సగర్వంగా నిల‘బడి’.. టెన్త్‌లో ప్రభుత్వ స్కూళ్ల ఘనత

Publish Date:May 1, 2026

Advertisement

 

మామూలుగా టెన్త్, ఇంటర్ వంటి రిజల్ట్స్ అంటే వార్తా పత్రికల్లో మరుసటి రోజంతా ఆ హడావుడే కనిపిస్తుంది.  వార్తా పత్రికల ఫస్ట్ పేజీలో కార్పొరేట్ స్కూళ్ల ప్రకటనలు కనిపించడం సహజం. తమ స్కూల్ విద్యార్థులు సాధించిన మార్కులు, వచ్చిన ర్యాంకులతో యజమాన్యాలు ఫుల్ పేజీ యాడ్స్ ఇస్తుంటాయి. అయితే ఈసారి ఏపీలో టెన్త్ క్లాస్ రిజల్ట్ వచ్చాక సరికొత్త ట్రెండ్ కనిపించింది. ఏపీ ప్రభుత్వమే పత్రికల్లో ప్రకటనలు ఇచ్చింది. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులను చేర్పించాలని కోరుతూ.. సర్కారు బడుల్లో చదివి స్టేట్ ర్యాంకులు సాధించిన విద్యార్థుల ఫొటోలను ప్రచురించడం విశేషం

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాలను గురువారం వెల్లడించారు. విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా ఫలితాలను రిలీజ్ చేశారు. ఈ సంవత్సరం టెన్త్ క్లాసులో 85.15 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గవర్నమెంట్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులు సైతం కార్పొరేట్ స్కూళ్లలో చదువుతూన్న విద్యార్థులకు ధీటుగా మార్కులు సాధించారు. దీంతో ఏపీ ప్రభుత్వం, పాఠశాల విద్యా శాఖ.. సగర్వంగా నిల‘బడి’ అంటూ.. ప్రభుత్వ బడులను ప్రమోట్ చేస్తూ దినపత్రికల్లో ప్రకటనలు ఇచ్చింది. 

సర్కారు బడుల్లో చదివినప్పటికీ స్టేట్ ర్యాంక్ స్థాయి మార్కులు సాధించిన విద్యార్థినీ విద్యార్థుల ఫొటోలు, వారు సాధించిన మార్కులు, చదువుకున్న పాఠశాల వివరాలను ఈ ప్రకటనలో ప్రచురించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన నలుగురు విద్యార్థినులకు ఏకంగా 596 మార్కులు రాగా.. 9 మంది 595 మార్కుల చొప్పున సాధించడం విశేషం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారిలో 13 మంచి ర్యాంకులు సాధిస్తే.. అందులో 12 మంది బాలికలే కావడం విశేషం.

మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలుపుతూ.. ఇందుకు కారణమైన టీచర్లు, సిబ్బందికి విద్యాశాఖ ధన్యవాదాలు తెలిపింది. ‘అమ్మలా శిక్షణ.. నాన్నలా రక్షణ.. స్నేహపూర్వక బోధన.. ప్రభుత్వ బడుల్లో పిల్లలను చేర్పించండి.. వారి బంగారు భవితకు బాటలు వేయండి’ అని ఏపీ విద్యా శాఖ పిలుపునిచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచడానికి, విద్యార్థులను మెరికల్లా తీర్చిదిద్దడానికి ఏపీ ప్రభుత్వం గత కొన్నేళ్లుగా వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తోంది.  

కూటమి ప్రభుత్వం లెర్నింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (ఎల్ఈఏపీ) లాంటి కొత్త ప్రాజెక్టులతో విద్యా రంగం స్వరూపాన్ని మార్చేస్తోంది. విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.  ఏఐ టెక్నాలజీ, డిజిటల్ టూల్స్ వినియోగంపై వర్క్ షాప్‌లు నిర్వహిస్తున్నారు. 2029 నాటికి విద్యారంగంలో ఏపీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో నారా లోకేశ్ ఆధ్వర్యంలో విద్యాశాఖ అధికారులు పని చేస్తున్నారు.

By
en-us Political News

  
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.
హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సీతారాం ఆత్మహత్య కేసులో రోజుకో కొత్త మలుపు వెలుగులోకి వస్తోంది.
అమెరికా అధ్యక్షుడి మానసిక స్థితి సరిగ్గానే ఉందా.. అన్న అంశం మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న హెన్రిచ్ క్లాసెన్ ప్రదర్శనపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ప్రశంసలు కురిపించాడు.
శంషాబాద్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఒక తెలుగు యువకుడు చదువు పూర్తి చేసుకుని, ఉద్యోగం దొరక్క.. కుటుంబానికి భారమయ్యానన్న వేదనతో అక్కడే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ నూతన డైరెక్టర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి అవినాష్ మహంతి బాధ్యతలు స్వీకరించారు.
నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక మహానాడు నిర్వహణకు కసరత్తులు వేగవంతమయ్యాయి.
కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్రంలో లేబర్ అడ్డాలను ఏర్పాటు చేస్తున్నామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.
తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు.
సంగారెడ్డి జిల్లాలో టీజీఆర్టీసీ అధికారుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ హైకోర్టు, సివిల్ కోర్టులో మెరిట్స్‌పై విచారణ పూర్తయ్యే వరకు ఆమె పరువుకు భంగం కలిగించే కథనాలు ప్రచురించవద్దని మీడియా సంస్థలు, కంటెంట్ క్రియేటర్లు, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వులతో సంబంధం లేకుండా సివిల్ కోర్టు పిటిషన్ విచారణ కొనసాగిం చాలని కూడా హైకోర్టు స్పష్టం చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.