జగన్‌కేనా ఇగో?.. పవన్‌కి ఇంకా ఎక్కవే...

Publish Date:Feb 24, 2022

Advertisement

"పవన్‌పై కక్ష సాధింపు ద్వారా సాధించేది ఏంటి?.. ఏ సినిమా తీసినా ఆయన రెమ్యూనరేషన్‌ ఆయనకొస్తుంది.. సీఎం జగన్‌ తీసుకున్న చర్యల వల్ల పవన్‌కు వచ్చిన నష్టమేమీ లేదు.. ఏదైనా ఉంటే నేరుగా తేల్చుకోండి.. జగన్‌కేనా ఇగో ఉండేది? ఇగో.. అందరికీ ఉంటుంది.. ప్రతి ఒక్కరికి ఇగో ఉంటుంది.. స్వతంత్రంగా కష్టపడి పైకి వచ్చిన పవన్‌ కల్యాణ్‌ లాంటి వారికి ఇంకా ఎక్కవగానే ఉంటుంది.. అయితే అన్ని సందర్భాల్లో ఇది పని చేయదు.. వీలుంటే మంచి పనులు చేసి ప్రజల మెప్పు పొందాలి.. సీఎం జగన్‌ కక్ష సాధింపు చర్యలు ఆపాలి.."

"ఏ ఒక్క డైరెక్టర్‌ కూడా ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి షూటింగ్‌ చేయరు.. చిరంజీవి గారిని చూస్తే  ఏడుపొచ్చింది.. కింది స్థాయి నుంచి స్వయం కృషితో పైకొచ్చిన వ్యక్తి ఆయన. దీనాతి దీనంగా చేతులు జోడించి జ‌గ‌న్‌ను అడిగారు.. ఆ పరిస్థితి ఎవరికీ రావొద్దు.. చిరంజీవి సైతం మిమ్మల్ని చేతులు జోడించి ప్రాథేయపడాలా? ఆయనకు ఏం తక్కువ? చేతులు జోడించి అడిగారంటే ఆయన బతుకుదెరువు కోసం కాదు.. ఆయన్ను పైకి తెచ్చిన సినిమా ఇండస్ట్రీ కోసం అడిగారు.. సినిమా ఇండస్ట్రీపై కక్ష సాధిస్తే థియేటర్‌ వద్ద పల్లీలు అమ్మే వ్యక్తి నుంచి లైట్‌ బాయ్‌ వరకు అందరూ నాశనమైపోతారు.." 
 
"తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది.. కక్ష సాధింపు చర్యల వల్ల ఏపీలో సినీ పరిశ్రమకు మనుగడ లేకుండా పోతుంది.. అంతేకానీ సినీ నటులకు ఎలాంటి నష్టం ఉండదు.. ఎమ్మార్వోలు, పోలీసులు అంతా కలిసి సినిమా థియేటర్లపై పడ్డారు.. లా అండ్‌ ఆర్డర్‌ను పోలీసులు మర్చిపోయారు.." 

"జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నటించిన భీమ్లా నాయ‌క్‌ సినిమా ప్రివ్యూ కార్యక్రమంలో స్వయంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.. తెలంగాణలోని సదుపాయాలను సినిమా వాళ్లు వినియోగించుకోవాలని కేటీఆర్‌ కోరారు.. కేటీఆర్‌ హాజరవడంతో పవన్‌ కల్యాణ్‌కి ప్రజల్లో మరింత మంచి పేరు వచ్చింది.. సినీ పరిశ్రమను నాశనం చేయొద్దు.. ఇది ఏపీ మనుగడకు మంచిది కాదు.. ఏదైనా ఉంటే ప్రత్యక్ష చర్యలు తీసుకోవాలి.. సినీ పరిశ్రమ విషయంలో ఇప్పటికైనా సీఎం జగన్‌ తన వ్యవహార శైలిని మార్చుకోవాలి.. సీబీఐ అధికారుల మీద కూడా కేసులు పెడుతున్నారు.. ఆంధ్రప్రదేశ్‌లో ఎవరూ ఉండకూడదా?.. నిన్ను ఎవరూ క్షమించడంలా." 

ఇదంతా ప్ర‌జ‌లు చ‌ర్చించుకుంటున్న విష‌యాలు కాదు... తాడిప‌త్రి మున్సిప‌ల్ ఛైర్మ‌న్‌, టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి చేసిన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు. 

By
en-us Political News

  
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.