తెలంగాణలో వాతావరణం కాశ్మీర్ ను తలపిస్తోంది. శీతాకాలంలో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో శుక్రవారం (జనవరి 2) ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుని ఉదయం ఎనిమిది గంటలకు కూడా విజిబులిటీ లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పది అడుగుల దూరంలో ఉన్న వాహనాలు కూడా స్పష్టంగా కనిపించని పరిస్థితి నెలకొంది. ద్విచక్ర వాహ నాలు, కార్లు, భారీ వాహ నాలు అన్నీ హెడ్‌లైట్లు వేసు కుని నెమ్మదిగా ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ముఖ్యంగా నాగార్జునసాగర్ హైవే మీదుగా ప్రయాణించే బస్సులు, లారీలు, ప్రైవేట్ వాహనాలు అప్రమత్తంగా కదలాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలో విస్తారమైన అటవీ ప్రాంతం ఉండటం, ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ లో నమోదు కావడంతో పొగమంచు ప్రభావం తీవ్రంగా ఉంది. ఇదే పరిస్థితి మరో రెండు మూడు రోజులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ దారిలో ప్రయాణించే వాహనదారులు అత్యంత జాగరూకతతో మెలగాలని సూచిస్తోంది. అదలా ఉంటే వాతావరణం మాత్రం తెల్లటి పొగమంచు తెరల మధ్య కాశ్మీర్ ను తలపించేలా అత్యంత సుందరంగా ఉందని స్థానికులు చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/dense-fog-in-telangana-36-211870.html
నవ్యాంధ్రలాంటి రాష్ట్రానికి అవసరమా? ఇంతకీ జగన్ పెట్టిస్తోన్న అనవసర ఖర్చులేవి? తాజాగా వెలుగులోకి వచ్చినదేంటి?
కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడుతూ హైడ్రా కీలక చర్యలు చేపట్టింది.
టీమిండియా స్టార్ క్రికెటర విరాట్ కోహ్లీ కొత్త సంవత్సరంలో మూడు ప్రపంచరికార్డులకు చేరువలో ఉన్నాడు.
నకిలీ మద్యం తయారీ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ , ఆయన సోదరుడు రాములును మరోసారి సిట్ అధికారులు ఇవాళ కస్టడీలోకి తీసుకున్నారు.
రేపు కొండగట్టు ఆంజనేయస్వామిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకొని మొక్కులు చెల్లించుకొనున్నారు
తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదల పరిష్కారానికి కేంద్ర కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ రాష్ట్రంలో మద్యం విక్రయాలు చరిత్రలోనే సరికొత్త రికార్డులను సృష్టించాయి.
ఆ మేరకు సిఫారసు లేఖలు, వీఐపీ, వీవీఐపీ దర్శనాలకు వచ్చే వారు కూడా టికెట్ తీసుకునే దర్శనం చేసుకోవాలన్న నిబంధన తీసుకురావాలని నిర్ణయించారు. అమ్మవారి హుండీ ఆదాయాన్ని, ఆలయ నిర్వహణ నిధులను పెంచడమే లక్ష్యంగా ఈ కొత్త నిబంధనను తీసుకొచ్చినట్లు చెప్పారు.
యూట్యూబర్ నా అన్వేషణ అన్వేష్‌పై నమోదైన కేసు రోజుకో మలుపు తిరుగుతోంది
మావోయిస్టు అగ్రనేత హెడ్మా ఎన్ కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీ సాయిధ బలగాల వ్యవహారాలు చూస్తున్న బర్సే దేవా లొంగుబాటుతో మావోయిస్టు పార్టీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయినట్లేనని పోలీసు అధికారులు భావిస్తున్నారు.
దుర్గం చెరువును అక్రమంగా ఆక్రమించారన్న ఆరోపణలపై దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేసు నమోదు అయింది.
కలెక్టర్ లైఫ్ జాకెట్ ధరించి ఉండటం.. అక్కడే ఉన్న స్విమ్మర్లు వెంటనే అప్రమత్తమై ఆయనను ఒడ్డుకు తీసుకురావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటన జరిగిన వెంటనే ఆయనను వేరే పడవలోనికి చేర్చారు.
నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే పాతాళ మెట్ల మార్గానికి సమీపంలోనే స్థానికుల నివాస ప్రాంతాలు ఉన్నాయి. అటువంటి చోట చిరుత సంచారం భయాందోళనలకు కలిగిస్తోంది.