ఉభయ రాష్ట్రాల్లో పరుగులు తీస్తున్న ఎన్నికల వేడి

Publish Date:Apr 21, 2022

Advertisement

లోక్ సభ ఎన్నికలకు ఇంకా నిండా రెండేళ్ళ సమయముంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల కూడా లోక్ సభ ఎన్నికలతో పాటే జరుగుతాయి. సార్వత్రిక ఎన్నికలకు ఓ ఐదారు నెలల ముందు 2022 చివర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అయితే, ఉభయ తెలుగు రాష్ట్రలలో, ఇప్పటి నుంచే ఎన్నికల వేడి కాకరేపుతోంది. అలాగని ముందస్తు ఎన్నికలు ఏమైనా వస్తున్నాయా అంటే, అలాంటి అవకాశమే లేదని, అక్కడా, ఇక్కడా కూడా అధికార పార్టీ నాయకులు పదే పదేచెపుతూనే ఉన్నారు. 

తెలంగాణలో అయితే స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ముచ్చటే లేదని ఒకటికి పదిసార్లు చెప్పుకొచ్చారు. అదే విషయం తెరాస ఉపాధ్యక్షుడు, మంత్రి కేటీఅర్ నిన్నటి వరంగల్ సభలో పునరుద్ఘాటించారు. అయినా, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ నాయకులు మాత్రం ముందస్తు తథ్యం అంటున్నారు.ముఖ్యమంత్రి లేదన్నారంటే,ఉందని అర్థం చేసుకోవాలని ప్రతిపక్ష పార్టీల నాయకులు అంటున్నారు. అయితే, ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళ్ళినా అధికారం నిలబెట్టుకునే అవకాశమే లేనప్పుడు, ముందస్తుకు వెళ్లి ప్రయోజనం ఏమిటని తెరాసలో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ముందస్తు ఉన్న లేకున్నా ఎన్నికల వేదుని మాత్రం కొనసాగించాలని, అన్ని పార్టీలు, ‘ఏకాభి ప్రాయం’ కు వచ్చినట్లు కనిపిస్తోంది. అలాగే, ఏపీ ఆర్థిక పరిస్థితి, దినదిన ప్రవర్థమానంగా దిగజరిపోతున్న నేపధ్యంలో రాష్ట్రంలో “శ్రీలంక తరహా సంక్షోభం”తలెత్తక ముందే ముందస్తుకు వెళ్లి అదృష్టం పరీక్షించుకోవాలని జగన్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, “గోడ మీది రాత చాలా క్లియర్” గా వుంది.  ముందస్తుకు వెళ్ళే సాహసం జగన్ రెడ్డి  చేయరు” అని పార్టీ నాయకులే ప్రైవేటు టాక్’లో అంటున్నారు.అంటే, తెలంగాణలో తెరాసను ఏ విధంగా అయితే ఓటమి భయం వెంటాడుతోందో, అంతకు 10 రెట్ల భయం ఏపీలో వైసీపీని వెంటాడుతోంది. సో.. ఉభయ తెలుగు రాష్ట్రాలలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం లేదని పరిశీలకులు అంటున్నారు.

అయినా,  ఉభయ రాష్ట్రాలలో అటు అధికార పార్టీలలో, ఇటు ప్రతిపక్షంలోనూ ఎన్నికల వేడి బుసలు కొడుతోంది. రేపో మాపో ఎన్నికలు ఖయాం అన్నట్లుగా ఎన్నికల ఉష్ణోగ్రతలు వేడెక్కుతున్నాయి. 
ఆంధ్ర ప్రదేశ్’లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్యాలెస్ గడపదాటి  బయటకు వస్తున్నారు. ఇంచుమించుగా రెండేళ్లకు పైగా ప్యాలెస్’కే పరిమితమైన ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు. ఇంతవరకు, అద్దాల మేడలో కూర్చుని అంతా బాగుందనే భ్రమల్లో ఉన్న ముఖ్యమంత్రికి, మంత్రివర్గ విస్తరణ అనంతర పరిణామాలు వాస్తవ పరిస్థితి అర్థమయ్యేలా చేశాయని పార్టీ నాయకులు అంటున్నారు. అందుకే ప్రస్తుతం ముఖ్యమంత్రి దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టారని, ఇందులో భాగంగానే పార్టీ సంస్థాగత నిర్మాణం ఫై దృష్టి పెట్టారని అంటున్నారు. మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణతో పాటుగా పార్టీ జిల్లాల అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తల నియామకాల చేపట్టారు. బూత్‌ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ బలోపేతానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే,జరగవలసిన నష్టం జరిగి పోయిన తర్వాత ముఖ్యమంత్రి ఇప్పుడు కళ్ళు తెరవడం వలన ప్రయోజనం ఉండదని, ఒక విధంగ ముఖ్యమంత్రి చేపట్టిన దిద్దుబాటు చర్యలు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు ఉందని అంటున్నారు. అదలా వైసీపీ గడప గడపకు వైసీపీ కార్యక్రమం ప్రారంభించింది. ఇందలో భాగంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు, జిల్లా నాయకులను  ఆదేశించారు.

మరోవంక ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా,ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఆందోళనలు చేపడుతూనే, మరోవంక పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చన్నాయుడు, ఇతర సీనియర్ నేతలు జిల్లాలలో పర్యటించేందుకు ప్రణాకలు సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. మే నెల నుంచి చంద్రబాబు జిల్లాల ప‌ర్యట‌నలు ఉంటాయని సమాచారం. విధ్యుత్, బస్సు చార్జీల పెంపుదలకు నిరసనగా టీడీపీ శ్రేణులు నిర్వహిస్తున్న బాదుడే బాదుడు ఆందోళన కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొంటున్నారు. మే నెలలో నిర్వహించనున్న మహానాడు తర్వాత చంద్రబాబు జిల్లాల పర్యటన‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇక, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర చేపట్టేందుకు సిద్దమయ్యారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఏడాది పాటు ప్రజల్లో ఉండే విధంగా లోకేష్ యాత్రకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవంక టీడీపీ పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టింది. ఆలాగే జనసేన్ అధినేత పవన్ కళ్యాణ్ రైతుల ఆత్మహత్యలఫై ఫోకస్ పెట్టారు. ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను, పరామర్శించి, ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. 

మరో వంక రాష్ట్ర ప్రజానీకంలో చైతన్యంతోపాటు వైసీపీ దురాగతాలను ఎండగట్టడానికి త్వరలో  హైమాండ్‌ అనుమతితో రాష్ట్రంలో పాదయాత్ర నిర్వహిస్తామని పీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ సాకే శైలజానాథ్‌ వెల్లడించారు. రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలిగించి, ప్రజాధనాన్ని, ఆస్తులను దోచుకుంటున్న వారికి కంటికి మీద కునుకు లేకుండా చేస్తామని హెచ్చరించారు. సో ..ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల వేడి పెరిగిపోతోంది. మరో వంక ఎన్నికలు జరిగే వరకు ఇదే వేడి కొనసాగుతుందని, పరిశీలకులు అంటున్నారు.

By
en-us Political News

  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.