ఇంట్లో దుమ్ముతో... లావైపోతారు!

Publish Date:Jul 14, 2017

Advertisement

 

రోజంతా నానాకష్టాల పడే మధ్యతరగతి జీవులు ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్లి సేదతీరుదామా అనుకుంటారు. ఇంట్లోకి అడుగుపెట్టి సోఫాలో కూలబడి వేడివేడి టీ తాగుతూ.... ఇల్లే కదా స్వర్గసీమ! అని మురిసిపోతారు. కానీ అజాగ్రత్తగా ఉంటే ఆ ఇల్లే నరకంగా మారిపోతుందని హెచ్చరస్తున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటారా...

 

ఇల్లన్నాక రకరకాల వస్తువులు, వాటి నుంచి పేరుకునే దుమ్ము సహజమే. కానీ ఈమధ్యకాలంలో మనం వాడే వస్తువులన్నీ ప్రమాదకరమైన రసాయనాలతో తయారవుతున్నవే కదా! దోమల్ని చంపే మందులు, మంటలు వ్యాపించకుండా వాడే పైపూత, నాన్స్టిక్ వంటపాత్రలు... ఒకటేమిటి షాంపూ దగ్గర నుంచి ప్లాస్టిక్ దాకా అన్నీ రసాయనాలే! ఈ రసాయనాలలో Endocrine-disrupting chemicals (EDC) అనే పదార్థాలు ఉంటాయంటున్నారు శాస్త్రవేత్తలు.

 

ఈ EDCలు మనలోని హార్మోనులని దెబ్బతీస్తాయి. ఫలితంగా కేన్సర్, ఎదుగుదలలో లోపాలు, నరాల బలహీనత, అబార్షన్ వంటి సమసస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అందుకనే చాలా సంస్థలు తమ ఉత్పత్తులలో ఈ తరహా రసాయనాలు లేకుండా జాగ్రత్తపడుతున్నాయి. అయితే ఈ EDCలతో మన శరీరంలోని ట్రైగ్లిజరైడ్స్ అనే కొవ్వు కణాలు పెరిగిపోతాయేమో అన్న అనుమానం పరిశోధకులకి మొదలైంది.

 

EDCలకీ కొవ్వు కణాలకీ మధ్య సంబంధాన్ని తేల్చపారేసేందుకు కొన్ని ఇళ్లలో దుమ్ముని సేకరించారు. ఇలా సేకరించిన శాంపిల్స్లో రసాయనాలు ఏ తీరున ఉన్నాయి, అవి కొవ్వు కణాల మీద ఎంత ప్రభావం చూపుతున్నాయి అని అంచనా వేసే ప్రయత్నం చేశారు. ఆశ్చర్యంగా దాదాపు 90 శాతం ఇళ్లలో కనిపించిన ధూళికణాలు, మన శరీరంలోని కొవ్వుని ప్రభావితం చేస్తున్నాయని తేలింది. కొవ్వు కణాలు త్వరగా వృద్ధి చెందడానికీ, ప్రమాదకరమైన ట్రైగ్లిజరైడ్స్ పెరగడానికీ ఇవి కారణం అవుతున్నాయట!

 

ఇంట్లో అనవసరమైన సామాను పోగుచేయకూడదనీ, ఒకవేళ తీసుకున్నా వాటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలనీ ఈ పరిశోధనతో తేలిపోయింది. సామాను కొనేటప్పుడు కూడా చవకగా దొరుకుతోందనో, సులువుగా పని జరిగిపోతోందనో కాకుండా... నాణ్యత ఉన్న వస్తువునే తీసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి వస్తువుల నుంచి వచ్చే EDC మన ఊపిరితిత్తులు, జీర్ణవ్యవస్థలలోకి చాలా తేలికగా ప్రవేశిస్తాయట. ఇక ఆ తర్వాత జరిగే కథ ఇప్పటికే తెలిసిపోయింది కదా!

- నిర్జర.

