Publish Date:Apr 23, 2026
చాయ్ అంటే ప్రాణం పెట్టే నగరం హైదరాబాద్. ఉదయం కప్పు నుంచి అర్ధరాత్రి స్టాల్ వరకూ చాయ్ లేకుండా రోజే కదలదు. అలాంటి నగరంలోనే ఇప్పుడు “నకిలీ చాయ్ పత్తా” కలకలం రేపింది. ఆహార కల్తీ నిఘా విభాగం పోలీసులు నిర్వహించిన భారీ ఆపరేషన్‌లో నకిలీ చాయ్ తయారీ ముఠా బండారం బయటపడింది. ఒకేసారి నగరంలోని 15 ప్రాంతాల్లో దాడులు జరిపిన హెచ్-పాస్ ప్రత్యేక బృందం, ఈ అక్రమ వ్యాపారం వెనుక ఉన్న 10 మంది సభ్యులను అరెస్ట్ చేసి... వారి వద్ద నుంచి 4,000 కిలోల నకిలీ చాయ్ పత్త,1,500 కిలోల గడువు ముగిసిన టీ పొడి 100 కిలోల నకిలీ నల్ల బెల్లం స్వాధీనం చేసుకోవడం నగరంలో కల్తీ వ్యాపారం ఎంత పెద్ద స్థాయిలో నడుస్తోందో చెబుతోంది.
10మంది కేటుగాళ్లు కలిసి తక్కువ నాణ్యత గల చాయ్ పత్తాలో సింథటిక్ రంగులు కలిపి, ఆకర్షణీయమైన రంగుతో “బ్రాండ్ టీ”లా మార్చి ప్రజలు విశ్వసించే ప్రముఖ బ్రాండ్ల పేర్లు ఉపయోగించి మార్కెట్లో దర్జాగా విక్రయిస్తు న్నారు..
ఈ సింథటిక్ రంగులు స్వీట్లలో మాత్రమే పరిమితంగా వాడాలి. కానీ చాయ్ పత్తాలో ఉపయోగించడం వల్ల కడుపు నొప్పి, అలర్జీలు,జీర్ణ సమస్యలు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఈ నకిలీ టీ పౌడర్ ను ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు తెచ్చి, నగరంలో ప్రాసెస్ చేసి మార్కెట్లోకి పంపుతున్నట్లు పోలీసులకు విశ్వాసనీయమైన సమాచారం రావడంతో దాడులు చేసి 10మంది కేటుగాళ్లు ను అదుపులోకి తీసుకున్నారు.
కల్తీ ఆహార వ్యాపారంపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని అధికారులు స్పష్టం చేశారు. కల్తీ తయారీ లేదా విక్రయం చేసిన వ్యాపారులపై ట్రేడ్ లైసెన్స్ రద్దు చేయడమే కాకుండా అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుం టామని హెచ్చరించారు. అంతేకా కుండా వినియోగదారులు “చాయ్ కొనేటప్పుడు బ్రాండ్ నిజస్వరూపం, ప్యాకింగ్, వాసన, నాణ్యత తప్పనిసరిగా పరిశీలించాలి” అని అధికారులు సూచించారు...నగరానికి ఇష్టమైన చాయ్ కప్పులో ఇప్పుడు కల్తీ నీడ పడిన నేపథ్యంలో… వినియోగదారుల జాగ్రత్తే రక్షణ అని పోలీసులు చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/fake-tea-gang-arrested-36-218097.html
తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ తొలిసారి అధికారికంగా కరూర్ జిల్లాలో పర్యటించనున్నారు. గతేడాది జరిగిన తొక్కిసలాట దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 41 మంది బాధితుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగ పత్రాలను అందజేయడంతో పాటు, నూతన పారిశ్రామిక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ పర్యటన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
కేవలం 4 నెలల్లోనే 140 శాతం పెరిగి, 3 రోజుల్లో 18 శాతం లాభంతో సరికొత్త రికార్డు సృష్టించిన స్మాల్‌క్యాప్ ఏరోస్పేస్ స్టాక్ ఏక్వస్ (Aequs) గురించిన పూర్తి వివరాలు, భవిష్యత్ టార్గెట్ ధరలు ఇక్కడ తెలుసుకోండి.
