రాహుల్ కు మళ్లీ ఈడీ సమన్లు
Publish Date:Jun 3, 2022
Advertisement
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి ఈడీ మళ్లీ సమన్లు పంపింది. ముందుగా పంపిన సమన్ల ప్రకారం రాహుల్ గాంధీ గురువారం ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉంది. అయితే ఆయన విదేశీ పర్యటనలో ఉన్న కారణంగా ఈడీ ఎదుట హాజరు కాలేదు. హాజరయ్యేందుకు మరి కొంత సమయం కావాలని రాహుల్ కోరారు. ఈ మేరకు తమకు సమాచారం అందిందని ఈడీ పేర్కొంది. అయితే శుక్రవారం మరోసారి రాహుల్ కు ఈడీ సమన్లు పంపించింది. ఈ సారి ఈనెల 13న ఈడీ విచారణకు రావాలని ఆ సమన్లలో పేర్కొంది. ఇలస్ట్రేటెడ్ విక్లీ మనీ లాండరింగ్ కేసులో ఈడీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె కుమారుడు, పార్టీ సీనియర్ నాయకుడు అయిన రాహుల్ కు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈడీ సమన్ల మేరకు సోనియాగాంధీ ఈనెల 8న ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉండగా, ఆమె కరోనా బారిన పడ్డారు. అప్పటికి కోలుకుంటే సోనియాగాంధీ ఈడీ ఎదుట విచారణకు హాజరౌతారని కాంగ్రెస్ అధికార ప్రతినిథి రణదీప్ సింగ్ సూర్జేవాలా తెలిపారు. ఇంతకీ ఇలస్ట్రేటడ్ వీక్లీ కేసు ఏమిటంటే.. రాహుల్ గాంధీ డైరెక్టర్ గా ఉన్న యంగ్ ఇండియా లిమిటెడ్ అనే సంస్థ ద్వారా ఎజెఎల్ అనే కంపెనీని రాహుల్ కొనుగోలు చేశారంటూ బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ఫిర్యాదుతో ఇలస్ట్రేటెడ్ వీక్లీ మనీలాండరింగ్ వ్యవహారం వెలుగులోనికి వచ్చింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం పీఎంఎల్ఎ) కింద సోనియాగాంధీ, రాహుల్ గాంధీ వాంగ్మూలాలు నమోదు చేయనున్నట్లు ఈఢీ పేర్కొంది. ఈ మేరకు వారికి సమన్లు పంపింది. కాగా రాజకీయ ప్రత్యర్థులను కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా కేంద్రంలోని మోడీ సర్కార్ వేధిస్తున్నదని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది.
http://www.teluguone.com/news/content/ed-summons-again-to-rahul-gandhi-25-136965.html





