చుని సేకరించిన విరాళాలను జేబులో వేసుకుంటూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు.
నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే విశాఖను గ్లోబల్ ఐటీ, ఇండస్ట్రియల్ హబ్‌గా మార్చాలనే ఆలోచనతో ఈ భోగాపురం ప్రాజెక్టుకు చంద్రబాబు బీజం వేశారనీ, అయితే.. కాలక్రమంలో ప్రభుత్వాలు మారాయి, ప్రాజెక్టు ప్రతిపాదనలు మడతపడ్డాయన్నారు.
సిదిరి అప్పలరాజు కుమారుడు బైక్ నిర్లక్ష్యంగా నడిపి ఒకరి మృతికి కారణమయ్యారన్న కేసు దర్యాప్తులో వెలుగు చూసిన అంశాల మేరకు ఇందులో ఎలాంటి రాజకీయ కుట్రలు లేవు. సీదిరి అప్పలరాజు చేసిన అతే.. ఆయనను చట్టపరంగా ఇబ్బందుల్లోకి నెట్టింది.
ఎప్పుడో ఓ సారి జైల్లో ఉన్న నేతకు పరామర్శ పేరుతో బయటకు వచ్చే సందర్భాలలో కూడా సదరు నేతను పరామర్శించడం కంటే.. బల ప్రదర్శనకు, తనకు జనం మద్దతు ఉందని నిరూపించుకునే ప్రదర్శనలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయన అలా బయటకు వచ్చిన ప్రతి సారీ అభాసుపాలౌతూనే ఉన్నారు.
ఢిల్లీ వీధుల్లో రగిలిన ఆగ్రహ జ్వాలలు, పోలీసుల లాఠీఛార్జీలు, కన్నీటి ధారలు, నిర్బంధాలను సైతం లెక్కచేయక హక్కుల కోసం వీధిపోరాటానికి దిగిన యువత ఆక్రందనలు
రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ అమూల్యమైన భూములను ఇవ్వద్దు, భోగాపురం విమానాశ్రయాన్ని అందరం కలిసి అడ్డుకుందాం" అంటూ జగన్ ఇచ్చిన పిలుపుల ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతూ భోగాపురం విషయంలో జగన్ ద్వంద్వ వైఖరిని ఎండగడుతున్నాయి.
తెలుగుదేశం కూమిటికి ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. చంద్రబాబు నాయకత్వంలో కూటమి సర్కార్ సంక్షేమ, అభివృద్ధిని సమాంతరంగా పరుగులు పెట్టిస్తున్నప్పటికీ ఆ స్థాయిలో ప్రజాదరణ పెరగడం అటుంచి.. క్షేత్రస్థాయిలో కూటమి పాలన పట్ల ఒకింత అసంతృప్తి పె రిగిందని సర్వే స్పష్టం చేయడమే.
మొత్తంగా విద్యార్థులు, యువతఉద్యమం.. ఒక స్పష్టమైన సందేశాన్ని అయితేనిస్సందేహంగా ఇచ్చింది. అన్యాయాన్ని ప్రశ్నించడంలో, హక్కుల కోసం పోరాడటంలో , న్యాయం కోసం నినదించడంలో వెనకడుగు వేసే ప్రశ్నేలేదని చాటింది.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కర్నూలు జిల్లా ఆదోని పట్టణ, మండల టీడీపీ నేతలు పని చేయాలని
నీట్ పేపర్ లీక్ ఆందోళనలతో దిల్లీ వీధులను ఊపేసిన బొద్దింకలు ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద రైతు నాయకుడు రాకేష్ తికాయత్‌ను కలిసి సంఘీభావం ప్రకటించాయి.
మాజీ మంత్రి జోగి రమేష్ తనపై చేస్తున్న ఆరోపణలనుఖండించిన వసంత వెంకట కృష్ణ ప్రసాద్.. జోగి రమేష్ కు ఎటువంటి క్రెడిబులిటీ లేదనీ, అతను ఏదోదో మాట్లాడతారనీ, అవన్నీ పట్టించుకోవలసిన అవసరం లేదని చెప్పారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.