హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ వినియోగంపై పోలీసు యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంటూ పబ్‌లపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని పబ్‌లపై ఈగల్ ఫోర్స్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. కోండాపూర్ ప్రాంతంలో ఉన్న ప్రముఖ నైట్‌లైఫ్ కేంద్రం క్వాక్ అరేనా పబ్లో జరిగిన భారీ ఈవెంట్ సందర్భంగా ఈగల్ ఫోర్స్ దాడులు చేసింది.
ఈ పబ్‌లో డీజే బ్లాక్ కాఫీ పేరుతో ప్రత్యేక సంగీత కార్యక్రమం నిర్వహించగా, నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో యువత హాజరైనట్లు పోలీసులు గుర్తించారు. ఈ సమాచారంతో ఈగల్ టీమ్ గురువారం (ఏప్రిల్ 2) రాత్రి అకస్మాత్తుగా తనిఖీలు చేపట్టింది.పబ్‌లో ఉన్నవారి కి అక్కడికక్కడే డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. పలువురి నుంచి యూరిన్ నమూనాలు సేకరించి ప్రాథమిక పరీక్షలు నిర్వ హించారు.
ఈ తనిఖీల్లో మొత్తం 8 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. డ్రగ్స్ వినియోగించినట్లు నిర్ధారణ కావడంతో వారిని అదుపు లోకి తీసుకుని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. డ్రగ్స్ సరఫరా కోణంలో విచారణ సాగిస్తున్నట్లు సమాచారం. ఈ దాడుల్లో భాగంగా పార్టీలో పాల్గొన్న పలువురికి లైవ్ డ్రగ్ టెస్టులు నిర్వహించడం విశేషం. కాగా ఈ సందర్భంగా ఈ పార్టీలో పాల్గొన్న నటి హేమకు కూడా డ్రగ్ టెస్ట్ నిర్వహించగా నెగిటివ్ వచ్చింది.
ఇందుకు సంబంధించి నటి హేమ ఒక వీడియో విడుదల చేశారు. పార్టీకి హాజరైన విషయాన్ని నటి హేమ స్వయంగా సామాజిక మాధ్యమంలో వెల్లడించి.. అధికారులు తన నుంచి యూరిన్ శాంపిల్ సేకరించి నిర్వహించిన పరీక్షలో తనకు డ్రగ్ టెస్ట్ నెగిటివ్ వచ్చినట్లు స్పష్టం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యం లోనే హేమ డ్రగ్ టెస్ట్ నిర్వహించిన కిట్‌తో వీడియో చేసి విడుదల చేశారు. తాను ఎప్పుడూ తప్పు చేయనని, నిజాయితీగా ఉండే వ్యక్తినని ఆమె పేర్కొన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/eagle-force-raids-pub-36-216606.html
మొదటి దశలో ఆలయం చుట్టూ పటిష్టమైన ప్రాకారం, సుదూర ప్రాంతాల నుండి సైతం భక్తులను ఆకర్షించే విధంగా ఏడు అంతస్తుల మహా రాజగోపురం, భక్తుల సౌకర్యార్థం ఆర్జిత సేవా మండపం, అద్దాల మండపంతో పాటు వాహన, రథ మండపాలను నిర్మించనున్నారు.
దర్యాప్తులో సంబంధిత కాలంలో ఆయనకు వివిధ వనరుల ద్వారా సుమారు 1.60 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందనీ, అదే కాలంలో 71.58 లక్షల రూపాయల మేర ఖర్చులు జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ లెక్కల ప్రకారం ఆయన వద్ద చట్టబద్ధంగా ఉండాల్సింది 88.42 లక్షల రూపాయలు మాత్రమేనని ఏసీబీ ఎఫ్ఐఆర్ లో పేర్కొంది.
విద్యా రంగం పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిని గర్హించారు. దీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శలు గుప్పించారు. కాగా ఈ సందర్భంగా పలు డిమాండ్లను విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వం ముందు ఉంచారు.
జింబాబ్వే పర్యటన కోసం ప్రకటించిన భారత టీ20 జట్టు ఎంపిక వివాదాస్పదంగా మారింది. ఐపీఎల్‌లో 501 పరుగులు చేసిన ఆర్సీబీ స్టార్ రజత్ పాటిదార్‌ను పక్కనపెట్టి, ఒక్క వికెట్ తీయని మయాంక్ యాదవ్‌కు చోటు ఇవ్వడంపై సోషల్ మీడియాలో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైజాగ్‌లో కాగ్నిజెంట్ ఐటీ సెజ్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్. మధురవాడ, రుషికొండ, ఎండాడ ప్రాంతాల్లో భారీగా పెరుగుతున్న ఇళ్ల అద్దెలు మరియు కొత్త ఐటీ ఉద్యోగాల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి, తిరుపతి ఆర్థిక ప్రాంతాల మాస్టర్ ప్లాన్ కోసం 6 నెలల డెడ్‌లైన్ విధించారు. స్వర్ణ ఆంధ్ర 2047 లక్ష్యాలు, వైజాగ్ బే సిటీ ప్రాజెక్ట్ విశేషాలు మరియు రాయలసీమ హార్టికల్చర్ విప్లవంపై పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయానికి వెళ్లే వారికి ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. హెబ్బాల్ నుంచి ఎయిర్‌పోర్ట్ వరకు రూ.35 కోట్లతో నిర్మించనున్న సిగ్నల్ రహిత కారిడార్, సదాహళ్లి అండర్‌పాస్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
వ్యవస్థీకృత దుష్ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకునే క్రమంలో.. రాజ్యాంగం కల్పించిన భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు, ప్రజాస్వామ్య చర్చలకు, చట్టబద్ధమైన విమర్శలకు ఎలాంటి భంగం కలగకుండా పోలీసులు వ్యవహరించాలని స్పష్టం చేశారు.
ఇరాన్ అంతు చూస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఫినిష్ ది జాబ్ అంటూ ఓవల్ ఆఫీస్ నుండి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, టెహ్రాన్‌లో వ్యక్తమవుతున్న ప్రతీకార జ్వాలల వెనుక ఉన్న అసలు కారణాలు మరియు పూర్తి వివరాలు ఈ వెబ్ స్టోరీలో చూడండి.
బజాజ్ ఆటో సంస్థ ప్రకటించిన రూ. 5,633 కోట్ల మెగా బైబ్యాక్ ఆఫర్ నేటితో ముగియనుంది. ఒక్కో షేరును రూ. 12,000 చొప్పున 20% ప్రీమియం ధరతో కొనుగోలు చేస్తున్న కంపెనీ. అర్హత వివరాలు, ముగింపు గడువు మరియు నిపుణుల సూచనలు ఇక్కడ చదవండి.
ఆత్మహత్యకు ప్రేరేపించడంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కృష్ణలంక పోలీసులు నాగరాజుపై కేసు నమోదు చేశారు.
ఇన్కమ్ టాక్స్ సెక్షన్ 143(3) కింద స్క్రూటినీ నోటీసు వచ్చిందా? ఆందోళన పడకుండా ఆన్‌లైన్‌లో DIN నంబర్ వెరిఫై చేసుకునే విధానం, నోటీసును నిర్లక్ష్యం చేస్తే పడే 50% నుండి 200% భారీ జరిమానాలు మరియు e Proceeding ద్వారా సురక్షితంగా స్పందించే పూర్తి వివరాలు ఈ వెబ్ స్టోరీలో చూడండి.