వివేకాహత్య కేసులో ఈడీ ఎంట్రీ.. జరిగేదేంటంటే?
Publish Date:Aug 22, 2026
Advertisement
తెలుగు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇప్పుడు ఈడీ రంగప్రవేశం చేసింది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన సన్నిహితుల నివాసాలలో ఏకకాలంలో విస్తృత సోదాలు నిర్వహించింది. 2019 మార్చిలో జరిగిన వివేకా హత్య వెనుక 40 కోట్ల సుపారీ ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందులో రూ.1 కోటి అడ్వాన్స్‌గా ఇచ్చారని, అందులో రూ.70 లక్షలు రికవరీ అయ్యాయని వార్తలు వచ్చాయి. మరి ఇప్పుడు దాదాపు ఏడేళ్ల తరువాత ఈడీ సోదాలు నిర్వహించిందంటే ఏం జరుగుతోంది? ఆర్థిక లావాదేవీలు, మనీ ల్యాండరింగ్ కోణంలో ఈడీ ఎలాంటి కీలక ఆధారాలు సేకరించబోతోంది? అన్న విషయంపై ప్రముఖ సామాజిక, రాజకీయ విశ్లేషకుడు, ఏపీ కమ్మకార్పొరేషన్ చైర్మన్ అడుసుమిల్లి శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. అదలా ఉంటే.. ప్రజా కోర్టులో వివేకా హత్య కేసులో తీర్పు వచ్చేసిందన్న అడుసుమిల్లి శ్రీనివాసరావు.. బాధితురాలైన కుమార్తెకు చట్టబద్ధంగా న్యాయం జరిగాల్సి ఉందన్నారు. అర్ధరాత్రి హత్య జరిగితే, తెల్లవారక ముందే ఫోన్ కాల్స్ వెళ్లడం, సాక్ష్యాధారాలు తుడిచిపెట్టే ప్రయత్నం జరగడంపై ఇప్పటికీ అనేక ప్రశ్నలు ఉన్నాయి? అయితే ఇప్పుడు ఈ కేసులో ఈడీ ఎంట్రీ.. 40 కోట్ల సుపారీ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరెవరి ఖాతాల నుంచి ఎక్కడికి బదిలీ అయింది? అన్నది తేల్చడమే.. అయితే ఇప్పుడు ఇక ఈడీ సోదాల వల్ల ఒరిగిందేమీ ఉండదన్న అడుసుమిల్లి.. ఆ 40 కోట్లు వీళ్లకి రోడ్డు మీద దొరికాయని ఈడీ ముక్తాయించేసినా ఆశ్చర్యంలేన్నారు. ఏది ఏమైనా, ఓ మాజీ ఎంపీ, మాజీ మంత్రి స్వగృహంలోనే హత్యకు గురైతే.. ఏళ్లు గడుస్తున్నా బాధ్యులకు సరైన శిక్ష పడకపోవడం వ్యవస్థల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఈడీ దర్యాప్తులోనైనా అసలు సూత్రధారులు బయటకు వస్తారా? లేక ఇది కూడా కేవలం విచారణలకే పరిమితమవుతుందా చూడాల్సి ఉంది. ED entry in YS Viveka Murder Case, ED Investigation AP, Avinash Reddy ED Raids, Dastagiri Statement, YS Jagan Mohan Reddy, AP Politics, TeluguOne
ఈ కేసులో కీలక సాక్షులు కొందరు ఇప్పిటికే అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో అప్రూవర్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం కీలకంగా మారింది. జైలులో బెదిరింపులు వచ్చినా, కోట్లాది రూపాయల ఆఫర్లు ఇచ్చినా లొంగకుండా దస్తగిరి మెజిస్ట్రేట్ ముందు వివరాలు వెల్లడించారు.
http://www.teluguone.com/news/content/ed-entry-in-ys-viveka-murder-case-39-229558.html





