ఫిబ్రవరి నాటికి పీక్స్ కి ఎల్‌నినో ఎఫెక్ట్: ఇప్పటికే ఆందోళనకరంగా భూగర్భ జల మట్టాలు.!

Publish Date:Oct 15, 2026

Advertisement

ఎల్ నినో ఎఫెక్ట్ వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి పీక్స్ కు చేరునుంది. తెలంగాణలో ఎల్ నినో ప్రభావం తీవ్రాతి తీవ్రంగా ఉంది. ఇప్పటికే భూగర్భ జల మట్టాలు ఆందోళనకర స్థాయికి చేరాయి. రానున్న రోజులలో  నీటి సరఫరా, వ్యవసాయం పెను సవాళ్లు ఎదుర్కోనున్నాయి.  వాతావరణ మార్పులు, సాగు పరిస్థితిపై గురువారం జరిగిన సమీక్షలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సంజయ్ జాజు ఈ విషయాలను వెల్లడించారు.  

నైరుతి రుతుపవనాలపై ఎల్‌నినో   ప్రతికూల ప్రభావం చూపిందని, దీని ఫలితంగా రాష్ట్రంలో సాధారణం కంటే ఉష్ణోగ్రతలు సుమారు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగాయని వెల్లడించిన సీఎస్..  సింగూరు డ్యామ్ దాని పరిసర ప్రాంతాలలో నీటి లభ్యతను, పంటల పరిస్థితిని   క్షేత్రస్థాయిలో పరిశీలించాననీ,  భూగర్భ జలమట్టాలు అత్యంత ఆందోళనకరంగా పడిపోయాయని తెలిపారు. రైతాంగం కష్టాలకు ఉచిత విద్యుత్ మాత్రమే పరిష్కారం కాదని వివరించారు.  బావులు, బోరుబావుల్లో నీటి ఊటలు లేకపోవడంతో విద్యుత్ సరఫరా ఉన్నప్పటికీ నిష్ప్రయోజనమేనన్నారు. ఉణ్న నీటి నిల్వలను కాపాడుకుంూ,  తాగునీటి అవసరాలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అన్ని శాఖలను ఆదేశించారు.

రాబోయే పక్షం రోజులూ   పంటలకు అత్యంత కీలకమన్న ఆయన..  రైతాంగానికి తగిన మార్గదర్శకత్వం అందించాలని వ్యవసాయ శాఖ అధికారులనుఆదేశించారు.  ప్రస్తుతం రిజర్వాయర్లలో అందుబాటులో ఉన్న నీటి నిల్వలను సమర్థవంతంగా మేనేజ్ చేయాలనీ,  జలవనరులు, వ్యవసాయం, విద్యుత్ శాఖలు  సమన్వయంతో పనిచేయాలన్నారు.    


[El Nino Impact Telangana, Sanjay Jaju Chief Secretary, Telangana Drinking Water Crisis, Singur Dam,  Water Review, Ground Water Levels, Telugu One]

By
en-us Political News

  
ఎమ్మెల్సీ బల్మూర్‌ వెంకట్ ఆరోపణల వెనుక నిజమెంత.?
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి స్టేడియంలో నిర్వహించిన సింగరేణి కార్మిక గర్జన కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు
ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు క్షణం తీరిక లేకుండా వారిపై కన్ను వేసి ఉంచడం ఎంత ముఖ్యమో చెప్పడానికి నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో చోటు చేసుకున్న ఒక హృదయవిదారక ఘటనే నిదర్శనం.
 హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ మార్గంలో రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఎల్బీనగర్‌ హయత్‌నగర్‌ డబుల్‌ డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 
సింగరేణి కార్మికులు, వారి కుటుంబాల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
హైదరాబాద్ నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన కౌకూర్ ఆర్చిడ్ విల్లాలో ఐదేళ్ల చిన్నారి ఆరిలియా హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి
హైదరాబాద్ నగరంలో క్రిప్టోకరెన్సీ లావాదేవీల నేపథ్యంలో తీవ్ర కలకలం రేపిన భారీ దోపిడీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఐదున్నర ఎకరాల స్థలం తమదేనంటూ ఓ వ్యక్తి, అతని కుమారుడు వచ్చి.. సి. రామచంద్రయ్య నుంచి అడ్వాన్స్ గా పాతిక లక్షలు తీసుకున్నారు. ఆ తరువాత పత్రాలు చూపించకుండా తప్పించుకున్నారు. సి.రామచంద్రయ్య ఫిర్యాదు మేరకు  ఆధారంగా జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దేశానికి నిజంగా స్వరాజ్యం సిద్ధించిందా? అంటే అనుమానమే అనే సమాధానం వచ్చేలా ఉంది. కొన్ని చోట్ల ఇంకా కొనసాగుతున్న పెత్తందారీ వ్యవస్థ కారణంగా.  పేరుకే ప్రజాస్వామ్యం కానీ   చోట్ల అభివృద్ధి, సామాజిక ఐక్యత పేరుతో  కొన్ని ప్రాంతాలలో అనధికార కమిటీలు ప్రజలపై ఆంక్షలు విధిస్తున్నాయి. 
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే రాష్ట్ర పండుగ బతుకమ్మ వేడుకలు శనివారం నుంచి అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.
తండ్రి అంటే పిల్లలకు ఒక భరోసా, కుటుంబానికి ఒక పెద్ద దిక్కు. బయట ఎంతటి బిజీ రాజకీయ జీవితం గడిపినా, ఇంట్లో తమ వారి కోసం వారు చూపించే ప్రత్యేక శ్రద్ధ ఎంతో మధురమైనది.
ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో  ఇక వర్షాలు అంతంత మాత్రమేనని వాతావరణ పరిశోధకులు చెబుతున్నారు. డిసెంబర్, జనవరిలలో శీతాకాలంలో చలి కూడా అంతంత మాత్రంగానే ఉంటుందనీ, డిసెంబర్ నుంచే రోహిణిని తలపించే ఎండలు మండిపోతాయని అంచనా వేస్తున్నారు.
కన్నబిడ్డకు అనారోగ్యం వస్తే ఏ తల్లైనా తల్లడిల్లిపోతుంది. బిడ్డకు నయం చేయించేందుకు తన దగ్గర ఉన్నదంతా ఖర్చు చేయడానికైనా వెనుకాడదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.