మలిదశ ఉద్యమానికి ప్రభుత్వ ఉద్యోగులు సై?

Publish Date:Feb 1, 2022

Advertisement

పీఆర్సీ సాధన ఉద్యమం నేపథ్యంలో ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు సర్కార్ తో ఢీ అంటే ఢీ అంటున్నాయి. పీఆర్సీ ఉద్యమాన్ని వారు మలి దశకు తీసుకెళ్తున్నారు. తొలి దశ ఉద్యమంలో భాగంగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ర్యాలీలు, నిరసనలు, ధర్నాలు, రిలే నిరాహార దీక్షలు చేశారు. అవన్నీ జనవరి 30తో ముగిశాయి. ఇక మలి దశ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసే క్రమంలో సమ్మెకు సిద్ధమవుతుతున్నారు. ఫిబ్రవరి 3వ తేదీన ఛలో విజయవాడ కార్యక్రమాన్ని వేలాది మందితో నిర్వహించేందుకు ఏర్పాట్లు రెడీ చేస్తున్నారు. ఛలో విజయవాడ ఏర్పాట్లపై పీఆర్సీ సాధన సమితి నేతలు విజయవాడలోని ఏపీఎన్జీఓ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఉద్యోగుల సమీకరణ, ఫిబ్రవరి 7 నుంచి నిర్వహించే నిరవధిక సమ్మెపై చర్చించారు. సమస్యల పరిష్కారం గురించి ఆలోచించకుండా ఉద్యోగులపై జగన్ రెడ్డి సర్కార్, మంత్రుల కమిటి అసత్య ప్రచారానికి దిగి ఆభాసు పాలు చేస్తున్నాయని దుయ్యబట్టారు.
మరో పక్కన.. పీఆర్సీ సాధన సమితి పిలుపుతో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి తాము కూడా సమ్మలోకి వెళ్లాలని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు కూడా నిర్ణయంతీసుకోవడం గమనార్హం. ఈ నెల 3న నిర్వహించే ఛలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొనాలని వారు నిర్ణయించారు. అంతకు ముందు నుంచే ట్రెజరీ సిబ్బంది ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేస్తున్నారు. ఆర్టీసీ సంఘాలు కూడా ఉద్యమంలో భాగస్వాములయ్యేందుకు ముందుకు వస్తుండడం గమనార్హం.
ఒక పక్కన ఏపీలోని ఒక్కో ఉద్యోగ సంఘమూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పుతూ, ఉద్యమ బాట పడుతున్నా.. జగన్ సర్కార్ మాత్రం పీఆర్సీ విషయం ‘తగ్గేదేలే’ అన్నట్లు వ్యవహరిస్తుండడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. ప్రభుత్వం అంటే పెద్దన్న పాత్ర వహించాలని, సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేయకుండా ఉద్యోగులను మరింత రెచ్చగొట్టేలా వ్యవహరిస్తుండడం ఏంటనే వివమర్శలు సర్వత్రా వస్తున్నాయి. కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు,పెన్షన్ల బిల్లులు ప్రాసెస్ చేయని అధికారులకు ఛార్జ్ మెమోలు జారీ చేస్తుండడం మరో సమస్యను నెత్తి మీదకు తెచ్చుకోవడం కాక మరేమిటనే ప్రశ్నలు వస్తున్నాయి. అలా ఏపీలోని  53 మంది డీడీ, ఎస్టీఓ, ఏటీఓలకు అప్పుడే మెమోలు జారీ చేయడం ద్వారా ఉద్యోగులను మరింతగా వేగంగా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతుండడం కలకలం రేపుతోంది. వారిలో 27 మందికి చార్జ్ మెమోలు, మిగతా వారికి మెమోలు జారీ చేశారు ఉన్నతాధికారులు. కొత్త జీతాల బిల్లులు రెడీ చేయడంలో అలక్ష్యం వహించినందుకు అంటూ మెమోలు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంటోంది.

ఇంకో పక్కన సీఎఫ్ఎస్ఎస్ సాయంతో కొత్త వేతన స్కేళ్ల ప్రకారం ఉద్యోగుల జీతాలు, పింఛన్ దారుల పెన్షన్ స్లిప్పులు సిద్ధం చేయడం ఉద్యోగులను మరింత రెచ్చగొట్టేలా ఉందంటున్నారు పరిశీలకులు. డీడీఓలు, ట్రెజరీ అధికారులు ఎస్ఆర్ లు పరిశీలించి చేయాల్సిన ప్రక్రియను సాంకేతిక సహకారంతో పూర్తిచేసింది జగన్ రెడ్డి సర్కార్. కొత్త పే స్కేల్ ప్రకారం ఎవరికి ఎంత జీతం వస్తుందో, ఎంత పెన్షన్ వస్తుందో ఖరారు చేసిపారేసింది. ఆ వివరాలు కావాలంటే payroll.herb.apcfss.in వెబ్ సైట్ లో, ఆండ్రాయిడ్, ఐఓఎస్ మొబైల్ యాప్ లో¬ చూసుకోవచ్చంటూ సోమవారం రాత్రి ఆర్థిక శాఖ అధికారులు ఓ ప్రకటన జారీ చేయడం ఇప్పుడు సమస్యను మరింత ఎగదోసేలా ఉందంటున్నారు.

క్రమేపీ ఉద్యోగ, ఉపాధ్యాయ ఇతర సంఘాల పీఆర్సీ ఉద్యమం ఉధృతం అవుతోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు తామంత తాముగా వస్తేనే గాని స్పందించేది లేదంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూనే.. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు చర్చలకు రావాలంటూ రాతపూర్వకంగా పీఆర్సీ సాధన సమితికి చెందిన 20 మంది నేతలకు ఆహ్వానాలు పంపడం విశేషం.

ఏదేమైనా వెన్నుపోటు కంటే దారుణమైన నమ్మక ద్రోహం సీఎం జగన్ రెడ్డి చేస్తున్నారంటూ ఉద్యోగ, ఉపాధ్యాయ, ఇతర సంఘాల నేతలు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు.
 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.