భాగ్యనగరం గొంతెండుతోంది: అడుగంటిన భూగర్భ జలాలు.. సమస్య పరిష్కారానికి ప్రణాళికలేవీ.!
Publish Date:Oct 15, 2026
Advertisement
హైటెక్ సిటీ.. అంతర్జాతీయ ఐటీ సంస్థలు.. ఆకాశాన్ని తాకే అపార్ట్మెంట్లు.. నిత్యం విస్తరిస్తున్న కొత్త కాలనీలు! ఇదీ అభివృద్ధిలో దూసుకుపోతున్న హైదరాబాద్ దృశ్యం. అయితే విశ్వనగరంగా మనం చెప్పుకునే హైదరాబాద్ భీకరమైన నీటి కొరతతో ఇబ్బందులు పడుతోంది. తాగునీటి కొరతతో భాగ్యనగరం గొంతెండుతోంది. తాగునీటి కోసం హైదరాబాదీయులు చాలా వరకూ ట్యాంకర్లపైనే ఆధాకపడాల్సిన పరిస్థితి. ఒకవైపు భాగ్యనగరం జనాభా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుంటే.. మరోవైపు భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. నగరానికి అందుతున్న నీటికి, ప్రజల అవసరాలకు మధ్య అగాధం, అంతరం అంతకంతకూ పెరిగిపోతోంది. హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోనూ జనాభా వేగంగా పెరుగుతోంది. ఉపాధి కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు, కొత్తగా ఏర్పడుతున్న నివాస సముదాయాలు, వాణిజ్య సంస్థలు, ఆసుపత్రులు.. అన్నీ నీటి అవసరాన్ని పెంచుతున్నాయి. అందుబాటులో ఉన్న నివేదిక ప్రకారం, నగరం, శివారు ప్రాంతాలకు కలిపి రోజుకు సుమారు 735 మిలియన్ గ్యాలన్ల నీరు అవసరం కాగా, ప్రస్తుతం ఉన్న సరఫరా 585 మిలియన్ గ్యాలన్లు మాత్రమే. అంటే రోజుకు రమారమి 150 మిలియన్ గ్యాలన్ల కొరత ఉంది. అయితే ఇక్కడ చెప్పుకోవలసిన విషయం ఏంటంటే.. ఈ నీటి కొరత అన్నది నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఒకేలా లేదు. కాలనీలకు నల్లా నీరు అందుతున్నా, మరికొన్ని ప్రాంతాల్లో సరఫరా అంతంతమాత్రమే. ముఖ్యంగా వేగంగా విస్తరిస్తున్న శివారు ప్రాంతాల్లో జనాభా పెరుగుదలకు అనుగుణంగా సరఫరా వ్యవస్థను విస్తరించలేదు. నీటి కొరతకు మరో ప్రధాన కారణం భూగర్భ జలాలపై అధికంగా ఆధారపడటం. నల్లా నీరు సరిపోని కుటుంబాలు బోర్లను ఆశ్రయిస్తున్నాయి. అయితే నీటి వినియోగం విపరీతంగా పెరగడంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ఫలితం బోర్లు ఎండిపోతున్నాయి. దీంతో జనాలకు ప్రైవేటు ట్యాంకర్లపై ఆధారపడాల్సిన అనివార్య పరిస్థితి ఎదురౌతోంది. 2ఈ ఏడాది మే చివరి వారంలో హైదరాబాద్‌లో రోజువారీ ట్యాంకర్ బుకింగ్‌లు 15 వేలు దాటాయి. అక్టోబర్‌లోనూ రోజుకు సుమారు 6 వేల 500 ట్యాంకర్లు బుకింగ్‌లు నమోదవుతున్నాయి. సాధారణంగా వేసవిలో పెరిగే డిమాండ్ వర్షాకాలం ముగిసిన తర్వాత కూడా కొనసాగడం భాగ్యనగరంలో నీటి ఎద్దడికి అద్దం పడుతోంది. ట్యాంకర్ నీటిపై ఆధారపడటం కేవలం సరఫరా సమస్య మాత్రమే కాదు.. సామాన్య, పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఆర్థికంగా భారంగానూ పరిణమిస్తోంది. గేటెడ్ కమ్యూనిటీల్లో ట్యాంకర్ల కోసం చేసే ఖర్చు మెయింటెయినెన్స్ చార్జీలను గణనీయంగా పెంచుతోంది. నీటి సమస్యను ప్రతి వేసవిలో తాత్కాలికంగా పరిష్కరించడం ప్రభుత్వాలకు పరిపాటిగా మారింది. దీని వల్ల ఏ ఏటి కా యేడు సమస్య పెరిగిపోతున్నది. తాత్కాలిక పరిష్కారాలతో సరిపెట్టకుండా, శాశ్వత పరిష్కారంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొత్త నీటి వనరుల అభివృద్ధి, సరఫరా పైపులైన్ల విస్తరణ, లీకేజీల నియంత్రణ, వర్షపు నీటి సంరక్షణ, చెరువుల పరిరక్షణ వంటి చర్యలను పటిష్టంగా చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే అధికంగా భూగర్భ జలాలను వినియోగించే ప్రాంతాలను గుర్తించి, అక్కడ ప్రత్యేక సంరక్షణ చర్యలు చేపట్టాలి. ఇక పోతే ప్రజా భాగస్వామ్యం లేకుండా నీటి భద్రత సాకారం అయ్యే అవకాశం ఇసుమంతైనా లేదు. ఇళ్లలో నీటి వృథాను తగ్గించడం, లీకేజీలను వెంటనే సరిచేయడం, వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా ఇంకుడు గుంతల ఏర్పాట్లు వంటివి జనం స్వచ్ఛందంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విశ్వనగరం విస్తరణ ఆపడం సమస్యకు పరిష్కారం ఎంత మాత్రం కాదు.. అదే సమయంలో విస్తరిస్తున్న నగరానికి నీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి. , ఉన్న వనరులను ఎలా సంరక్షించాలన్నదానిపై దృష్టి సారించాలి. [Hyderabad Water Crisis, Ground Water Levels, Water Tankers, Drinking Water Hyderabad, Telugu One]
