కొత్త సంవత్సరం ప్రారంభ వేళ జపాన్‌ను భారీ భూకంపం కుదిపేసింది. జపాన్ తూర్పు నోడా తీర ప్రాంతంలో బుధవారం (డిసెంబర్ 31) భూమి కంపించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6గా నమోదైంది. కొత్త సంవత్సర వేడుకలకు జపాన్ ముస్తాబవుతున్న వేళ భూమి కంపించడంతో జనం భయంతో వణికిపోయారు.
నోడా నగరానికి తూర్పున 91 కిలోమీటర్ల దూరంలో.. సముద్ర మట్టానికి 19.3 కిలోమీటర్ల లోతున ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ భూకంపం కారణంగా ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు. సునామీ ముప్పు లేదని అధికారులు తెలిపారు. అయితే గత కొన్ని వారాలుగా జపాన్ లో తరచూ భూమి కంపిస్తున్నది. డిసెంబర్ 8న జపాన్ ను రిక్టర్ స్కేలుపై 8 తీవ్రతతో సంభవించిన భూకపంపం అతలా కుతలం చేసిన సంగతి తెలిసిందే. ఆ భూకంపం కారణంగా దాదాపు 90 వేల మంది నిరాశ్రయులయ్యారు. అప్పట్లో అధికారులు సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/earth-quake-in-japan-36-211867.html
నవ్యాంధ్రలాంటి రాష్ట్రానికి అవసరమా? ఇంతకీ జగన్ పెట్టిస్తోన్న అనవసర ఖర్చులేవి? తాజాగా వెలుగులోకి వచ్చినదేంటి?
కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడుతూ హైడ్రా కీలక చర్యలు చేపట్టింది.
టీమిండియా స్టార్ క్రికెటర విరాట్ కోహ్లీ కొత్త సంవత్సరంలో మూడు ప్రపంచరికార్డులకు చేరువలో ఉన్నాడు.
నకిలీ మద్యం తయారీ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ , ఆయన సోదరుడు రాములును మరోసారి సిట్ అధికారులు ఇవాళ కస్టడీలోకి తీసుకున్నారు.
రేపు కొండగట్టు ఆంజనేయస్వామిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకొని మొక్కులు చెల్లించుకొనున్నారు
తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదల పరిష్కారానికి కేంద్ర కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ రాష్ట్రంలో మద్యం విక్రయాలు చరిత్రలోనే సరికొత్త రికార్డులను సృష్టించాయి.
ఆ మేరకు సిఫారసు లేఖలు, వీఐపీ, వీవీఐపీ దర్శనాలకు వచ్చే వారు కూడా టికెట్ తీసుకునే దర్శనం చేసుకోవాలన్న నిబంధన తీసుకురావాలని నిర్ణయించారు. అమ్మవారి హుండీ ఆదాయాన్ని, ఆలయ నిర్వహణ నిధులను పెంచడమే లక్ష్యంగా ఈ కొత్త నిబంధనను తీసుకొచ్చినట్లు చెప్పారు.
యూట్యూబర్ నా అన్వేషణ అన్వేష్‌పై నమోదైన కేసు రోజుకో మలుపు తిరుగుతోంది
మావోయిస్టు అగ్రనేత హెడ్మా ఎన్ కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీ సాయిధ బలగాల వ్యవహారాలు చూస్తున్న బర్సే దేవా లొంగుబాటుతో మావోయిస్టు పార్టీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయినట్లేనని పోలీసు అధికారులు భావిస్తున్నారు.
దుర్గం చెరువును అక్రమంగా ఆక్రమించారన్న ఆరోపణలపై దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేసు నమోదు అయింది.
కలెక్టర్ లైఫ్ జాకెట్ ధరించి ఉండటం.. అక్కడే ఉన్న స్విమ్మర్లు వెంటనే అప్రమత్తమై ఆయనను ఒడ్డుకు తీసుకురావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటన జరిగిన వెంటనే ఆయనను వేరే పడవలోనికి చేర్చారు.
నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే పాతాళ మెట్ల మార్గానికి సమీపంలోనే స్థానికుల నివాస ప్రాంతాలు ఉన్నాయి. అటువంటి చోట చిరుత సంచారం భయాందోళనలకు కలిగిస్తోంది.