విశాఖపట్నం భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. పాత ఎయిర్‌పోర్ట్ నుంచి విమానాలన్నీ ఇక్కడికే మారాయి. ప్రయాణ సమయం, దూరం, టెర్మినల్ అప్‌డేట్స్ మరియు విమానయాన సంస్థలు జారీ చేసిన కీలక జాగ్రత్తల పూర్తి వివరాలు ఈ వెబ్ స్టోరీలో తెలుసుకోండి.
స్విగ్గీ మరియు ఎటర్నల్ షేర్లు 7 శాతం వరకు భారీగా పెరిగాయి. విదేశీ పెట్టుబడుల వాటా 50 శాతం కంటే తగ్గడం మరియు క్విక్ కామర్స్ మార్జిన్ల బూస్ట్ అవకాశాలపై బ్రోకరేజ్ సంస్థల లేటెస్ట్ రేటింగ్స్, టార్గెట్ ధరల పూర్తి వివరాలు మీకోసం.
భారతదేశంలోని మహిళా సంక్షేమ పథకాలతో లబ్ధిదారుల బ్యాంకు బ్యాలెన్స్ 84% పెరిగింది. మహారాష్ట్ర లాడ్కీ బహిన్ , ఒడిశా సుభద్ర యోజన పథకాల వల్ల నెలవారీ ఖర్చులు, యూపీఐ డిజిటల్ లావాదేవీలు మరియు కుటుంబ ఆర్థిక స్థిరత్వం ఎలా పెరిగాయో EAC PM తాజా నివేదిక ఆధారంగా తెలుసుకోండి.
భారత్ vs ఇంగ్లాండ్ 4వ టీ20 మ్యాచ్‌లో టీమిండియా భారీ మార్పులతో బరిలోకి దిగుతోంది. సంజు శాంసన్ రీఎంట్రీ ఇస్తుండగా, తిలక్ వర్మ మరియు వైభవ్ సూర్యవంశీ అవుట్ కానున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతంలో రాత్రంతా కురిసిన భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో వాతావరణ అప్‌డేట్స్, ట్రాఫిక్ జామ్స్ మరియు వర్షపాతం వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
జూలై 9 గురువారం నాడు దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ సహా ప్రముఖ నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ పసిడి తాజా రేట్లను ఇక్కడ తెలుసుకోండి.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సరికొత్త EPS Scheme 2026 తో ఉద్యోగుల పెన్షన్ విధానంలో భారీ మార్పులు జరిగాయి. కేవలం 20 రోజుల్లోనే క్లెయిమ్ సెటిల్‌మెంట్, ఆలస్యమైతే 12% పెనాల్టీ వడ్డీతో పాటు పాత స్కీమ్ EPS 1995 కు మరియు కొత్త విధానానికి గల ముఖ్యమైన తేడాలను ఈ స్టోరీలో పూర్తిగా తెలుసుకోండి.
కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్ సుంకం Customs Duty మినహాయింపులను భారీగా విస్తరించడంతో డిక్సన్ టెక్, సిర్మా ఎస్జీఎస్, అంబర్ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు 6 శాతం వరకు పెరిగాయి. 2029 వరకు వర్తించే ఈ కొత్త రూల్స్ ఎలక్ట్రానిక్స్ రంగాన్ని ఎలా మార్చబోతున్నాయో ఇక్కడ చూడండి.
భారత ఆర్థిక రంగంలో చారిత్రక మైలురాయి తొలిసారిగా ఎఫ్‌ఐఐ FII ఆస్తులను అధిగమించి రూ. 76.41 లక్షల కోట్లకు చేరిన దేశీయ మ్యూచువల్ ఫండ్స్ ఆస్తులు. పూర్తి వివరాలు మరియు ఆసక్తికర గణాంకాలు ఇక్కడ చూడండి.
ఐసీఐసీఐ బ్యాంక్ షాపింగ్ ఫెస్టివల్ ఆఫర్లు ఈరోజు అర్ధరాత్రితో ముగియనున్నాయి. ఎలక్ట్రానిక్స్, ఈ-కామర్స్, ఫ్యాషన్ వస్తువులపై ₹7,500 వరకు డిస్కౌంట్ పొందే పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
న్యూజిలాండ్‌లో ఉన్నత చదువుల కోసం ఇమ్మిగ్రేషన్ శాఖ సరికొత్త పాత్‌వే స్టూడెంట్ వీసా (PSV) నిబంధనలను తెచ్చింది. ఒకే వీసాతో ఐదేళ్లలో 3 కోర్సులు చదివే ఈ కొత్త రూల్స్, అర్హతల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.