http://www.teluguone.com/news/content/hyderabad-water-crisis-24-234485.html
Chandrababu Naidu recieved a letter from Anna Hazare
గుంటూరు జిల్లా గురజాల శాసనసభ్యుడు యరపతినేని శ్రీనివాసరావు అరెస్టు నుండి తప్పించుకోవడానికి అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు
అసెంబ్లీలో నేతలు, మంత్రుల మధ్య మాటల యుద్ధం జరుగుతుంటుంది. ఒకరికొకరు ఎన్నెన్ని మాటలనుకున్నా ఫరవాలేదు. కోపంతో తిట్టుకున్నా బాధలేదు... కానీ వారి ఆవేశం అసెంబ్లీలోని బల్లలు, మైకులపై చూపిస్తేనే ఇబ్బంది. అసెంబ్లీలో తెలంగాణాపై అన్ని పార్టీలు తమ వైఖరులు చెబుతున్న నేపథ్యంలో స్పీకర్ లోక్‌సత్తా ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణ్‌కు మైక్ ఇవ్వడం.. ఆయన బంద్‌లవల్ల సరైన ట్రాన్స్పోర్ట్ లేక ప్రతిరోజూ 60మంది ఉద్యోగులను ఐబిఎం కంపెనీ విమానంలో బెంగుళూరు తీసుకెళుతోందని చెప్పారు.
ట్యాంక్ బండ్ పై కూలిన విగ్రహాలను మళ్ళీ ఏర్పాటు చేస్తాననటం తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టడమేనని, విగ్రహాలను ఏర్పాటు చేస్తే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే భాద్యత వహించాలని హరీష్ రావు హెచ్చరించారు. తెలంగాణా మార్చ్ కు పిలుపునిచ్చిన సమయంలో ప్రభుత్వం ఇలాంటి ప్రయత్నాలు చేయడం సరికాదని, తెలంగాణా వైతాళికుల విగ్రహాలు పెట్టకుండా ప్రభుత్వం వేరే విగ్రహాలు పెట్టడం ఈ ప్రాంత ప్రజలను అవమానించడమేనని అన్నారు.
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు నిరసనగా వామపక్షాలు భారత్‌బంద్ పిలుపునిచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా భారత్ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. డిపోల ఎదుట ఆందోళనలు చేస్తున్న పలువురు కార్యకర్తలు,నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. పలు జిల్లాలో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రభుత్వ, ప్రైవేలు విద్యా, వాణిజ్య సంస్థలు మూతపడ్టాయి. అయితే హైదరాబాద్‌లో బంద్ పాక్షికంగా కొనసాగుతోంది. రోడ్లపై బస్సులు యథావిథిగా తిరుగుతున్నాయి.
Nine persons were on Sunday killed and five others injured as several houses caved in following a series of cloudbursts in different areas of Uttarakhand’s Rudraprayag district, taking the death toll since Friday to 47. Cloudbursts struck four villages including Kirorimalla, Timli Badma, Dugur Shemla and Simbal on Sunday morning, in which nine persons died and five others were injured. With these deaths, the toll in Rudraprayag district in the last two days went up to 47, whereas, five persons were injured and 23 others still missing.
వై.ఎస్. రాజశేఖర రెడ్డి హయాంలో అక్రమంగా అనేక ప్రయోజనాలు పొంది దానికి బదులుగా జగన్ సంస్థల్లో పెట్టు బడులు పెట్టిన ముగ్గురు రెడ్డి పారిశ్రామికవేత్తలను సిబీఐ త్వరలో అరెస్టు చేయబోతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగు తోంది.
తెలంగాణా ప్రాంతంలో జరుగుతున్నా అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ముందస్తుదాడి వ్యూహాన్ని అమలు చేస్తోంది. టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ఆ పార్టీకి మద్దతునిస్తున్న ప్రజాసంఘాలు ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను తరిమికొట్టాలని పిలుపునిచ్చాయి.
మాజీ నక్సలైట్ జడల నాగరాజు ఆచూకీ చాలాకాలంగా తెలియడంలేదు. రెండున్న నెలల క్రితం అతను అదృశ్యమయ్యాడు. గతంలో పోలీసులకు కోవర్ట్ గా పనిచేసిన నక్సలైట్ నాగరాజు మావోయిస్టులపై కోలుకోలేని దెబ్బకు కారణమయ్యాడు.
డప జిల్లాలో సుమారు రూ.100 కోట్లు విలువైన వక్ఫ్ భూములు అన్యాక్రాంతమయ్యాయి. ఈ భూముల ఆక్రమణపై 1995 తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటుచేసిన సభాసంఘం జిల్లా అంతా పర్యటించి ఏఏ ప్రాంతలో వాక్ఫ్ భూములను ఎవరూ ఎంత ఆక్రమించుకున్నారో పరిశీలించింది.
నిరుపేద గ్రామీణ ప్రజలకు అత్యవసర సేవలతో పాటు మెరుగైన వైద్యం అందించే ఉద్దేశంతో ఏర్పాటుచేసిన 104 వైద్యసేవా విభాగాన్ని క్రమంగా తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. కొద్ది నెలల క్రితం వరకు వీరికి సక్రమంగా జీతాలు అందలేదు.