By
en-us Political News

  
ఈ రోజుల్లో ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు చదువులో బాగా రాణించాలని, ఆత్మవిశ్వాసంతో ఉండాలని, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలలు కంటారు. తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంత ఖర్చు పెడితే....
మానవ శరీరానికి సంక్రమించే జబ్బులలో చాలా రకాలు ఉంటాయి. వాటిలో హీమోఫిలియా జబ్బు కూడా ఒకటి. చాలా మందికి హీమోఫిలియా అనే జబ్బు..
పెళ్లి అనేది ప్రతి అమ్మాయి జీవితాన్ని మరొక దశలోకి తీసుకుని వెళుతుంది. ఎన్నో ఆశలతో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని కొత్త ఇంట్లో అడుగుపెడతారు అమ్మాయిలు. కానీ చాలామంది అమ్మాయిలు చెప్పే మాట.. అత్తగారు సరిగా చూసుకోవడం లేదని, అత్తగారు సరిగా మాట్లాడటం లేదని. ప్రతి ఇంట్లో అత్తాకోడళ్ల సంబంధం ఎప్పుడూ...
జీవితంలో ప్రతి ఒక్కరూ విజయం కోసం తహతహలాడుతూ ఉంటారు.  అందుకోసం చాలా ప్రయత్నాలు కూడా చేస్తుంటారు...
ప్రతి వ్యక్తికి విభిన్నమైన వ్యక్తిత్వం ఉంటుంది; కొందరు చాలా కలివిడిగా ఉంటారు, మరికొందరు నిశ్శబ్దంగా, అంతర్ముఖంగా ఉంటారు. ఈ వ్యత్యాసం ఆధారంగా ఇంట్రోవర్ట్,  ఎక్స్ట్రోవర్ట్ అంటూ రెండు విభాగాలుగా విభజిస్తూ ఉంటారు...
భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త , గొప్ప ఆర్థికవేత్త అయిన డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి జయంతి...
ఆశా భోస్లే.. భారతీయ సంగీత ప్రపంచంలో ఒక చెరగని ముద్ర.  ఆమె గాత్రం కేవలం భారతదేశాన్నే కాకుండా ప్రపంచం మొత్తాన్ని ఉర్రూతలూగించింది. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కు సోదరి అయినా.. పాటల ప్రపంచంలో..
సంతోషం సగం బలం అన్నారు పెద్దలు. నేటి బిజీ బిజీ జీవితాలలో మనస్ఫూర్తిగా,  సంతోషంగా గడిపిన క్షణాలు వెతుక్కోవాల్సి వస్తోంది. అందరూ ఉద్యోగాలు చేస్తారు,  వ్యాపారాలు చేస్తారు, సంపాదిస్తారు,  నచ్చిన వస్తువులు కొనుక్కుంటారు....
ప్రపంచంలో అన్ని రకాల మనుషులు  ఉంటారు.  మనుషులకు ఒక్కొక్కరికి ఒక్కో వ్యక్తిత్వం కూడా ఉంటుంది. ప్రపంచంలోని గొప్ప వ్యక్తులను లేదా మన చుట్టూ ఉండే గొప్ప వ్యక్తులు లేదా శక్తివంతమైన వ్యక్తులను గమనిస్తే...
విజయం ప్రతి వ్యక్తి జీవితంలో ఒక లక్ష్యంగా ఉంటుంది.  చదువు, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా ప్రతి విషయంలో ఒక లక్ష్యం పెట్టుకుని,  దాన్ని సాధించి,  విజయ బావుటా ఎగరవేయాలని అనుకుంటారు చాలా మంది...
మంచి, చెడు ప్రతి మనిషిలోనూ తప్పకుండా ఉండే గుణాలు.  మనుషులు కొన్ని విషయాల్లో మంచిగా, మరికొన్ని విషయాల్లో చెడ్డగా ఉంటారు. పూర్తీగా మంచితనం ఉన్న మనుషులు, పూర్తీగా చెడ్డగా ఉన్న మనుషులు ఎక్కడా ఉండరు...
అపరాజిత లేదా శంఖు పుష్పాలు నీలం ,  తెలుపు రంగులో ఉంటాయి.  ఈ పువ్వులు  చాలా అందంగా ఉంటాయి. శంఖు పుష్పం మొక్కను దేవతా మొక్కగా పరిగణిస్తుంటారు.  ఈ పువ్వులు  సంతోషం, శ్రేయస్సు,  సానుకూల శక్తికి చిహ్నంగా భావిస్తారు. వేసవిలో...
వేసవి వచ్చేసింది, తీవ్రమైన ఎండ , మండే ఎండలు చాలా ఇబ్బంది కలిగిస్తాయి.  ఈ ఎండల ఇబ్బందికి తోడు వేసవిలో కరెంట్ కోత కూడా దారుణంగా ఉంటుంది. దీనివల్ల ఇంట్లో ఉండటం చాలా కష్టమవుతుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.