నిశ్శబ్దంగా రాలిపోతున్న విద్యా కుసుమాలు!

Publish Date:Apr 23, 2026

Advertisement

భారతదేశంలోని అత్యుత్తమ విద్యాసంస్థలు ప్రస్తుతం తీవ్రమైన మానసిక ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఒకప్పుడు కలల సౌధాలుగా వెలుగొందిన ఈ ప్రతిష్ఠాత్మక విద్యాలయాలు..  నేడు విద్యార్థుల ఆత్మహత్యల వేదికలుగా మారుతున్నాయి.  కేవలం అకడమిక్ విజయాలకే ప్రాధాన్యతనిస్తూ, విద్యార్థుల మానసిక స్థితిని విస్మరించడం వల్ల ఈ పరిస్థితి దాపురిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గడచిన దశాబ్ద కాలంలో విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య భయంకరంగా పెరిగింది. 

2011లో సుమారు ఆరు వేల పైచిలుకు ఉన్న ఈ ఆత్మహత్యల సంఖ్య   2023 నాటికి పదమూడు వేల మార్కును దాటడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే..  దేశ జనాభా పెరుగుదల రేటు కంటే విద్యార్థుల ఆత్మహత్యల రేటు వేగంగా పెరుగుతోంది.  15 నుండి 20 ఏళ్ల లోపు యువతలో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది.  అందులోనూ నీట్, జేఈఈ, ఐఐటి  వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులలో ఈ ఆత్మహత్యలు భారీగా ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి.  రాజస్థాన్, తెలంగాణ  తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఇటువంటి కేసులు అధికంగా నమోదవుతున్నాయి.  కేవలం ప్రవేశం పొందే వరకే కాకుండా, లోపలికి వెళ్ళిన తర్వాత కూడా గ్రేడ్లు, ప్లేస్‌మెంట్లు మరియు పబ్లికేషన్ల పేరిట విద్యార్థులను నిరంతరం వేధించే ఒక రకమైన  అదృశ్య వలయం  ఇక్కడ రాజ్యమేలుతోంది. 

విద్యార్థిని ఒక వ్యక్తిగా కాకుండా కేవలం పర్ఫార్మెన్స్ ఇచ్చే యంత్రంగా చూడటం వల్ల వారు ఒంటరితనానికి, అపరాధభావానికి లోనవుతున్నారు.ముఖ్యంగా ఉన్నత విద్యాసంస్థల్లోని పరిశోధక విద్యార్థులు  తమ గైడ్‌లపై పూర్తిగా ఆధారపడాల్సి రావడం, అక్కడ నెలకొన్న పక్షపాత ధోరణులు వారిని తీవ్ర వేదనకు గురిచేస్తున్నాయి. తమపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల త్యాగాలను తలుచుకుంటూ..  వైఫల్యాన్ని భరించలేక చాలామంది విద్యార్థులు తమ గోడును ఎవరికీ చెప్పుకోలేక పోతున్నారు. 

క్యాంపస్‌లలో కౌన్సెలర్ల కొరత, మానసిక ఆరోగ్య సమస్యలను బలహీనతగా చూసే ధోరణి ఈ సంక్షోభాన్ని మరింత పెంచుతోంది. ఈ విపత్కర పరిస్థితుల నుండి విద్యార్థులను కాపాడుకోవడానికి విద్యా వ్యవస్థలో సమూల మార్పులు రావాల్సిన అవసరం ఉంది. కేవలం ర్యాంకులు, ప్యాకేజీలనే ప్రామాణికంగా తీసుకోకుండా, విద్యార్థుల మానసిక ధైర్యాన్ని పెంచే దిశగా చర్యలు చేపట్టాలి. కేంద్ర విద్యాశాఖ కూడా దీనిపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రతి విద్యాసంస్థలో పటిష్టమైన కౌన్సెలింగ్ వ్యవస్థను, సహాయక బృందాలను ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. విద్యార్థులు ప్రాణాలతో ఉండి తమను తాము నిరూపించుకున్నప్పుడే ఆ విద్యా వ్యవస్థకు నిజమైన విలువ దక్కుతుంది.

- సీతారాం కంఠంనేని

By
en-us Political News

  
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెపై ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తూ స్పందించింది.
దేవాదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ కాళింగిరి శాంతికి సంబంధించి విజయవాడ ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందని ఆరోపిస్తూ, మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందని బండి సంజయ్ మండిపడ్డారు.
తమిళనాడు మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సాయంత్రంతో ముగిసింది.
రాష్ట్రంలో అత్యంత చర్చనీయాంశంగా మారిన పీసీ ఘోష్ కమిషన్ నివేదిక వ్యవహారం మరో మలుపు తిరిగింది.
చాయ్ అంటే ప్రాణం పెట్టే నగరం హైదరాబాద్. ఉదయం కప్పు నుంచి అర్ధరాత్రి స్టాల్ వరకూ చాయ్ లేకుండా రోజే కదలదు.
అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా వద్దు జగ్గారెడ్డి సంచలన పోస్ట్
ఇరాన్‌పై అగ్రదేశం అమెరికాతో కలిసి దాడి చేయాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెనత్యాహూ ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారంట
ఒక మత చిహ్నానికి ప్రాధాన్యతనిచ్చి, మరో మత సంప్రదాయాలను కించపరచడం సెలెక్టివ్ టార్గెటింగ్ అని నెటిజన్లు విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియా వేదికగా లెన్స్ ‌కార్ట్ పట్ల వ్యతిరేకత పెచ్చరిల్లడంతో.. బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే సూచనలు కనిపించడంతో.. సంస్థ సీఈఓ పేయుష్ బన్సల్ రంగంలోకి దిగారు.
తెలంగాణలోని వరంగల్ జిల్లా నర్సంపేటలో తీవ్ర విషాదకర సంఘటన చోటు చేసుకుంది.
ఒకటి.. హిజాబ్, టర్బన్ అనుమతి.. అంటే నల్లరంగు హిజాబ్, నల్ల టర్బన్ ధరించవచ్చు. హిజాబ్ ఛాతీ వరకు కవరేజ్ ఉండాలి, కంపెనీ లోగో కనిపించేలా ఉండాలి. అయితే బుర్ఖా మాత్రం స్టోర్లో అనుమతించబడదని గైడ్లో ఉంది. రెండు..బొట్టు, తిలకం చేతితాడుపై నిషేధం.. ఆ డాక్యమెంట్ లో మత చిహ్నం అయిన తిలకం, బింది, స్టిక్కర్ లకు అనుమతి లేదని స్పష్టంగా ఉంది. అలాగే మతపరంగా చేతికి కట్టుకుని తాడు కూడా నిషేధం అని విస్పష్టంగా ఉంది.
ఢిల్లీ హత్యాచార నిందితుడు క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ చూసి పోలీసులే నోరెళ్ల పెడుతున్నారు
ఒంటిమిట్ట అర్చకులకు టీటీడీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.